తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Og Update: పవన్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్‌ల నుంచి అప్‌డేట్స్

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్‌ల నుంచి అప్‌డేట్స్

Hari Prasad S HT Telugu

12 May 2023, 11:40 IST

google News
    • OG Update: పవన్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త ఇది. ఒకేరోజు ఓజీ, ఉస్తాద్ భగత్‌ సింగ్ ల నుంచి అప్‌డేట్స్ వచ్చాయి. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ రెండు సినిమాల మేకర్స్ ఈ అప్‌డేట్స్ ఇవ్వడం విశేషం.
ఓజీలో పవన్ కల్యాణ్
ఓజీలో పవన్ కల్యాణ్

ఓజీలో పవన్ కల్యాణ్

OG Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. హరిహర వీరమల్లు షూటింగ్ తర్వాత మరో మూడు సినిమాలలో అతడు నటిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో కలిసి వినోదాయ సిద్ధం రీమేక్ తోపాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి మూవీస్ లో పవన్ నటిస్తున్నాడు. అయితే బుధవారం (మే 3) ఒకేసారి రెండు సినిమాల నుంచి అప్‌డేట్స్ వచ్చాయి.

మొదట ఓజీ (OG) నుంచి రాగా.. కాసేపటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా మరో అప్‌డేట్ వచ్చింది. ఓజీ మూవీ ఇప్పటికే ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా మరో షెడ్యూల్ ప్రారంభమైనట్లు మేకర్స్ ట్విటర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ కొత్త షెడ్యూల్ పుణెలో జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్లో భాగంగా పవన్, ప్రియాంకా మోహన్ పై ఓ సాంగ్ షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలకు కూడా అతడే మ్యూజిక్ అందించాడు. ఆ రెండు సినిమాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. ఇక మరోవైపు పవన్ నటిస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కూడా కాసేపటి కిందటే అప్ డేట్ వచ్చింది.

ఈ మూవీని అతడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి కూడా ట్విటర్ ద్వారా అప్‌డేట్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని తెరకెక్కిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ కు సిద్ధమవుతోందని మేకర్స వెల్లడించారు. ఈ షెడ్యూల్ యాక్షన్ ప్యాక్డ్ అంటూ అంచనాలు పెంచేశారు.

ఈ పోస్ట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్.. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ అయనక బోస్ తో సీరియస్ గా చర్చిస్తున్న ఫొటోలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

తదుపరి వ్యాసం