తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deepam January 13th Episode: మంటల్లో కాలిపోయిన టిఫిన్ బండి.. బోరున ఏడ్చిన దీప.. నిజం తెలిసినా దాచేసిన కార్తీక్

Karthika Deepam January 13th Episode: మంటల్లో కాలిపోయిన టిఫిన్ బండి.. బోరున ఏడ్చిన దీప.. నిజం తెలిసినా దాచేసిన కార్తీక్

13 January 2025, 8:07 IST

google News
    • Karthika Deepam 2 Today Episode January 13: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప టిఫిన్ బండి పూర్తిగా మంటల్లో కాలిపోతుంది. దీంతో దీప బోరున ఏడ్చేస్తుంది. రౌడీను కొట్టేస్తాడు కార్తీక్. నిజం తెలుసుకున్నా దాచేస్తాడు. దీప ఇంటికి జ్యోత్స్న వస్తుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Karthika Deepam 2 January 13th Episode: మంటల్లో కాలిపోయిన టిఫిన్ బండి.. బోరున ఏడ్చిన దీప, నిజం తెలిసినా దాచేసిన కార్తీక్
Karthika Deepam 2 January 13th Episode: మంటల్లో కాలిపోయిన టిఫిన్ బండి.. బోరున ఏడ్చిన దీప, నిజం తెలిసినా దాచేసిన కార్తీక్

Karthika Deepam 2 January 13th Episode: మంటల్లో కాలిపోయిన టిఫిన్ బండి.. బోరున ఏడ్చిన దీప, నిజం తెలిసినా దాచేసిన కార్తీక్

కార్తీక్ దీపం 2 నేటి (జనవరి 13) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. గతంలో దీప చేతిలో దెబ్బలు తిన్న రౌడీలు రాత్రి టిఫిన్ బండి దగ్గరికి వస్తారు. దీప టిఫిన్ బండిని కాల్చేయాలని జ్యోత్స్న వారిని పురామాయించి ఉంటుంది. జ్యోత్స్నకు రౌడీ వీడియో కాల్ చేస్తాడు. “నాకు పగతీర్చుకునే అవకాశం ఇచ్చి.. డబ్బులు కూడా ఇచ్చారు” అంటూ జ్యోత్స్నకు ఆ రౌడీ థ్యాంక్స్ చెబుతాడు. బండి కాలిపోవడం చూడాలన్నారు కదా అంటూ వీడియో కాల్‍ను కొనసాగిస్తాడు.

కాలిపోయిన బండి.. జ్యోత్స్న రాక్షసానందం

టిఫిన్ బండిపై కిరోసిన్ పోసి తగులపెట్టేస్తారు రౌడీలు. “నీ బతుకు బండి కాలిపోవడం నేను చూడాలి దీప. నా ఎంప్లాయిస్ ముందు నన్ను అవమానిస్తావా. సారీ చెప్పిస్తావా. ఆఫీస్‍‍లో, ఇంట్లో పరుపు పోయింది” అని జ్యోత్స్న అనుకుంటుంది. దీప టిఫిన్ బండి కాలిపోవడాన్ని చూసి రాక్షసానందం పొందుతుంది జ్యోత్స్న. ఎంత ఆనందంగా ఉందో దీప.. పక్కన ఉండి చూస్తే ఇంకా సంతోషంగా ఉందని అనుకుంటుంది. ఎవరిని ఎలా.. ఎక్కడ కొట్టాలో నాకు తెలుసు దీప అని సంతోషిస్తుంది.

బోరున ఏడ్చేసిన దీప

దీపకు నిద్ర నుంచి మెలకువ వస్తుంది. ఇంతలో బయట తగలబడిపోతున్న టిఫిన్ బండిని చూస్తుంది. దీంతో షాక్ అవుతుంది. అయ్యో అని అరుస్తూ బోరు ఏడ్చేస్తుంది. ఇంతలో అక్కడి నుంచి పారిపోవాలని రౌడీలకు జ్యోత్స్న చెబుతుంది. రేయ్ ఎవర్రా మీరు.. బండి కాలిపోతోంది అని గట్టిగా ఏడుస్తుంది దీప. కార్తీక్ బాబు.. కార్తీక్ బాబు అంటూ అరుస్తుంది. దీంతో బయటికి వెళతాడు కార్తీక్. బండి కాలిపోవడాన్ని చూసి షాక్ అవుతాడు. బండి తగులబెట్టేశారు అంటూ ఏడుస్తూ చెబుతుంది దీప. రౌడీలు దొరకలేదు కదా అని జ్యోత్స్న కంగారు పడుతుంది.

రౌడీలను బాదేసిన కార్తీక్

బండిని కాల్చేసి పారిపోతున్న రౌడీలను కార్తీక్ పట్టుకుంటాడు. ఇది మా బతుకుదెరువు అంటూ దీప ఏడుస్తుంది ఇంతలో అనసూయ, కాంచన కూడా బయటికి వస్తారు. వారు కూడా కన్నీరు పెట్టుకుంటారు. రౌడీలను వెంబడించి చేరుకుంటాడు కార్తీక్. “ఆ రోజు నన్ను కొట్టారు కదా. ఎలా ఉంది నా దెబ్బ” అని ఆ రౌడీ అంటాడు. ఎలా ఉందో చూపిస్తానంటూ వారిని చితకబాదుతాడు కార్తీక్. ఫైట్ చేసి వారిని కొట్టేస్తాడు. ఎవరు చేశారు ఈ పని అంటూ దీప, కాంచన, అనసూయ ఏడుస్తారు. మన జీవనాధారం బూడిద అవుతోందని దీప కన్నీరు పెట్టుకుంటుంది.

నిజం తెలుకున్న కార్తీక్

కింద పడిన రౌడీ ఫోన్ రింగ్ అవుతుంది. కార్తీక్ దాన్ని అందుకుంటాడు. దాంట్లో జ్యోత్స్న ఫోన్ నంబర్ చూస్తాడు. కాల్ లిఫ్ట్ చేస్తాడు. రేయ్.. ఏమైందిరా అని జ్యోత్స్న అనడం వింటాడు. ఇంతలోనే ఫోన్ లాక్కెళ్లిపోతాడు రౌడీ. జ్యోత్స్న అంటూ గట్టిగా అరుస్తాడు. బండి తగులబెట్టించింది జ్యోత్స్న అనే నిజం కార్తీక్‍కు అర్థమవుతుంది. మనం కొత్తగా మొదలుపెట్టిన జీవితం ఎలా బాడిద అయిపోయిందో చూడండి బాబు అంటూ దీప వెక్కివెక్కి ఏడుస్తుంది. బండి గురించి దీప గతంలో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు కార్తీక్.

అసలు నిజం దాచేసిన కార్తీక్

“అన్నం పెడుతున్న అమ్మ అనుకున్నాం.. దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. అన్నీ కాలిపోయాయి బాబు” అని దీప అంటుంది. వాళ్లు ఎవరో తెలిసిందా అని కార్తీక్‍ను అడుగుతుంది. ఎవరో చెబితే బాదేస్తానని అనసూయ అంటుంది. “ఆరోజు టిఫిన్ చేసి డబ్బు ఇవ్వనని గొడవ చేశాడు కదా.. దీప కొట్టింది కదా.. వాడే ఈ పని చేసింది” అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్ననే ఈ పని చేయించిందనే ఆసలు నిజాన్ని కార్తీక్ దాచేస్తాడు. వాడు ఎక్కడున్నా పట్టుకొచ్చి ఈ మంటల్లోనే వేసి తగులబెట్టేద్దామని దీప అంటుంది. ఆ రౌడీని ఏదైనా చేద్దామని అనసూయ అంటే.. వాడు ఊరు పేరు లేని రౌడీ అని కార్తీక్ అంటాడు. మంచు వల్ల పాడైపోతుందని బండికి బట్ట కప్పానని, ఇప్పుడు మంటల్లో కాలిపోయిందని చెబుతూ దీప బాధపడుతుంది.

