OTT Comedy Thriller: ఓటీటీలో కామెడీ థ్రిల్లర్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు.. తెలుగులోనూ..
12 January 2025, 14:53 IST
- Sookshmadarshini OTT Streaming: మలయాళ మూవీ సూక్ష్మదర్శిని ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు కూడా వచ్చింది.

OTT Movie: ఓటీటీలో ఈ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు.. తెలుగులోనూ..
థియేటర్లలో మలయాళంలో మాత్రమే రిలీజైన కొన్ని చిత్రాలు.. ఓటీటీల్లోకి ఇతర భాషల్లోనూ వస్తుంటాయి. అప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆ సినిమాలు ఎప్పడెప్పుడు ఓటీటీలోకి వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. దీంతో ఫుల్ బజ్ ఏర్పడుతుంది. ఇటీవల ‘సూక్ష్మదర్శిని’ మూవీ విషయంలో ఇలాగే జరిగింది. ఈ చిత్రానికి మలయాళంలో అదిరిపోయే టాక్ రావటంతో పాటు మంచి కలెక్షన్లు దక్కాయయి. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్‍పై నిరీక్షణ కొనసాగింది. ఈ తరుణంలో ఈ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. అంచనాలకు తగ్గట్టే స్ట్రీమింగ్‍లోనూ దుమ్మురేపుతోంది.
సూక్ష్మదర్శిని చిత్రంలో నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్ లీడ్ రోల్స్ చేశారు. కామెడీతో పాటు సస్పెన్స్ కూడా ఈ మూవీలో ఉంటుంది. నవంబర్ 22న రిలీజైన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి ఎంసీ జితిన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు..
సూక్ష్మదర్శిని చిత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో జనవరి 10వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీకి ఆరంభం నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. భారీ వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో ప్రస్తుతం (జనవరి 12) ఈ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది. ఈ సినిమా హాట్‍స్టార్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెటిజన్ల రెస్పాన్స్ ఇలా..
హాట్‍స్టార్ ఓటీటీలో సూక్ష్మదర్శిని మూవీని చూశాక కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ చిత్రం బ్రిలియంట్‍గా ఉందని చాలా మంది అంటున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉందని, కామెడీతో పాటు థ్రిల్‍తోనూ ఈ చిత్రం ఆకట్టుకుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో మిస్టరీని రివీల్ చేసే విధానం చాలా బాగుందని, రైటింగ్, ఎడిటింగ్ సూపర్ అంటూ కొందరు రాసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని మిస్ కాకుండా అందరూ చూడాలంటూ చాలా మంది సోషల్ మీడియాలో రెకమెండ్ చేస్తున్నారు.
సూక్ష్మదర్శిని చిత్రం సుమారు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఏకంగా దాదాపు రూ.56కోట్ల కలెక్షన్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‍గా నిలిచింది. థియేటర్లలో రిలీజైన సుమారు 50 రోజులకు ఈ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. స్ట్రీమింగ్‍లోనూ అదరగొడుతోంది.
సూక్ష్మదర్శిని చిత్రంలో నజ్రియా, బాసిల్ జోసెఫ్‍తో పాటు అఖిల భార్గవన్, పూజా మోహన్‍రాజా, మెరిన్ ఫిలిప్, సిద్ధార్థ్ భరతన్, దీపక్ పరంబోల్, కొట్టాయమ్ రమేశ్, అభిరామ్ రాధాకృష్ణన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కామెడీ, గ్రిప్పింగ్ నరేషన్‍తో తెరకెక్కించారు జితిన్. ఈ మిస్టరీ థ్రిల్లర్‌తో మెప్పించారు.
సూక్ష్మదర్శిని చిత్రాన్ని ఏవీఏ ప్రొడక్షన్స్, హ్యాపీ హవర్స్ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్లపై ఏవీ అనూప్, షూజూ ఖాలీద్, సమీర్ తాహిర్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి క్రిస్టో గ్జేవియర్ సంగీతం అందించారు. శరణ్ వెలాయుధన్ నాయర్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి చామన్ చాకో ఎడిటర్‌గా పని చేశారు.