Keerthy Suresh Mother: కీర్తి సురేష్ తల్లి నటించిన తెలుగు సినిమాలు ఇవే - చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీలో హీరోయిన్‌గా!
29 November 2024, 11:02 IST
Keerthy Suresh Mother కీర్తిసురేష్ తల్లి మేనక 1980 దశకంలో మలయాళంలో టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్నది. అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న మలయాళ హీరోయిన్‌గా నిలిచింది.మేనక తెలుగులో మూడు సినిమాలు చేసింది. చిరంజీవి పున్నామినాగు సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది.
కీర్తి సురేష్ తల్లి
Keerthy Suresh Mother కీర్తి సురేష్...తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అవుతోంది. గ్లామర్‌కు దూరంగా యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలతో స్టార్ డమ్‌ను సొంతం చేసుకోవచ్చని నిరూపించింది. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నది. ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ విజయాల్ని దక్కించుకుంటోంది.
ప్రియుడితో పెళ్లి...
ఇటీవలే పెళ్లికబురు వినిపించింది కీర్తిసురేష్. చిరకాల ప్రియుడి ఆంటోనీతో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నది. డిసెంబర్ సెకండ్ వీక్‌లో గోవాలో కీర్తిసురేష్ పెళ్లి జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మలయాళంలో వంద సినిమాలు...
కాగా కీర్తిసురేష్ తల్లిదండ్రులు కూడా సినీ నేపథ్యం ఉన్నవారే కావడం గమనార్హం. కీర్తి సురేష్ తల్లి మేనక మలయాళంలో వందకుపైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. 1980 దశకంలో మాలీవుడ్‌లో పాపులర్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్నది. అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న కథానాయికగా రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళంలోనే కాకుండా తమిళంలోనూ రజనీకాంత్, శివాజీ గణేషన్ వంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది.
మూడు సినిమాలు...
మలయాళం, తమిళంలో బిజీ స్టార్‌గా పేరుతెచ్చుకున్న మేనక తెలుగులో మాత్రం మూడు సినిమాలే చేసింది. అందులో చిరంజీవి పున్నమినాగు ఒకటి. ఈ మూవీతోనే మేనక టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏవీఎమ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన పున్నమినాగు మూవీలో మేనకతో పాటు రతి అగ్నిహోత్రి హీరోయిన్లుగా నటించారు. ఇందులో చిరంజీవి నెగెటివ్ షేడ్స్‌తోకూడిన క్యారెక్టర్‌లో కనిపించాడు. చిరంజీవిని ప్రేమించే అమ్మాయిగా మేనక నటించింది.
సుబ్బరావుకు కోపం వచ్చింది...
పున్నామినాగు రిలీజైన రెండేళ్ల తర్వాత తెలుగులో సుబ్బరావుకు కోపం వచ్చింది అనే సినిమాలోనూ మేనక హీరోయిన్‌గా కనిపించింది. ధవళ సత్యం దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలవడంలో చాలా కాలం పాటు తెలుగులో మేనక కనిపించలేదు.
ఆరేళ్ల గ్యాప్ తర్వాత...
దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత 1988లో రాజశేఖర్, జీవిత హీరోహీరోయిన్లుగా నటించిన ఇంద్రధనుస్సు మూవీలో మేనక ఓ కీలక పాత్ర చేసింది. ఇదే తెలుగులో ఆమె చేసిన చివరి మూవీ. ఆ తర్వాత మేనక మళ్లీ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు.
ప్రొడ్యూసర్‌తో పెళ్లి...
మేనక నటించిన ఈ మూడు తెలుగు సినిమాల్లో పున్నమినాగు మినహా మిగిలిన రెండు సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. హీరోయిన్‌గా టాప్ పొజిషన్‌లో ఉన్న టైమ్‌లోనే మలయాళ ప్రొడ్యూసర్ జీ సురేష్‌కుమార్‌ను పెళ్లిచేసుకున్నది మేనక. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది.