తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ka Ott Release: ఓటీటీలో ‘క’ సినిమాపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు.. గట్టిగానే ప్లాన్ చేశారట

KA OTT Release: ఓటీటీలో ‘క’ సినిమాపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు.. గట్టిగానే ప్లాన్ చేశారట

Galeti Rajendra HT Telugu

29 November 2024, 16:30 IST

google News
  • Abbavaram Ka Movie OTT: కిరణ్ అబ్బవరం క సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసిన చాలా మంది నెటిజన్లు.. సోషల్ మీడియాలో మూవీపై ఫన్నీగా స్పందిస్తున్నారు. మూవీని స్ట్రీమింగ్‌కి ఉంచిన ఈటీవీ విన్‌పై కూడా నెటిజన్లు సైటర్లు వేస్తున్నారు.   

క సినిమాలో కిరణ్ అబ్బవరం
క సినిమాలో కిరణ్ అబ్బవరం

క సినిమాలో కిరణ్ అబ్బవరం

Mystery Thriller On OTT: కిరణ్ అబ్బవరం, నయన్‌ సారిక జంటగా నటించిన ‘క’ సినిమా గురువారం (నవంబరు 28) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రూ.22 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టి హిట్‌గా నిలిచింది. దీపావళి రోజున విడుదలైన ఈ సినిమా అమరన్, లక్కీ భాస్కర్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొని థియేటర్లలో నిలబడగలిగింది. ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీ కోసం వెయిట్ చేయగా.. ఈటీవీ విన్ గురువారం నుంచి స్ట్రీమింగ్‌కి ఉంచింది.

ఐఎండీబీలో 7.4 రేటింగ్

సుజీత్‌ - సందీప్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా కిరణ్ అబ్బవరం, నయన్‌ సారికతో పాటు, అచ్యుత్‌కుమార్‌, తన్వీ రామ్‌, రెడిన్‌ కింగ్‌స్లే తదితరులు కీలక పాత్రలు పోషించారు. చింతా గోపాలకృష్ణ ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఐఎండీబీలో 7.4 రేటింగ్ దక్కించుకున్న క సినిమా.. థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే క అత్యుత్తమ సినిమాగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.

పైరసీకి ఛాన్స్ లేకుండా

క మూవీని స్ట్రీమింగ్‌కి ఉంచే ముందు ఈటీవీ విన్ పైరసీకి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. దాంతో మూవీ లింక్ ఎక్కడ్రా.. దొరకట్లేదు అంటూ చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మీమ్స్, జోక్‌లు సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చిన గంటల వ్యవధిలోనే మంచి క్వాలిటీతో సినిమా ప్రైవేట్ వెబ్‌సైట్స్‌లోకి వచ్చేస్తున్న విషయం తెలిసిందే. కానీ.. క విషయంలో ఈటీవీ విన్ కొంత మేర పైరసీని కట్టడి చేయగలిగింది. 

క సినిమా కథ ఏంటంటే?

కృష్ణగిరి అనే ఊరిలో అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. ఆ ఊరిలో కాంట్రాక్ట్ పోస్ట్‌‌మాన్‌గా ఉంటూ ఇతరుల ఉత్తరాలను దొంగతనంగా చదివే అలవాటు ఉన్న కిరణ్ అబ్బవరం (అభినయ వాసుదేవ‌)కి ఒక ఉత్తరం ద్వారా ఆ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించిన ఒక క్లూ దొరుకుతుంది. దాని ఆధారంగా వాసుదేవ్ ఆ సమస్యని ఎలా పరిష్కరిస్తాడు అనేది సినిమా.

 

తదుపరి వ్యాసం