తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maata Vinaali Song: హరి హర వీరమల్లు తొలి పాట ప్రోమో వచ్చేసింది.. పవన్ గాత్రంతో.. ఫుల్ సాంగ్, డేట్ టైమ్ ఇవే

Maata Vinaali Song: హరి హర వీరమల్లు తొలి పాట ప్రోమో వచ్చేసింది.. పవన్ గాత్రంతో.. ఫుల్ సాంగ్, డేట్ టైమ్ ఇవే

14 January 2025, 13:18 IST

google News
    • Hari Hara Veera Mallu Maata Vinaali Song: హరి హర వీరమల్లు సినిమా నుంచి తొలి పాట ప్రోమో వచ్చేసింది. మాట వినాలంటూ ఉన్న ఈ సాంగ్‍ను పవన్ కల్యాణ్ ఆలపించారు. సంక్రాంతి సందర్భంగా ప్రోమోను మూవీ టీమ్ తీసుకొచ్చింది. పూర్తి పాట రిలీజ్ టైమ్‍ను కూడా వెల్లడించింది.
Maata Vinaali Song: హరి హర వీరమల్లు తొలి పాట ప్రోమో వచ్చేసింది.. పవన్ గాత్రంతో.. ఫుల్ సాంగ్, డేట్ టైమ్ ఇవే
Maata Vinaali Song: హరి హర వీరమల్లు తొలి పాట ప్రోమో వచ్చేసింది.. పవన్ గాత్రంతో.. ఫుల్ సాంగ్, డేట్ టైమ్ ఇవే

Maata Vinaali Song: హరి హర వీరమల్లు తొలి పాట ప్రోమో వచ్చేసింది.. పవన్ గాత్రంతో.. ఫుల్ సాంగ్, డేట్ టైమ్ ఇవే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వేచిచూస్తున్న అప్‍డేట్ సంక్రాంతి రోజున వచ్చేసింది. హరి హర వీరమల్లు చిత్రం నుంచి తొలి పాట ప్రోమోను మూవీ టీమ్ తీసుకొచ్చింది. మాట వినాలి అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో పండుగైన నేడు (జనవరి 14) రిలీజ్ అయింది. పవన్ కల్యాణ్ గాత్రంతో ఈ సాంగ్ ఉండనుంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సాంగ్ ఓసారి వాయిదా పడింది. ఇప్పుడు ప్రోమోను తీసుకొచ్చిన హరి హర వీరమల్లు టీమ్.. ఫుల్ సాంగ్‍కు కొత్త డేట్, టైమ్‍ను ప్రకటించింది.

‘వీరమల్లు చెబితే వినాలి’

వినాలి అంటూ పవన్ చెప్పిన మాటతో హరి హర వీరమల్లు తొలి పాట ప్రోమో షూరూ అయింది. బ్యాక్‍గ్రౌండ్ బీట్ చూస్తూంటే ఈ పాట జానపదం లాంటి ట్యూన్‍తో హుషారుగా ఉండనుందని అర్థమవుతోంది. పిడికిలి బిగించి "వీరమల్లు మాట చెబితే వినాలి ఆ” అనే పవన్ డైలాగ్‍తో ఈ ప్రోమో ముగిసింది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఫుల్ సాంగ్ డేట్, టైమ్

హరి హర వీరమల్లు చిత్రం నుంచి మాట వినాలి పూర్తి పాట జనవరి 17వ తేదీన 10 గంటల 20 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రోమో ద్వారా మూవీ టీమ్ వెల్లడించింది. దీంతో ఈ సాంగ్ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మాట వినాలి పాటపై న్యూయర్ రోజున కూడా ఓ అప్‍డేట్ ఇచ్చింది మూవీ టీమ్. జనవరి 6వ తేదీనే ఫుల్ సాంగ్ తీసుకొస్తామని చెప్పింది. అయితే, అప్పుడు వాయిదా వేసింది. ఇప్పుడు సంక్రాంతి రోజున ప్రోమో తీసుకొచ్చింది. జనవరి 17వ తేదీన పూర్తి పాట రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది.

హరి హర వీరమల్లు చిత్రం పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ సుమారు నాలుగేళ్ల క్రితమే షురూ అయినా రకరకాల వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ క్రిష్ కూడా ఇటీవలే తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని ఇటీవల పవన్ కూడా చెప్పారు. ఈ మూవీని మార్చి 28వ తేదీన రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేసింది.

హరి హర వీరమల్లు చిత్రం మొఘలుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో తెరకెక్కుతోంది. ఈ మూవీలో బందిపోటుగా పవన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, విక్రమ్‍జీత్ విర్క్, జిస్సు సెంగుప్తా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రోమో అంచనాలను మరింత పెంచేసింది.

హరి హర వీరమల్లు చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై దయాకర్ రావు ప్రొడ్యూజ్ చేస్తుండగా.. ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు.

తదుపరి వ్యాసం