Karthika Deepam Today December 11: దగ్గరవుతున్న దీప కార్తీక్, దీపను చంపేస్తానంటున్న జ్యోత్స్న, వద్దని హెచ్చరించిన దాసు
11 December 2024, 10:12 IST
- కార్తీక్, దీపాలను దగ్గర చేసేందుకు ఇంట్లో వారు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరిద్దరికీ ఏకాంతాన్ని ఇచ్చే విధంగా శౌర్యను వేరే గదిలో పడుకోబెడతారు. జ్యోత్స్న.. దీపపై విపరీతమైన కోపంలో ఉంటుంది.
కార్తీక దీపం సీరియల్
కార్తీకదీపం తాజా ఎపిసోడ్లో జ్యోత్స్న పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది. దీప, కార్తీక కలిసి ఆఫీసులో తనని ఎలా రెచ్చగొట్టారో పారిజాతంతో చెబుతూ కోపంతో ఊగిపోతుంది. దీప వల్ల తన ఓర్పు, సహనం చచ్చిపోతున్నాయని, మంచితనం పూర్తిగా పోయిందని అంటుంది. ఇంటిలోనూ ఆఫీసులోనూ కూడా మనశ్శాంతి లేకుండా ఉందని చెప్పుకుంటుంది.
కోపంలో జోత్స్న ఆ దీపను తాను చంపేస్తానని అంటుంది. అది విన్న దాసు ‘అది నేను ఉండగా జరగదు ఆమెకు దూరంగా ఉండటమే నీకు అన్ని విధాలా మంచిది’ అని అంటాడు. పారిజాతం, జ్యోత్స్న ఎన్ని మాట్లాడినా కూడా దాసు దీప గురించి చెడుగా మాట్లాడనివ్వడు. దీంతో పారిజాతం ‘ఆ దీపను ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం పద’ అని జోత్స్నను తీసుకుని వెళ్ళిపోతుంది.
సీన్ కార్తీక్ ఇంట్లోకి మారిపోతుంది. కార్తీక్ గదిలో ఒక్కడే ఉంటాడు. శౌర్య వాళ్ళ నాన్నమ్మ దగ్గర పడుకోవడానికి వెళ్ళిందని దీపతో చెబుతాడు. దీప గ్లాసుతో పాలు తీసుకుని వస్తుంది. అప్పుడు కార్తీక్, శౌర్యని అక్కడే పడుకోనివ్వమని అంటాడు. దీపా, కార్తీక్‌కు గ్లాసుతో పాలను అందిస్తుంది. పాలు సగం సగం పంచుకొని తాగుదామని కార్తీక్ చెబుతాడు. తర్వాత ‘ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మల్లెపూలు తెచ్చాను కదా పెట్టుకోలేదా’ అని అడుగుతాడు. దానికి దీప దేవుడికి పెట్టానని చెబుతుంది. కొన్ని పువ్వులు నువ్వు కూడా పెట్టుకోవాల్సింది అంటాడు కార్తీక్. దీపతో కాసేపు సరదాగా మాట్లాడుకుని పడుకుందామని చెబుతాడు. అప్పుడు దీప కార్తీక పడుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడుతుంది.
ఆ తర్వాత సీన్ జోత్స్న ఆఫీస్ లోకి మారుతుంది. ఉదయం కాగానే జోత్స్న... కార్తీక్ కు ఫైల్స్ అధికంగా ఇచ్చి వర్కు పూర్తి చేయమని చెబుతుంది. ఎంత లేట్ అయినా కూడా ఫైల్స్ అన్నీ పూర్తి చేశాకే వెళ్ళమని ఆర్డర్ వేస్తుంది. కాఫీ, టీ ,జ్యూస్ ఏది కావాలన్నా నీ దగ్గరికే వస్తాయని చెబుతుంది. కార్తీక్ మాట్లాడుతూ ఇంత పని ఒక్క రోజులో పూర్తి అవ్వదని చెబుతాడు. అయితే జ్యోత్స్న ఇప్పటికీ నువ్వంటే నాకిష్టమే బావ, నిన్ను బాధ పెట్టాలని ఇలా చేయడం లేదు అని అంటుంది. దానికి కార్తీక్ ‘వర్క్ చేస్తాను నువ్వు వెళ్ళు’ అని చెబుతాడు.
జోత్స్న తన క్యాబిన్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచే కార్తీక్ ని చూస్తూ ఉంటుంది. నువ్వు వర్క్ చేసుకో బావ నేను నిన్ను దూరం నుంచే ప్రేమిస్తాను అనుకుంటుంది మనసులో. అందరూ ఆఫీస్ నుంచి వెళ్లిపోయాక జ్యోత్స్నా, కార్తీక్ మాత్రమే మిగులుతారు. దీప.. కార్తీక్ ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతుంది. అలాగే జ్యోత్స్న కూడా ఇంకా ఇంటికి రాలేదని పారిజాతం ఆమెకు ఫోన్ చేస్తుంది. అప్పుడు జోత్స్నా ఆఫీసులో జరిగిన విషయాన్ని చెబుతుంది. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.