Karthika Deepam 2 Serial: దాసుపై జ్యోత్స్న మర్డర్ అటెంప్ట్ - కూతురి బాగోతం కళ్లారా చూసిన దశరథ్ -కార్తీక్ ప్రామిస్
16 January 2025, 7:24 IST
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 17 ఎపిసోడ్‌లో దీపనే శివన్నారాయణ ఆస్తికి వారసురాలు అనే నిజం దాసు బయటపెట్టాలని అనుకుంటాడు. కానీ జ్యోత్స్న అతడిని అడ్డుకుంటుంది. తండ్రి అని కూడా చూడకుండా దాసును చంపాలని ప్రయత్నిస్తుంది. దాసును దశరథ్ కాపాడుతాడు.

కార్తీక దీపం 2 జనవరి 17 ఎపిసోడ్
దీపనే శివన్నారాయణ అసలైన ఇంటి వారసురాలని, దశరథ్, సుమిత్ర కూతురు జ్యోత్స్న కాదు దీప అనే నిజం బయటపెట్టాలని దాసు నిర్ణయించుకుంటాడు. ఆవేశంగా శివన్నారాయణ ఇంటికొస్తాడు. దాసు నిజం చెప్పకుండా జ్యోత్స్న అడ్డుకుంటుంది. తన తండ్రి అని కూడా చూడకుండా దాసు తలపై ఇనుపరాడ్‌తో గట్టిగా ఒక్కటి కొడుతుంది.
జ్యోత్స్న కొట్టిన దెబ్బకు స్పృహ కోల్పోతాడు దాసు. బాధను తట్టుకోలేక అన్నయ్య అని దాసు గట్టిగా అరవడంతో దశరథ్ బయటకు వస్తాడు. దాసును జ్యోత్స్న కొట్టడం చూస్తాడు. జ్యోత్స్నను అడ్డుకోవడానికి పరుగున వస్తాడు. తండ్రి రాకను గమనించిన జ్యోత్స్న...దాసును కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి జంప్ అవుతుంది.
ఫాలో అయిన దశరథ్...
జ్యోత్స్న కారును ఫాలో అవుతాడు దశరథ్. ఓ మామిడితోటలోకి దాసును తీసుకొచ్చి పడేస్తుంది జ్యోత్స్న. నన్నెందుకు హంతకురాలిని చేస్తున్నావు...నిజం చెప్పొద్దు అన్నప్పుడు నా మాట వినొచ్చుగా అని స్పృహలోని లేని దాసుతో అంటుంది జ్యోత్స్న. తన కూతురు మరో రూపం చూసి దశరత్ షాకవుతాడు. దాసును జ్యోత్స్న ఏం చేస్తుందోనని కంగారు పడతాడు.
ప్రాణాలతో ఉండకూడదు...
తాను బ్రతకాలి అంటే తన గురించి నిజం తెలిసిన వాళ్లు ఎవరూ ప్రాణాలతో ఉండకూడదని జ్యోత్స్న అనుకుంటుంది. పక్కనే ఉన్న రాయితో దాసు కొట్టి చంపేయాలని అనుకుంటుంది. రాయిని దాసు తలపై విసరడానికి పైకి ఎత్తుతుంది. జ్యోత్స్నను అడ్డుకోవడానికి కారు హారన్‌ను మొగిస్తాడు దశరథ్. ఆ హారన్ సౌండ్ విని ఎక్కడ పట్టుబడిపోతాననే భయంతో జ్యోత్స్న అక్కడి నుంచి పారిపోతుంది. దాసును శివన్నారాయణ కాపాడుతాడు.
కార్తీక్ అబద్ధం...
శౌర్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, ఆమెను వారం రోజులు హాస్పిటల్‌లోనే ఉంచాలని డాక్టర్ చెప్పిన మాటలను కార్తీక్ గుర్తుచేసుకుంటాడు. ఈ ట్రీట్‌మెంట్ గురించి దీపకు, శౌర్యకు ఎలా చెప్పాలా, ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటాడు. నాకు ఏమైంది అని తండ్రిని అడుగుతుంది శౌర్య. నీకు బలం లేదంటా ట్యాబ్లెట్స్ వాడతే సరిపోతుందని డాక్టర్ అన్నాడని అబద్ధం ఆడుతాడు కార్తీక్.
లాకెట్ ఇస్తా....
తాను డాక్టర్ చెప్పింది మొత్తం విన్నానని కార్తీక్‌కు షాకిస్తుంది శౌర్య. నువ్వు విన్న విషయాలేవి అమ్మకు చెప్పొద్దని శౌర్యతో అంటాడు కార్తీక్. నేను చెప్పినట్లు వింటే నీకు ఇష్టమైంది ఏది అడిగినా ఇస్తానని కూతురికి మాటిస్తాడు కార్తీక్. లాకెట్ కావాలని తండ్రిని అడుగుతుంది శౌర్య. ఇస్తానని ఎమోషనల్‌గా సమాధానమిస్తాడు కార్తీక్. కూతురికి ప్రామిస్ చేస్తాడు. నిన్ను ఎలాగైన బతికించుకుంటానని, నీకు ఏం కానివ్వనని శౌర్యను ఉద్దేశించి మనసులో కార్తీక్ అనుకుంటాడు.
