తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jani Master: జానీ మాస్టర్‌కు భారీ ఎదురుదెబ్బ.. నేషనల్ అవార్డు రద్దు!

Jani Master: జానీ మాస్టర్‌కు భారీ ఎదురుదెబ్బ.. నేషనల్ అవార్డు రద్దు!

05 October 2024, 23:46 IST

google News
    • Jani Master National Award: జాతీయ అవార్డును అందుకునేందుకు మధ్యంతర బెయిల్ పొందిన జానీ మాస్టర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ప్రకటించిన జాతీయ అవార్డును నిలిపివేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..
Jani Master: జానీ మాస్టర్‌కు భారీ ఎదురుదెబ్బ.. నేషనల్ అవార్డు రద్దు!
Jani Master: జానీ మాస్టర్‌కు భారీ ఎదురుదెబ్బ.. నేషనల్ అవార్డు రద్దు!

Jani Master: జానీ మాస్టర్‌కు భారీ ఎదురుదెబ్బ.. నేషనల్ అవార్డు రద్దు!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తూనే ఉంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన జైలుకు వెళ్లారు. తనపై వేధింపులకు పాల్పడ్డారని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు చేయటంతో జానీపై కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసు కూడా రిజిస్టర్ అయింది. అయితే, జాతీయ చలనచిత్ర అవార్డు అందుకునేందుకు మధ్యంతర బెయిల్‍ను జానీ ఇటీవలే పొందారు. అయితే, ఇప్పుడు ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును కేంద్రం వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది.

జాతీయ అవార్డు రద్దు.. పోక్సో కేసుతో..

తమిళ మూవీ ‘తిరుచిత్రాబళం’లోని మేఘం కరుగత పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డుకు జానీ మాస్టర్‌ ఎంపికయ్యారు. 2022కు గాను 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ ఏడాది ఈ ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 8న అవార్డును జానీ అందుకోవాల్సి ఉంది. అందుకే ఆయనకు కోర్టు మధ్యంతర బెయిర్ మంజూరు చేసింది. అయితే, జానీకి ప్రకటించిన జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్టు సమాచారం. పోక్సో కేసు నమోదవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

బెయిల్‍పై అనిశ్చితి!

లైంగిక వేధింపుల కేసులో సెప్టెంబర్ 19వ తేదీన జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. కోర్టు రిమాండ్ విధించటంతో చంచల్‍గూడ సెంట్రల్ జైలులో ఉంటున్నారు. అయితే, జాతీయ అవార్డు అందుకునేందుకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్‍ను రంగారెడ్డి కోర్టు మంజూరు చేసింది.

అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో జానీ మాస్టర్ జాతీయ అవార్డు అందుకోవాల్సింది. అయితే, ఆయన అవార్డు క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. దీంతో మధ్యంతర బెయిల్ కూడా అనిశ్చితిలో పడింది. నేషనల్ అవార్డు అందుకునేందుకు ఇచ్చిన ఆ బెయిల్‍ను న్యాయస్థానం రద్దు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జానీకి ఇది మరింత ఎదురుదెబ్బగా ఉండనుంది.

2020 నుంచి తనపై జానీ మాస్టర్ చాలాసార్లు అనేక ప్రదేశాల్లో లైంగిక దాడి చేశారని ఆయన వద్దే పని చేసే 21ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు కంప్లైట్ చేశారు. తాను మైనర్‌గా ఉన్నప్పటి నుంచి దురాగతం చేశారని పేర్కొన్నారు. దీంతో జానీపై పోక్సో కేసు కూడా నమోదైంది. ఇంట్లో, ఔట్‍డోర్ షూటింగ్‍ల్లో ఇలా చాలాసార్లు తనపై వేధింపులకు పాల్పడ్డారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని కూడా పేర్కొన్నారు. ఇక, కేసులు నమోదయ్యాక జానీ పరారయ్యారు. దీంతో సైబరాబాద్ పోలీసులు గోవాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 19వ తేదీన అరెస్ట్ చేసి హైదరాబాద్‍కు తీసుకొచ్చారు. ఆ తర్వాత న్యాయస్థానం రిమాండ్ విధించడటంతో జైలుకు తరలించారు పోలీసులు. విచారణలో తన తప్పును జానీ అంగీకరించారనే సమాచారం కూడా బయటికి వచ్చింది.

నేషనల్ వైడ్‍గా స్టార్ కొరియోగ్రాఫర్‌గా పాపులర్ అయిన జానీ మాస్టర్ కెరీర్‌పై ఈ కేసులతో నీలినీడలు కమ్ముకున్నాయి. రెగ్యులర్ బెయిల్ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. తీవ్రమైన ఆరోపణలు ఉండటం ఆయనకు ప్రతికూలంగా ఉంది. ఇప్పుడు జాతీయ అవార్డు కూడా రద్దవడంతో జానీకి మరింత ఎదురుదెబ్బ తలిగింది.

తదుపరి వ్యాసం