తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Retro Movie Ott: సూర్య, పూజా హెగ్డే మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. కమల్ హాసన్ - మణిరత్నం చిత్రానికి కూడా..

Retro Movie OTT: సూర్య, పూజా హెగ్డే మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. కమల్ హాసన్ - మణిరత్నం చిత్రానికి కూడా..

15 January 2025, 16:23 IST

google News
    • Retro Movie OTT: రెట్రో సినిమా ఓటీటీ హక్కుల విషయంలో అధికారిక ప్రకటన వచ్చేసింది. సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ నెక్స్ట్ చిత్రానికి కూడా ఓటీటీ లాక్ అయింది.
Retro Movie OTT: సూర్య, పూజా హెగ్డే మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. కమల్ హాసన్ - మణిరత్నం చిత్రానికి కూడా..
Retro Movie OTT: సూర్య, పూజా హెగ్డే మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. కమల్ హాసన్ - మణిరత్నం చిత్రానికి కూడా..

Retro Movie OTT: సూర్య, పూజా హెగ్డే మూవీకి ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. కమల్ హాసన్ - మణిరత్నం చిత్రానికి కూడా..

కంగువ సినిమా తమిళ స్టార్ హీరో సూర్యకు తీవ్ర నిరాశను మిగిల్చింది. భారీ అంచనాలతో గతేడాది నవంబర్ 14న విడుదలైన ఆ చిత్రం ఘోరమైన పరాజయం చెందింది. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో మూవీలో నటిస్తున్నారు. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్ సినిమాగా తెరకెక్కుతోంది. టైటిల్ టీజర్ ఈ చిత్రంపై అంచనాలను పెంచింది. కాగా, థియేటర్లలో రిలీజ్‍కు ముందే రెట్రో సినిమా ఓటీటీ డీల్ జరిగింది.

ఏ ఓటీటీలో..

రెట్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని నేడు (జనవరి 15 ) అధికారికంగా వెల్లడించింది. ఇటీవల డీల్ చేసుకున్న కొన్ని అప్‍కమింగ్ సినిమాల గురించి పొంగల్ సందర్భంగా వెల్లడించింది నెట్‍ఫ్లిక్స్. రెట్రో సినిమాను థియేట్రికల్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు పేర్కొంది.

రెట్రో చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం కన్నడ భాషల్లో థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్‍కు తేనున్నట్టు నెట్‍ఫ్లిక్స్ పేర్కొంది. “ఓ మగాడి ప్రేమ పర్వతాలను కూడా కదిలించగలదు. కానీ అతడి ఆగ్రహం? అదే రెట్రో” అంటూ ఈ మూవీ పోస్టర్‌ను నెట్‍ఫ్లిక్స్ షేర్ చేసింది.

రెట్రో సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవలే టైటిల్ టీజర్ వచ్చింది. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‍స్టర్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. లవ్ స్టోరీ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన అంశంగా ఉండనుందని టైటిల్ టీజర్‌తో తెలిసిపోయింది. ఈ చిత్రంలో సూర్య లుక్ ఇంటెన్స్‌గా ఉంది. ఈ ఏడాది వేసవిలో రెట్రో చిత్రం థియేటర్లలో రిలీజ్ అవుతుందని మూవీ టీమ్ వెల్లడించింది. థియేట్రికల్ రన్ తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఈ చిత్రం వస్తుంది.

రెట్రో చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‍మెంట్, స్టోన్ బీచ్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య, కార్తికేయన్, కల్యాణ్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

థగ్‍లైఫ్ కూడా..

లోక నాయకుడు కమల్ హాసన్, దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‍తో ‘థగ్ లైఫ్’ సినిమా రూపొందుతోంది. నాయకన్ తర్వాత సుమారు 36 ఏళ్ల అనంతరం వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌ రానున్న ఈ మూవీపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. థగ్ లైఫ్ సినిమాను జూన్ 5వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. కాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఆ విషయాన్ని నేడు వెల్లడించింది. థియేట్రికల్ రన్ తర్వాత తమిళం, తెలుగు, హిందీ మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో వస్తుందని వెల్లడించింది.

థగ్ లైఫ్ చిత్రంలో కమల్ హాసన్‍తో పాటు త్రిష, శింబు, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజూ జార్జ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు.

అజిత్ కుమార్ హీరోగా రానున్న విదాముయర్చి, గుడ్ బ్యాక్ అగ్లీ చిత్రాల స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు తెలిపింది. దుల్కర్ సల్మాన్ ‘కాంతా’ మూవీ రైట్స్ కూడా ఈ ఓటీటీ దక్కించుకుంది.

తదుపరి వ్యాసం