తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari Serial February 17th: కృష్ణతో మురారి కొంటె వేషాలు.. దేవ్ రీ ఎంట్రీ, ఎవరు ప్రమాదంలో పడబోతున్నారు?

Krishna mukunda murari serial february 17th: కృష్ణతో మురారి కొంటె వేషాలు.. దేవ్ రీ ఎంట్రీ, ఎవరు ప్రమాదంలో పడబోతున్నారు?

Gunti Soundarya HT Telugu

17 February 2024, 8:46 IST

google News
    • Krishna mukunda murari serial february 17th episode: బయటకి తీసుకెళ్ళి ఆదర్శ్ తో తన మనసులో ఉన్న నిజం చెప్పాలని ముకుంద ప్లాన్ చేస్తుంది. దీంతో రెండు జంటలు బయటకి వెళతారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 
కృష్ణ మురారి ముకుంద సీరియల్ ఫిబ్రవరి 17 వ తేదీ ఎపిసోడ్
కృష్ణ మురారి ముకుంద సీరియల్ ఫిబ్రవరి 17 వ తేదీ ఎపిసోడ్ (disney plus hotstar)

కృష్ణ మురారి ముకుంద సీరియల్ ఫిబ్రవరి 17 వ తేదీ ఎపిసోడ్

Krishna mukunda murari serial february 17th episode: మురారి కృష్ణని ప్రేమగా దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టబోతుంటే పక్కకి తోసేస్తుంది. దేనికైనా ముహూర్తం ఉంటుందని అంటుంది. ఈ ముహూర్తాలు నాకు సెట్ అయ్యేలా లేవు మనకి శోభనం జరగదు ఏమో అంటాడు. అలా ఏం జరగదు వచ్చే ముహూర్తానికి మన శోభనమని చెప్తుంది. ముకుంద మురారితో తీసుకున్న సెల్ఫీలు చూసుకుంటూ మురిసిపోతుంది. చెప్పేస్తాను ఆదర్శ్ లో నిన్ను చూస్తూ ప్రతి క్షణం మ్యానేజ్ చేయడం నావల్ల కాదు. ఎప్పటికప్పుడు ఎదురయ్యే పరీక్షలు తట్టుకోలేక ఎక్కడ అందరి ముందు ఓపెన్ అయిపోతానో, అది ఏ గోడవకు దారి తీస్తుందోనని చెప్పేస్తాను. పెద్ద మనసుతో అర్థం చేసుకుంటాడని అనుకుంటుంది.

ముకుంద మీద ఆదర్శ్ డౌట్

ఆదర్శ్ అప్పుడే ముకుందని పిలుస్తాడు. దీంతో టెన్షన్ పడుతూ ఫోటోస్ బ్యాగ్ లో పెట్టేస్తుంది. బాత్రూమ్ లో క్లిప్ మర్చిపోయావు అని దాన్ని బ్యాగ్ లో పెట్టబొతాడు. బ్యాగ్ ఓపెన్ చేయబోతుంటే కంగారుగా వద్దు పెట్టొద్దని అంటుంది. ఏమైంది క్లిప్ బ్యాగ్ లో పెడతాను అంటే అంతగా రియాక్ట్ అవుతున్నావని అంటాడు. అది తీసుకెళ్లడం లేదని చెప్పి బ్యాగ్ జిప్ వేసేస్తుంది.

అది మామూలుగా కూడా చెప్పొచ్చు కదా అంత కంగారు ఎందుకు, ఈ బ్యాగ్ లో ఏదో పాము ఉన్నట్టు అరిచావని అంటాడు. పాము కాటేసినా ఏం కాదు కానీ ఈ ఫోటోస్ చూస్తే నా జీవితమే ప్రమాదంలో పడుతుంది నేను నానోటితో నీకు నచ్చజెప్పే వరకు ఇవి నీ కంట పడకూడదని అనుకుంటుంది. అంతా ఒకేనా ఇప్పుడు మనం వెళ్తున్న ట్రిప్ నీకు ఇష్టమేనా అని అడుగుతుంది. అదేమీ లేదు ఈ ట్రిప్ కి వెళ్దామని చెప్పింది నేనే కదా అంటుంది.

మురారి వాళ్ళు బ్యాగ్ పట్టుకుని వస్తారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారని ఇంట్లో వాళ్ళు అడిగితే ఏమో మాకు తెలియదు ముకుంద ప్లాన్ చేసిందని తననే అడగమని కృష్ణ చెప్తుంది. ఇంత హడావుడిగా ఎందుకు వెళ్తున్నారో కారణం తెలుసుకోవచ్చా అని మధుకర్ అడుగుతాడు. ముందే బుక్ చేసుకుని వెళ్తే థ్రిల్ ఏముంటుందని మురారి అంటాడు. నందిని కూడా గౌతమ్ దగ్గరకి బయల్దేరతానని చెప్తుంది. రెండు జంటలు వెళ్లిపోతారు. మధు వాళ్ళని ఫాలో అవాలని అనుకుంటాడు. కానీ రేవతి మాత్రం వాళ్ళు సరదాగా వెళ్తుంటే నువ్వు ఫాలో అవడం ఎందుకని తిడుతుంది.

