
Telugu Cinema News Live February 16, 2025: OTT Releases: ఓటీటీల్లో ఈ వారం టాప్-5 రిలీజ్‍లు ఇవి.. డిఫరెంట్ జానర్లలో చిత్రాలు
Updated Feb 16, 2025 09:51 PM IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
- OTT Releases: ఈ వారం ఓటీటీల్లో ఐదు రిలీజ్‍లు ఆసక్తికరంగా ఉన్నాయి. వివిధ జానర్లలో ఉన్న చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍పై కూడా ఇంట్రెస్ట్ నెలకొంది.
- Salaar OTT Streaming: సలార్ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీలోకి వచ్చి ఏడాదైంది. ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్మురేపింది. ఇప్పటికీ ఓటీటీలో ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది.
- Thandel Collections: తండేల్ సినిమా ముఖ్యమైన మైల్‍స్టోన్ దాటేసింది. రూ.100కోట్ల మార్క్ చేరింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.
- Daaku Maharaaj OTT: డాకు మహారాజ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. అయితే, ఈ మూవీ స్ట్రీమింగ్‍పై ఇటీవల ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. దీనిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది.
- Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్‍రూబా విడుదల వాయిదా పడింది. అయితే, ప్రస్తుతం బాక్సాఫీస్ పరిస్థితులు చూసుకుంటే ఈ చిత్రం మంచి అవకాశాన్నే మిస్ చేసుకున్నట్టుగా అనిపిస్తోంది.
- Suriya: తమిళ హీరో సూర్య ఎట్టకేలకు ఓ డైరెక్ట్ తెలుగు చిత్రానికి ఓకే చెప్పారని తెలుస్తోంది. దీంతో సుమారు 15ఏళ్ల తర్వాత స్ట్రైట్ తెలుగు మూవీని ఆయన చేయనున్నారు. ఆ వివరాలు ఇవే..
- Chhaava Box office Collections: ఛావా చిత్రం కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. మంచి ఓపెనింగ్ దక్కించుకున్న ఈ మూవీ అదే రోజు కొనసాగిస్తోంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ దిశగా దూసుకెళుతోంది.
Beauty Teaser: అంకిత్ కొయ్య హీరోగా నటించిన బ్యూటీ మూవీ టీజర్ రిలీజైంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో సోషల్ మీడియా సెన్సేషన్ నీలఖి పాత్ర హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు భలే ఉన్నాడే ఫేమ్ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
- OTT Action: బేబీ జాన్ చిత్రం రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. ఇప్పటికే రెంటల్ విధానంగా అందుబాటులో ఉంది. ఈ వారమే రెంట్ తొలగిపోనుంది. రెగ్యులర్ స్ట్రీమిగ్ ఎప్పుడంటే..
Daaku Maharaaj OTT: బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ యాక్షన్ మూవీకి బాబీ దర్శకత్వం వహించాడు. సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 115 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
Krishnaveni: టాలీవుడ్ సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి ఆదివారం కన్నుమూశారు. మనదేశం మూవీతో ఎన్టీఆర్‌ను తెలుగు ఇండస్ట్రీకి కృష్ణవేణి పరిచయం చేశారు. దక్షయజ్ఞం, జీవన జ్యోతి, గొల్లభామతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది కృష్ణవేణి. ప్రొడ్యూసర్‌గా మూడు సినిమాలు చేశారు.
Malayalam OTT: మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ మార్కో తెలుగులో మరో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఇటీవలే సోనీలివ్ లో విడుదలైన ఈ మూవీ తాజాగా ఆహా ఓటీటీలోకి రాబోతోంది. ఫిబ్రవరి 21న నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. ఈ యాక్షన్ మూవీలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు.
Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ ప్రోమోలో రాజ్, కావ్యలను అపార్థం చేసుకొని అనుమానించినందుకు అపర్ణ పశ్చాత్తాప పడుతుంది. ఇంటి సమస్యలు మొత్తం తీరిపోయాయని దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్ ఆనందపడుతోన్న టైమ్‌లోనే సీతారామయ్య ట్విస్ట్ ఇస్తాడు. ఆస్తిని ముక్కలు చేయబోతున్నట్లు ప్రకటిస్తాడు.
Suspense OTT: కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ హ్యాపీలీ మ్యారీడ్ ఓటీటీలో రిలీజైంది. నమ్మఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీలో పృథ్వీ అంబర్, మాన్వితా కామత్ హీరోహీరోయిన్లుగా నటించారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లవ్ మూవీకి రీమేక్‌గా మ్యాపీలీ మ్యారీడ్ తెరకెక్కింది.
Divija Prabhakar: సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. హే చికీతా పేరుతో ఓ మూవీ చేస్తోంది. ఈ మూవీలో వైఫ్ ఆఫ్ ఫేమ్ అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తోన్నాడు. ఈ సినిమాకు ధనరాజ్ లెక్కల దర్శకత్వం వహిస్తున్నాడు.
Thriller OTT: వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్‌గా నటించిన శబరి మూవీ సన్ నెక్స్ట్, ఆహా ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఆమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. సెకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో గణేష్ వెంకట్రామన్, శశాంక్ కీలక పాత్రలు పోషించారు.
Shraddha Das: శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో త్రికాల పేరుతో ఓ సూపర్ హీరో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్, మాస్టర్ మహేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. మణితెల్లగూటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.