తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu: కొట్టుకున్నంత పని చేసిన యావర్, అమర్.. అడ్డుకున్న శివాజీ: వీడియో

Bigg Boss 7 Telugu: కొట్టుకున్నంత పని చేసిన యావర్, అమర్.. అడ్డుకున్న శివాజీ: వీడియో

14 November 2023, 14:54 IST

google News
    • Bigg Boss 7 Telugu Day 72 Promo: బిగ్‍బాస్ హౌస్‍లో నామినేషన్ల సందర్భంగా ప్రిన్స్ యావర్, అమర్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఒకరి మీదికి ఒకరు వెళ్లారు.
Bigg Boss 7 Telugu: కొట్టుకునేంత పని చేసిన యావర్, అమర్.. అడ్డుకున్న శివాజీ
Bigg Boss 7 Telugu: కొట్టుకునేంత పని చేసిన యావర్, అమర్.. అడ్డుకున్న శివాజీ

Bigg Boss 7 Telugu: కొట్టుకునేంత పని చేసిన యావర్, అమర్.. అడ్డుకున్న శివాజీ

Bigg Boss 7 Telugu Day 72 Promo: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ హౌస్‍లో కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ మరింత పెరిగింది. 11వ వారం నామినేషన్ల ప్రక్రియ ఏకంగా రెండో రోజు ఎపిసోడ్‍కు కూడా కొనసాగింది. నేటి (నవంబర్ 14) ఎపిసోడ్‍లోనూ నామినేషన్ల తంతు ఉండనుంది. నామినేషన్ల సందర్భంగా కొందరు కంటెస్టెంట్ల మధ్య వాదన తీవ్రంగా జరిగింది. ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ ఒకరి మీదికి ఒకరు దూసుకెళుతూ కొట్టుకున్నంత పని చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది.

ముందుగా రతికతో ఓ విషయం చెప్పాలనుకున్నానని అమర్ అన్నారు. బయటి నుంచి దానివి ఎవరి మీద ఇలాంటి పాయింట్లు చెప్పకు అన్నారు. దీంతో కల్పించుకున్న ప్రిన్స్ యావర్.. “ఆమెకు (రతిక)కు ఇది పాత మాట. కానీ నాకు కొత్త మాట” అని యావర్ అన్నారు. పాత విషయాలు తవ్వుకుంటే ఒక్కొక్కరి జాతకాలు ఏమీ గొప్పగా లేవని అమర్ వారించారు. నామినేషన్ కోసం అమర్ చెప్పే పాయింట్ రెండో, మూడో వారానిదా అని యావర్‌తో రతిక అన్నారు. దీంతో అమర్, యావర్ మధ్య ఫైట్ మొదలైంది.

స్ప్రైట్ కోసం నామినేట్ చేసిన యావర్ అంటూ అమర్ గట్టిగా అరిచారు. దీంతో “నీ ప్రవర్తన కరెక్టా” అని యావర్ నిలదీశారు. రతికతో తాను ఏం చెప్పానో చూశావా అని అమర్ అరిచారు. దీంతో పోరు మరింత తీవ్రమైంది.

యావర్, అమర్ ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. రా.. రా అంటూ అరుచుకున్నారు. కొట్టుకునేంత పని చేశారు. “నీకు హైప్ కావాలా.. అయితే రా” అని యావర్ అన్నారు. మీద మీదకు వెళుతున్న అమర్, యావర్‌ను శివాజీ అడ్డుకున్నారు. ఇద్దరినీ దూరంగా పంపారు.

“అమర్ కావాలి.. అమర్ పోవాలి” అంటూ వెటకారంగా అమర్ అరిచారు. దీంతో మళ్లీ కోపంతో అమర్ వైపు యావర్ వెళుతుండగా.. శివాజీ అతడి చేయి పట్టుకొని ఆపారు. పాత విషయాన్ని గుర్తు చేసి “నిజంగా వేయాలంటే.. నిన్ను వేసేసేవాడిని” అని అమర్ అన్నారు.

ఆ తర్వాత గౌతమ్ కృష్ణ, శివాజీ మధ్య కాస్త వాదన జరిగింది. “బిగ్‍బాస్ హౌస్‍లో ఎమోషన్ అనేది లూజ్ మోషన్. మనం ఫ్లోను ఆపలేం” అంటూ గౌతమ్ కృష్ణ డైలాగ్ చెప్పారు. దీంతో అది కంట్రోల్ చేసుకోవాలి. మంచిది” అని శివాజీ అన్నారు. ఇలా.. ప్రోమోనే ఇంటెన్స్‌గా సాగింది. ఈ నామినేషన్ల తంతు పూర్తిగా నేటి ఎపిసోడ్‍లో రానుంది. ప్రోమో ఇక్కడ చూడండి.

తదుపరి వ్యాసం