Malayalam Movie: నో థియేటర్...ఓటీటీ - డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైన మలయాళం థ్రిల్లర్ మూవీ - ఫ్రీ స్ట్రీమింగ్!
14 October 2024, 13:08 IST
Malayalam Movie: ఆసిఫ్ అలీ, బాసిల్ జోసెఫ్ హీరోలుగా నటించిన మలయాళం మూవీ నియాయథిపతి మూవీ థియేటర్, ఓటీటీలలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ఆసిఫ్ అలీ లాయర్‌గా నటించాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ మూవీ ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది.
మలయాళం మూవీ
Malayalam Movie: ఓ సినిమా మొదట థియేటర్...ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాతే టీవీ, యూట్యూబ్‌లలో స్ట్రీమింగ్ అవుతుంటుంది. థియేటర్లలో రిలీజైన ఐదారు నెలల నుంచి ఏడాది తర్వాతే యూట్యూబ్‌లోకి సినిమాలు రావడం పరిపాటి. కానీ మలయాళం మూవీ నియాయతిపథి మూవీ మాత్రం థియేటర్, ఓటీటీలను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైంది.
ఇద్దరు హీరోలు...
కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ఆసిఫ్ అలీ, బాసిల్ జోసెఫ్ హీరోలుగా నటించారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఓ జంటను లాయర్ ఎలా కలిపాడు? వారి మధ్య మనస్పర్థలు తొలగిపోయేందుకు ఏం చేశాడు అన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్, రెంటల్ ఛార్జీలు లేకుండా యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు.
కారణం ఇదే...
నియాయతిపథి మూవీ షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే పూర్తయిందని, అనివార్య కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం కావడంతో నేరుగా మేకర్స్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసినట్లు చెబుతోన్నారు. ఈ సినిమాలో నిజాయితీపరుడైన మంచి మనసున్న లాయర్‌గా ఆసిఫ్ అలీ కనిపించాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ మూవీ ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో...
ప్రస్తుతం మలయాళంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ ఆసిఫ్ అలీ, బాసిల్ జోసెఫ్ ప్రతిభను చాటుకుంటోన్నారు. ఈ ఏడాది ఆసిఫ్ అలీ హీరోగా నటించిన వర్షంగులక్కు శేషం, తలైవన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. లెవెల్ క్రాస్, అడియోస్ అమిగో సినిమాలు కమర్షియల్‌గా ఫెయిలైనా ఆసిఫ్ అలీ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి.
కిష్కింద కాండం…
ఆసిఫ్ అలీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కిష్కింద కాండం ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా్ల్లో ఒకటిగా నిలిచింది. కేవలం ఏడు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 75 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది.
ఆసిఫ్ అలీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేల్ చేసింది. కిష్కింద కాండం మూవీలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిచింది. 2024లో ఆరు సినిమాలు, ఓ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించాడు ఆసిఫ్ అలీ..
నునాక్కుజి...
మరోవైపు దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించిన బాసిల్ జోసెఫ్ హీరోగా బిజీ అయ్యాడు. దృశ్యం దర్శకుడు జీతూజోసెఫ్, బాసిల్ కాంబినేషన్‌లో ఇటీవల రిలీజైన నునాక్కుజి మంచి వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది ఏఆర్ శ్రీమ్, గురువాయూర్ అంబాలనాదయిల్, వజల్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు బాసిల్ జోసెఫ్. గోధా, మిన్నల్ మురళి సినిమాలకు బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
టాపిక్