దీప ఇంటికొచ్చిన జ్యోత్స్న

బండి కాలిపోయిన విషయం తెలిసి దీప, కార్తీక్ ఇంటికి వస్తారు దాసు, కాశీ, స్వప్న. కాంచన ఇంకా కన్నీరు పెట్టుకుంటుంది. ఏడిస్తే బండి తిరిగి రాదు కదా అని కార్తీక్ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ పని చేసిన రౌడీని వదలకూడదని స్వప్న అంటుంది. వాడని కన్ఫర్మ్ కాదు అని కార్తీక్ అంటాడు. ఎవరు చేయించి ఉంటారని దాసు అడుగుతాడు. ఇంతలో కారులో జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు నా ఓదార్పు బావకు ఎంతో అవసరం అనుకుంటూ.. దీప ఇంటికి జ్యోత్స్న వస్తుంది. మనకు ఇంకెవరైనా శత్రువు ఉన్నారా బావ అని కాశీ అంటుంటేనే.. ఇంట్లోకి అడుగుపెడుతుంది. బండిని తగులబెట్టించి.. ఏమీ తెలియనట్టు ఓదార్చేందుకు వస్తుంది జోత్స్న.

జ్యోత్స్న నాటకాలు

“బావ.. రాత్రి టిఫిన్ సెంటర్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. మొత్తం కాలిపోయిందంట కదా” అని ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతుంది జ్యోత్స్న. కాలిపోలేదు.. కాల్చేశారు అంటూ నిజం తెలుసన్నట్టుగా జ్యోత్స్న వైపు కార్తీక్ చూస్తాడు. కావాలనే పగబట్టి.. నేరుగా ఏం చేయలేక.. అర్ధరాత్ర నా ఇంటికి వచ్చి బండిని కాల్చేశారు అని కార్తీక్ అంటాడు. వారెవరు అని జ్యోత్స్న అంటే.. కాస్తలో మిస్ అయ్యారని, లేకపోతే కథ వేరుగా ఉండేదని కార్తీక్ చెబుతాడు. దీంతో నిజం తెలియదనుకొని రిలాక్స్ అవుతుంది జ్యోత్స్న. పోలీస్ కంప్లైట్ ఇచ్చావా అని అడిగితే.. డిటైల్స్ మిస్ అయ్యాయని కార్తీక్ అంటాడు. బండిని నాశనం చేసేశారని జ్యోత్స్న కపటంగా మాట్లాడుతుంది.

జ్యోత్స్నకు షాకిచ్చిన దీప

బండి కాలిపోయిందని దీప ఏడుస్తూ లోపల కూర్చుందా అని జ్యోత్స్న అడుగుతుంది. ఇంతలో దీప అక్కడికి వస్తుంది. “ఏడుస్తూ కూర్చునేందుకు కాలిపోయింది మేం పెట్టుకునే బండే.. మేం నేర్చుకున్న పని కాదు. బండి మీద కాకపోతే బల్లమీద పెట్టుకుంటాం” అని దీప అంటుంది. చెప్పినట్టుగా బల్లపై టిఫిన్స్ పెట్టి అమ్మి జ్యోత్స్నకు షాక్ ఇస్తుంది దీప. ఇంటి ముందు ఓ బల్లపై టిఫిన్స్ అన్నీ పెడతారు దీప, కార్తీక్. ఇది చూసి జ్యోత్స్న రగిలిపోతుంది.

ఓనర్ పొగడ్తలు

పోరాడే మనిషికి ఉండాల్సిన లక్షణం ఇది కదా అంటూ ఇంటి ఓనర్ చప్పట్లు కొడతాడు. దీపను ప్రశంసిస్తాడు. బండి కాలిపోతే బాధపడతారని, ఆధారం లేక అద్దె కట్టలేక వెళ్లిపోతారని అనుకున్నానని అంటాడు. కానీ నీ మాటలు భయాన్ని కూడా భయపెట్టేలా ఉన్నాయంటూ దీపను ఓనర్ ప్రశంసిస్తాడు. నాకు కూడా నీలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తోందని, నువ్వు నాకు దేవుడు ఇచ్చిన కూతురు అని అంటాడు. దీంతో జ్యోత్స్న మరింత రగులుతుంది. కార్తీక్ తాకట్టు పెట్టిన ఫోన్‍ను ఓనర్ తిరిగి ఇచ్చేస్తాడు. డబ్బు ఇవ్వలేదు కదా అని కార్తీక్ అంటే.. మీరంటే ఏంటో ఈ మధ్యనే తెలిసిందని, నేను చేసింది తప్పు అనిపించందని ఓనర్ అంటాడు. ఫోన్ తిరిగి ఇచ్చేస్తాడు.

