NNS January 13th Episode: ఘోరాను అనుమానించిన మనోహరి.. అంజు శరీరంలోకి ఆరు ఆత్మ.. మనును కాపాడిన మిస్సమ్మ
13 January 2025, 10:46 IST
- Nindu Noorella Saavasam January 13th Episode: నిండు నూరేళ్ల సావాసం జనవరి 13 ఎపిసోడ్‌లో మనోహరి ఇంట్లోకి రాగానే పని జరిగినట్లు లేదు, ఎన్ని తప్పులు చేస్తావంటూ అచ్చం అరుంధతిలా మాట్లాడుతుంది మిస్సమ్మ. దాంతో భయపడిపోయిన మనోహరి కిందపడబోతుంటే మిస్సమ్మ పట్టుకుంటుంది.
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ జనవరి 13 ఎపిసోడ్
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్ (NNS 9th January Episode)లో ఘోరా ఇచ్చిన లాకెట్ తీసుకుని ఇంటికి వస్తుంది మనోహరి. ఎదురుగా వచ్చిన మిస్సమ్మను చూసిన మనోహరి షాక్ అవుతుంది. భయపడ్డావా మను లోపల అందరూ నీ కోసమే చూస్తున్నారు అని చెప్తుంది.
నీ సోదరిలోనే దూరావా
సరే అంటూ మనోహరి లోపలికి వెళ్తుంటే.. పని అయినట్టు లేదు అంటుంది మిస్సమ్మ. భయంతో మిస్సమ్మ దగ్గరకు వచ్చిన మనోహరి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటుంది. తప్పుల మీద తప్పులు అంత భయం లేకుండా ఎలా చేస్తున్నావు మను అంటూ మిస్సమ్మ ప్రశ్నిస్తుంది. పక్క నుంచి అంతా వింటున్న గుప్తా.. అమ్మా బాలిక నీ సోదరిలోనే దూరావా అనుకుంటాడు.
మను మాత్రం నేను ఇదంతా నీ మీద కోపంతో చేయలేదు అమర్ మీద ప్రేమతో చేశాను అంటూ కింద పడబోతుంటే.. మిస్సమ్మ పట్టుకుంటుంది. లాకెట్ వెలగదు.. దీంతో మనోహరి నువ్వు నువ్వే కదా అని అడుగుతూ.. ఇప్పటి దాకా మాట్లాడింది అంటుంది. నేనే మాట్లాడాను.. అరుంధతి అక్కా అనుకున్నవా అంటుంది. మనోహరి సైలెంట్‌గా లోపలికి వెల్లిపోతుంది. గుప్త కూడా ఈ బాలికలో లేదు లోపలికి వెళ్లి ఎవరిలో ఉందో కనుక్కోవాలి అనుకుని కిటికీ దగ్గరకు వస్తాడు.
నిర్మలను టచ్ చేస్తూ
లోపలికి వెళ్లిన మనోహరి అందరినీ చూస్తుంది. అందరూ మామూలుగానే ఉన్నారు అనుకుని చేతులు కడుక్కోవడనికి వెళ్తూ అమ్మును తగులుతుంది. లైట్ వెలగదు. తర్వాత ఆకాష్, ఆనంద్‌లను టచ్ చేస్తుంది మనోహరి. అప్పుడు కూడా లైట్ వెలగదు.. దీంతో అసహనంగా ఓసే అరుంధతి ఎవరిలో దాక్కున్నావే అనుకుంటూ కుర్చీలో కూర్చుని నిర్మలను టచ్ చేస్తుంది లైట్ వెలగదు. మనోహరి పిచ్చి చేష్టలు గమనిస్తున్న మిస్సమ్మ కోపంగా చూస్తుంది.
తినండి మనోహరి గారు అంటూ చెప్తుంది. తిన్న తర్వాత మనోహరి రూంలోకి వెళ్లి కోపంగా ఆ ఘోరా ఏమో ఎవరి శరీరంలోకో ప్రవేశించింది అంటాడు. ఇక్కడ ఎవరూ అనుమానంగా లేరు. ఈ లాకెట్ కూడా ఎవరిని పట్టుకున్నా లైట్ వెలగడం లేదు. అయినా ఇది పని చేస్తుందా..? పని చేయదు అంటూ లాకెట్ తీసి విసిరి పడేస్తుంది. లాకెట్ బయటకు పడటంతో అంజు లాకెట్ తీసుకుని రూంలోకి వచ్చి ఇది మీదేనా ఆంటీ అని అడుగుతుంది.
షాక్ అయిన మనోహరి
అవునని మనోహరి చెప్పగానే.. అయితే తీసుకోండి అని ఇవ్వబోతూ.. మనోహరి తీసుకుంటుంటే వదలదు.. వదులు అంజు అంటూ మనోహరి అడగ్గానే.. అంజులో ఉన్న అరుంధతి కనిపిస్తుంది. లాకెట్‌లో లైట్ వెలుగుతుంది. వదలమంటావా మను అంటూ ఆరు అడుగుతుంది. మనోహరి షాక్ అవుతుంది. నువ్వు ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి చూస్తున్న అందర్ని ముట్టుకోవడం దీన్ని చూడటం అంతా గమనించాను. ఇక దీని అవసరం నీకు లేదనుకుంటా తీసుకో అంటూ వెళ్లిపోతుంది అంజు.
వెంటనే మనోహరి ఘోరకు ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఆత్మను ఎలా పట్టుకోబోతున్నావు అని మను అడుగుతుంది. నీ పని నువ్వు చేశావు ఇక నా వంతు.. అయినా నువ్వు ఎప్పుడూ ఇలా అడగలేదేం అంటూ నీకు రెండు మార్గాలు ఉన్నప్పుడు నువ్వు నా వైపే ఉన్నావని నమ్మకం ఏంటి..? అంటూ ఫోన్ కట్ చేస్తాడు ఘోర. దీంతో మనోహరి ఆలోచిస్తూ అరుంధతికి ఈ విషయం చెప్పాలి అది ఇంట్లోంచి వెళ్లకుండా ఉంటే సరి అనుకుంటుంది.
అంజుపై కోప్పడ్డా అమర్
అంజులో ఉన్న ఆరు అమర్ రూంలోకి వెళ్లి అస్థికలు తీసుకుని ఏడుస్తుంది. ఇంతలో అమర్ వచ్చి కోపంగా అంజు అంటూ పిలుస్తూ.. ఏం చేస్తున్నావు ఇక్కడ.. ఇలా బాధపడతారనే మీ అమ్మ ఫోటో బయట పెట్టకుండా రూంలో పెడితే ఇక్కడికి కూడా వచ్చి బాధపడితే ఎలా అంటాడు. కింద నుంచి అమర్ అరుపులు విన్న మిస్సమ్మ పైకి వస్తుంది.
మిస్సమ్మను చూసిన ఆరు తన ఫోటో మిస్సమ్మ చూస్తుందేమోనని భయపడుతుంది. అమర్ అంజును బయటకు తీసుకురాగానే అంజును తీసుకుని కిందకు వెళ్తుంది మిస్సమ్మ. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.
టాపిక్