తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ka Sequel: క సీక్వెల్‌పై కిరణ్ అబ్బవరం హింట్.. ఆ చీకటి సస్పెన్స్ రివీల్ చేస్తారంట

KA Sequel: క సీక్వెల్‌పై కిరణ్ అబ్బవరం హింట్.. ఆ చీకటి సస్పెన్స్ రివీల్ చేస్తారంట

Galeti Rajendra HT Telugu

02 November 2024, 18:49 IST

google News
  • KA Movie: సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన క మూవీ థియేటర్లలో 3 రోజుల నుంచి పాజిటివ్ టాక్‌తో సందడి చేస్తోంది. దాంతో థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్.. క సీక్వెల్‌పై కూడా క్లారిటీ ఇచ్చేసింది. 

క సినిమాలో కిరణ్ అబ్బవరం
క సినిమాలో కిరణ్ అబ్బవరం

క సినిమాలో కిరణ్ అబ్బవరం

దీపావళి రోజున విడుదలైన ‘క’ సినిమా పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాకి సుజీత్‌ - సందీప్‌ దర్శకత్వం వహించగా.. చింతా గోపాలకృష్ణ మూవీని నిర్మించారు.

మనిషి పుట్టక నుంచి కర్మ ఫలం ఆ తర్వాత రుణానుబంధం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. దాంతో క మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని హీరో కిరణ్ అబ్బవరం తాజాగా హింట్ ఇచ్చాడు.  క మూవీ ఈ రెండు రోజుల్లోనే రూ. 13.11 కోట్లు వసూళ్లని రాబట్టింది. 

మలయాళంలోనూ ఈ నెలలో రిలీజ్

క సినిమా సక్సెస్ అవ్వడంతో చిత్ర యూనిట్ థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని సినిమా గురించి వెల్లడించాడు. ఈ సినిమా కోసం చెన్నై నుంచి కూడా తనకి ఫోన్స్ వస్తున్నాయని చెప్పిన కిరణ్ అబ్బవరం.. కొన్ని షోలు అక్కడ తెలుగు వెర్షన్‌లో వేయడంపై ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. ఇక మలయాళంలో సినిమా ఈ నెల 8న విడుదల అవుతుందని కూడా చెప్పుకొచ్చాడు.

సినిమా రిలీజ్‌కి ముందు జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. తనని కావాలనే ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, తన తల్లి కష్టం గురించి కూడా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. దాంతో చాలా మంది నెటిజన్లు కిరణ్ అబ్బవరంకి సపోర్ట్‌గా నిలిచారు. అయితే తాను అలా మాట్లాడటం వెనుక చాలా బాధ ఉందని చెప్పుకొచ్చాడు.

ఎమోషన్ అవ్వడం వెనుక

‘‘నేను ఆరోజు అలా మాట్లాడటానికి కారణం.. ఏడాది పాటు పడిన మానసిక వేదన. నేను ఎవరినీ కించ పరచలేదు. కేవలం నా బాధని మాత్రమే చెప్పుకున్నాను. ఆ క్రమంలోనే మా అమ్మ పడిన కష్టం గురించి కూడా మాట్లాడాను. క సినిమా ఇంతటి విజయాన్ని నేను ఊహించలేదు. ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్’’ అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన స్క్రీన్స్

దీపావళి రోజున అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలు కూడా రిలీజ్ అవడంతో క సినిమాకి ఆశించిన మేర థియేటర్లు దొరకలేదు. అయితే.. తాజాగా పాజిటివ్ టాక్ రావడంతో కొత్తగా 186 స్క్రీన్స్ యాడ్ చేస్తున్నట్లు క చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

క సీక్వెల్ ‘క 2’పై కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇచ్చారు. ‘‘కృష్ణగిరిలో 3 గంటలకే చీకటి పడుతుందని సినిమాలో చూపించాం. కానీ దాని వెనుక ఉన్న కారణం తెలియాలంటే క 2 చూడాలి. క సినిమాని మించి క 2లో ట్విస్ట్‌లు ఎక్కువగా ఉంటాయి’’ అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. క 2పై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని కిరణ్ అబ్బవరం వెల్లడించాడు.

తదుపరి వ్యాసం