తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Keerthy Suresh Wedding: అవును.. వచ్చే నెలలోనే నా పెళ్లి.. అందుకే తిరుమలకు వచ్చాను: కీర్తి సురేష్

Keerthy Suresh Wedding: అవును.. వచ్చే నెలలోనే నా పెళ్లి.. అందుకే తిరుమలకు వచ్చాను: కీర్తి సురేష్

Hari Prasad S HT Telugu

29 November 2024, 13:49 IST

google News
    • Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ తన పెళ్లిని కన్ఫమ్ చేసింది. వచ్చే నెలలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. శుక్రవారం (నవంబర్ 29) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది.
అవును.. వచ్చే నెలలోనే నా పెళ్లి.. అందుకే తిరుమలకు వచ్చాను: కీర్తి సురేష్
అవును.. వచ్చే నెలలోనే నా పెళ్లి.. అందుకే తిరుమలకు వచ్చాను: కీర్తి సురేష్

అవును.. వచ్చే నెలలోనే నా పెళ్లి.. అందుకే తిరుమలకు వచ్చాను: కీర్తి సురేష్

Keerthy Suresh Wedding: కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతోంది. ముందుగా వార్తలు వచ్చినట్లే ఆమె తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను డిసెంబర్ లో పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమెనే కన్ఫమ్ చేయడం విశేషం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆమె.. తన నెక్ట్స్ మూవీతోపాటు పెళ్లి విషయాన్ని బయటపెట్టింది.

కీర్తి సురేష్ పెళ్లి

కీర్తి సురేష్ తన 15 ఏళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్తోంది. ఈ మధ్యే ఆంటోనీ తట్టిల్ తో రిలేషన్షిప్ ను కన్ఫమ్ చేసిన ఆమె.. తాజాగా శుక్రవారం (నవంబర్ 29) తిరుమలలో పెళ్లి విషయంపైనా నోరు విప్పింది. శ్రీవారిని దర్శించుకొని వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడింది. "బేబీ జాన్ మూవీ చేస్తున్నాను. వచ్చే నెలలోనే నా పెళ్లి. అందుకే ఇక్కడికి వచ్చాను. గోవాలో మా పెళ్లి జరగనుంది" అని కీర్తి చెప్పడం విశేషం. దీంతో కొన్ని రోజుల కిందటి నుంచి వస్తున్న వార్తలు నిజమే అని తేలింది.

డిసెంబర్ 11, 12 తేదీల్లో కీర్తి సురేష్ తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకోబోతోందని, ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయని రిపోర్టు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె డేట్ వెల్లడించకపోయినా పెళ్లి, వెడ్డింగ్ డెస్టినేషన్ గోవానే అని మాత్రం కన్ఫమ్ చేసింది. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చిన కీర్తి సురేష్.. అక్కడున్న మీడియా వారితో తానే పెళ్లి గురించి చెప్పి ఆశ్చర్యపరిచింది.

కీర్తి సురేష్ లవ్ స్టోరీ

కీర్తి సురేష్ ఈ మధ్యే ఆంటోనీ తట్టిల్ తో తన ప్రేమను కన్ఫమ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ బంధానికి 15 ఏళ్లు పూర్తయ్యాయంటూ కీర్తి వెల్లడించింది. హైస్కూల్లో మొదలైన తమ ప్రేమను వీళ్లు ఇప్పుడు పెళ్లి పీటల మీదికి తీసుకెళ్తున్నారు. కేరళలోని కొచ్చికి చెందిన ఆంటోనీని వచ్చే నెల 11, 12 తేదీల్లో గోవాలో పెళ్లి చేసుకున్నట్లు ఈ మధ్యే ఓ రిపోర్టు తెలిపిన విషయం తెలిసిందే.

ఆంటోనీ కేరళలోని ప్రముఖ రిసార్ట్ చెయిన్ కు ఓనర్ కావడం విశేషం. స్కూల్లోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కీర్తి సురేష్ పెళ్లి పనులు గోవాలో ఇప్పటికే మొదలయ్యాయి. ఆమె పెళ్లిపై తండ్రి, నటుడు, నిర్మాత అయిన సురేశ్ తోపాటు తల్లి మేనక కూడా కీర్తి పెళ్లిపై సంతృప్తిగా ఉన్నట్లు ఆ రిపోర్టు తెలిపింది. కీర్తి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు కూడా చెప్పింది.

ఈ మధ్యే రఘు తాతా అనే సినిమా ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక బేబీ జాన్ మూవీ ద్వారా త్వరలోనే బాలీవుడ్ లోకి కూడా అడుగుపెడుతోంది. వరుణ్ ధావన్ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. మరో తమిళ మూవీ రివాల్వర్ రీటా, వెబ్ సిరీస్ అక్కా లోనూ కీర్తి సురేశ్ నటిస్తోంది.

తదుపరి వ్యాసం