తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kbc 15: కౌన్ బనేగా క్రోర్‌పతిలో ఈ రూ. కోటి ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?

KBC 15: కౌన్ బనేగా క్రోర్‌పతిలో ఈ రూ. కోటి ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా?

Hari Prasad S HT Telugu

15 September 2023, 12:47 IST

google News
    • KBC 15: కౌన్ బనేగా క్రోర్‌పతిలో ఈ రూ. కోటి ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా? ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ శుభమ్ గంగ్రాడె మాత్రం దీనికి సమాధానం చెప్పలేక గేమ్ మధ్యలోనే వదిలేశాడు.
కేబీసీ షోలో అమితాబ్ బచ్చన్
కేబీసీ షోలో అమితాబ్ బచ్చన్

కేబీసీ షోలో అమితాబ్ బచ్చన్

KBC 15: బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్విజ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి (Kaun Banega Crorepathi). ప్రస్తుతం ఈ షో 15వ సీజన్ నడుస్తోంది. ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లోనూ ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు కంటెస్టెంట్ల మేధస్సుకు పరీక్ష పెడుతున్నాయి. మొత్తం 16 ప్రశ్నలు, రూ.7 కోట్ల ప్రైజ్‌మనీ ఉండే ఈ షోలో తాజాగా ఓ కంటెస్టెంట్ ను రూ.కోటి కోసం అడిగిన ప్రశ్న ఆసక్తికరంగా ఉంది.

గత వారం జస్కరన్ సింగ్ అనే వ్యక్తి కేబీసీలో రూ.కోటి గెలుచుకున్నాడు. గురువారం (సెప్టెంబర్ 14) కూడా శుభమ్ గంగ్రాడె అనే మరో కంటెస్టెంట్ కూడా రూ.కోటి గెలవడానికి దగ్గరగా వచ్చాడు. రూ.కోటి ఇచ్చే 15వ ప్రశ్న రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించినది. అప్పట్లో జపాన్ లోని హీరోషిమా నగరంపై అమెరికా వేసిన అణుబాంబుకు సంబంధించి ఈ ప్రశ్న అడిగారు.

ఆ ప్రశ్న ఏంటంటే.. 1945, ఆగస్ట్ 6న హీరోషిమాపై తొలి అణుబాంబు వేసిన ఎయిర్‌క్రాఫ్ట్ కు ఎవరి పేరు పెట్టారు? దీనికి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. అవేంటంటే.. ఓ పౌరాణిక ఆయుధం పేరు, ఓ సినిమా పాత్ర పేరు, పైలట్ తల్లి పేరు, దానిని తయారు చేసిన ప్రదేశం పేరు. ఈ నాలిగింట్లో సరైన సమాధానం ఏది? దీనికి సమాధానం చెప్పలేక సదరు కంటెస్టెంట్ గేమ్ అక్కడితో వదిలేశాడు.

దీంతో అతనికి రూ.50 లక్షలు దక్కాయి. ఇంతకీ దీనికి సరైన సమాధానం ఏంటో తెలుసా? పైలట్ తల్లి పేరు. ఎనోలా గ్రే అనే ఆమె పేరు మీదుగానే ఆ అణుబాంబు వేసిన ఎయిర్ క్రాఫ్ట్ కు పేరు పెట్టారు. ఇక ఈ మధ్యే హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ ఈ అణుబాంబును కనిపెట్టిన ఓపెన్‌హైమర్ జీవితంపై అదే పేరుతో సినిమా తీసిన విషయం తెలుసు కదా.

అలా కనిపెట్టిన అణుబాంబులను న్యూ మెక్సికోలోని లాస్ అలమోస్ లో సృష్టించారు. వాటిని జపాన్ లోని హీరోషిమా, నాగసాకి నగరాలపై వేశారు. ఈ అణుబాంబు దాడుల్లో వేల మంది మరణించగా.. ఆ రెండు నగరాలు పూర్తిగా బూడిదైపోయాయి.

తదుపరి వ్యాసం