మురారి వాళ్ళని చూసి అసూయపడిన ముకుంద

ఆదర్శ్ కి ఈ విషయం ఎలా చెప్పాలి. ఎక్కడో ప్రశాంతంగా బతుకుతున్న మనిషిని తీసుకొచ్చి ఇష్టం లేదని చెప్తే చాలా బాధపడతాడు. కానీ తప్పదు ప్రతిక్షణం తనని మోసం చేస్తూ నన్ను నేను మోసం చేసుకోలేను. ఎలాగైనా ఈ ట్రిప్ అయిపోయేలోపు చెప్పి మనసులో భారం దించుకోవాలని అనుకుంటుంది. ఆదర్శ్ ముకుందకి తగులుతూ ఉంటే ఈ మనిషితో పక్కన కూర్చోవడం ఇబ్బందిగా ఉందని అనుకుని కారు ఆపమని చెప్తుంది. కారు దిగి ఎప్పుడు మీరే ముందు కూర్చుంటారా మేము కూర్చోవద్దా అని అడుగుతుంది. ఇక మురారి డ్రైవింగ్ సీట్ ఆదర్శ్ కి ఇచ్చి మురారి కృష్ణ వెనుక కూర్చుంటారు. మంచి ఛాన్స్ దొరికింది అసలు వదులుకొనని అనుకుంటాడు. ఇప్పుడు హ్యాపీగా ఉంది మిర్రర్ లో హ్యాపీగా మురారిని చూసుకోవచ్చని ముకుంద అనుకుంటుంది.

థాంక్యూ ముకుంద అవుటింగ్ కి ప్లాన్ చేసినందుకని కృష్ణ చెప్తుంది. ఇది ప్లాన్ చేసింది మీకోసం కాదు నాకోసం ఆదర్శ్ కి నిజం చెప్పడం కోసమని ముకుంద మనసులో అనుకుంటుంది. మురారి కారులో కూర్చుని కృష్ణ చేతిని పట్టుకుని గిల్లుతూ ఉంటాడు. ముకుంద వాళ్ళు చూస్తే బాగోదని కృష్ణ అంటుంది. ముకుంద మిర్రర్ లో చూస్తుంది. వాళ్ళు క్లోజ్ గా ఉంటే నాకు ఎందుకు అసూయ పుడుతుంది. నాకు అలాంటి ఫిలింగ్స్ కలగకూడదు. నాకు కావలసింది ఆదర్శ్ కి దూరంగా ఉండటమేనని అనుకుంటుంది. తలనొప్పిగా ఉందని చెప్పి కృష్ణ ఒడిలో తలపెట్టుకుని పడుకుంటాడు. ఆదర్శ్ నవ్వుకుంటాడు. అనవసరంగా వీళ్ళని వెనుకకి పంపించాను వీళ్ళు ముందు ఉంటేనే బాగుండేదని తిట్టుకుంటుంది. కృష్ణ మురారి దొంగ వేషాలు కనిపెట్టేస్తుంది.

మురారి ఇంక తగ్గలేదా అదృష్టవంతుడివి మంచి ఛాన్స్ మిస్ అయ్యానని ఆదర్శ్ అంటాడు. నేనేమీ కావాలని చెప్పడం లేదు నిజంగానే తలనొప్పిగా ఉంది కావాలంటే నువ్వు రిటర్న్ లో నువ్వు వెనుక సీట్ లో కూర్చో ముకుంద తలనొక్కుతుందని చెప్తాడు. మురారి పాపం ఎంతసేపు అలా తలనొప్పితో ఉంటాడు మందుల షాప్ లో బామ్ తీసుకుని రాయవచ్చు కదాని ముకుంద అంటుంది. అదే చేత్తో బామ్ రాస్తే తగ్గిపోతుంది కదాని ఆదర్శ్ కూడా ఇరికిస్తాడు. ఏ నొప్పి లేకుండా బామ్ రాసుకుంటే మంట మండిపోతుందని మురారి మనసులో అనుకుంటాడు. కృష్ణ బామ్ రాసి రుద్దుతుంది. మంటతో అల్లాడిపోతాడు. ఇక రిస్టార్ట్ కు చేరుకుంటారు.

తరువాయి భాగంలో..

మురారి, కృష్ణ హ్యాపీగా ఉంటారు. దేవ్ ముకుందకి ఫోన్ చేస్తాడు. నీకు అడ్డంగా ఉన్నావాడిని తప్పిద్దామని అనుకుంటే కుదరడం లేదని దేవ్ అంటాడు. నువ్వు ప్రాణాలు తీయడం లాంటివి మాత్రం చేయకని ముకుంద చెప్పడం ఆదర్శ్ వింటాడు.

 

తదుపరి వ్యాసం