జ్యోత్స్నపై కార్తీక్ ఫైర్

అయిన వారే అర్థం చేసుకునేందుకు ప్రయత్నించని ఈ రోజుల్లో.. ఏ సంబంధం లేని మీరు ధైర్యం చెప్పేందుకు ముందుకు వచ్చారని నమస్కరిస్తాడు కార్తీక్. మీ లాంటి మంచి వాళ్లకు కష్టం వచ్చినప్పుడు నిలబడకపోతే వాడు మనిషే అవడని ఓనర్ అంటాడు. టిఫిన్స్ తీసుకొని, డబ్బు ఇచ్చి వెళతాడు. “మన వాళ్లు తప్ప.. బయటి వాళ్లందరూ మంచోళ్లే కాశీ” అని స్వప్న అంటుంది. ఏంటే నన్ను చూసి అంటున్నావని జ్యోత్స్న కోప్పడుతుంది. దీంతో కార్తీక్ ఫైర్ అవుతాడు. మర్యాదగా మాట్లాడు జోత్స్న అని వార్నింగ్ ఇస్తాడు. మీ చెల్లి ఏమనిందో విన్నావా అని జ్యోత్స్న అంటే.. నా మనసులోని మాట కూడా అదే అని కార్తీక్ అంటాడు. ఓనర్ రెండు మాటలు మంచిగా మాట్లాడితే గొప్పోడు అయ్యాడా.. నేను పలుకరించేందుకు రాలేదా అని జోత్స్న అంటుంది. అలా ఎవరన్నారని కాంచన అంటే.. నీ సవతి కూతురు అని స్వప్నను ఉద్దేశించి జ్యోత్స్న ఉంటుంది. పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని కార్తీక్ ఆగ్రహిస్తాడు. స్వప్న నా చెల్లి.. తన గురించి అంత వ్యంగ్యంగా చెప్పొద్దని అంటాడు. కొన్ని విషయాలు ఎప్పుడు మాట్లాడకూడదో తెలియాలని కాశీ అంటాడు. నోరు మాయి అని కాశీని జ్యోత్స్న అంటే.. ఎవరిని అంటున్నావ్.. వీడు నా కొడుకు అని దాసు కలుగజేసుకుంటాడు.

రక్తం మరిగిపోతోంది

కాశీ నీకు తమ్ముడు అవుతాడు తెలుసా అని జ్యోత్స్నతో కార్తీక్ అంటే.. అలా అనుకోవాల్సిన అవసరం లేదులే బావ అని కాశీ అంటాడు. ఎందుకొచ్చావే అని కాంచన అంటే.. నాకు బుద్ధి లేక అత్తా అని జ్యోత్స్న చిరాకు పడుతుంది. ఈ మాట నిజం అని సెటైర్ వేస్తాడు కార్తీక్. సాయం చేసేందుకు వచ్చానని జోత్స్న అంటుంది. చేసిన సాయం చాలు ఇక బయలుదేరు అని కార్తీక్ చెబుతాడు. నేనేం సాయం చేశానని జ్యోత్స్న అంటుంది. "టిఫిన్ సెంటర్ తగులబెట్టావ్ కదా. నిన్ను చూస్తేంటే రక్తం మరిగిపోతోంది. లాగిపెట్టి కొట్టాలనుంది” అని మనసులో అనుకుంటాడు కార్తీక్. నేనేం సాయం చేశానని జ్యోత్స్న మళ్లీ అడుగుతుంది. “కాలిపోయింది మా టిఫిన్ సెంటరే. మా పని కాదు.. మా వ్యాపారం కాదు. బండి లేకపోతే బల్లపై పెట్టుకుంటాం. బల్ల కూడా కాలిపోతే సైకిల్‍పై పెట్టుకుంటాం. అది కూడా కాలిపోతే నేను, మా ఆవిడ నాలుగు క్యాన్లు పట్టుకొని ఫుట్‍పాత్‍పై అమ్ముకుంటాం. అంతే కానీ ఏదో పోయిందని ఏడుస్తూ కూర్చోం” అని జ్యోత్స్నపై ఫైర్ అవుతాడు కార్తీక్. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 13) ఎపిసోడ్ ముగిసింది.

తదుపరి వ్యాసం