డోర్ లాక్....
రూమ్‌లో చిక్కుకున్న సుమిత్ర గట్టిగా కేకలు వేస్తుంది. ఆమె కేకలు విని పారిజాతం డోర్ లాక్ తీస్తుంది. తనను రూమ్‌లో పెట్టి ఎవరూ డోర్ లాక్ చేశారని సుమిత్ర అడుగుతుంది. జ్యోత్స్నపైనే అనుమానం వ్యక్తం చేస్తుంది. అప్పుడే జ్యోత్స్న ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. . దాసుకు చంపకుండా వచ్చి తప్పు చేశానని అనుకుంటుంది.
మర్డర్ చేయడానికి....
జ్యోత్స్న రాగానే ఎక్కడికి వెళ్లావని సుమిత్ర, పారిజాతం నిలదీస్తారు. మర్డర్ చేయడానికి అని నిజం చెబుతుంది జ్యోత్స్న. మనవరాలు అన్న మాటలు జోక్ కాదని నిజమేనని పారిజాతం అనుమానపడుతుంది. సుమిత్రను అందుకే రూమ్‌లో పెట్టి లాక్ చేసి ఉంటుందని అనుకుంటుంది.
దాసును హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు దశరథ్. తన కూతురు దాసును చంపాలని ఎందుకు అనుకుంది...ఏదో నిజం చెప్పాలని దాసు మా ఇంటికి వచ్చానని అన్నాడు ఆ నిజం ఏమిటి అని ఆలోచిస్తుంటాడు దశరథ్. తన కూతురు ఓ మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు అనే నిజం తట్టుకోలేకపోతాడు.
బతకడం కష్టమే...
అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్...దాసు బతకడం కష్టమేనని అంటాడు. ఒకవేళ బతికినా జీవితాంతం కోమాలోనే ఉంటాడని చెబుతాడు. దాసు తన తమ్ముడు అని, అతడిని బతికించడం కోసం కోట్లు ఖర్చయినా పర్వాలేదని, తాను భరిస్తానని డాక్టర్‌తో దశరథ్ చెబుతాడు. దాసు ఇక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పొద్దని డాక్టర్‌తో అంటాడు దశరథ్. దాసు రూమ్‌లోకి వస్తాడు దశరథ్. నిన్ను నేను కాపాడుకుంటానని అంటాడు. నిన్ను నా కూతురు ఎందుకు చంపాలని అనుకుందో నువ్వు కోలుకునే వరకు ఎవరిని అడగనని దశరథ్ మనసులో అనుకుంటాడు.
దీప ప్రశ్నలు....
శౌర్యకు ఏమైందని కార్తీక్‌ను అడుగుతుంది దీప. ఏం కాలేదని అబద్ధం చెబుతాడు కార్తీక్. ఏం కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ డాక్టర్ ఎందుకు ఇచ్చాడని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. శౌర్య నీరసంగా ఉందని అందుకోసమే డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇచ్చారని కార్తీక్ అంటాడు. శౌర్య ట్రీట్‌మెంట్‌కు యాభై లక్షలు అవసరమని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటాడు కార్తీక్.
నిజం దాస్తున్నారు....
శౌర్య విషయంలో నేను బాధపడతానని మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారని కార్తీక్‌తో అంటుంది దీప. శౌర్య కోసమే తాను బతుకుతున్నానని, కూతురి జోలికి వచ్చినందుకు భర్త ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడలేదని, శౌర్యకు ఏమైనా అయితే తాను చావడానికి కూడా వెనుకాడనని దీప అంటుంది.
దీప మాటలు విని శౌర్య సర్జరీ గురించి ఎప్పటికీ ఆమెకు చెప్పకూడదని కార్తీక్ అనుకుంటాడు. నా మీద నీకు నమ్మకం ఉంటే మరోసారి నన్ను ఈ ప్రశ్న అడకూడదని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దశరథ్ కోపం...
దాసు ప్రాణాలు పూర్తిగీ తీయకుండా వచ్చి తప్పు చేశానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆమె దగ్గరకు వచ్చిన పారిజాతం ఎవరికి చంపడానికి వెళ్లావని మనవరాలిని నిలదీస్తుంది. కానీ జ్యోత్స్న సమాధానం దాటవేస్తుంది. ఇంట్లో దశరథ్ కనిపించకపోవడంతో తండ్రి తనను ఫాలో అవుతూ వచ్చి ఉంటాడని జ్యోత్స్న కంగారు పడుతుంది. అప్పుడే దశరథ్ ఎంట్రీ ఇస్తాడు. దశరథ్ దిగాలుగా కనిపిస్తాడు. ఏమైంది...ఎక్కడికి వెళ్లారు అని భర్తను అడుగుతుంది సుమత్రి. దశరథ్ సమాధానం చెప్పకుండా జ్యోత్స్న వైపు కోపంగా చూస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.