తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు క‌న్న‌డ సీరియ‌ల్ ఎండ్ - అక్క‌డ కూడా రిషి, వ‌సుధార‌లే హీరోహీరోయిన్లు!

Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు క‌న్న‌డ సీరియ‌ల్ ఎండ్ - అక్క‌డ కూడా రిషి, వ‌సుధార‌లే హీరోహీరోయిన్లు!

03 October 2024, 9:41 IST

google News
  • Guppedantha Manasu Serial:గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు రెండోసారి శుభంకార్డు ప‌డింది. క‌న్న‌డ వెర్ష‌న్ బుధ‌వారం నాటితో ముగిసింది. క‌న్న‌డంలో హోంగ‌నాసు పేరుతో ఈ సీరియ‌ల్ డ‌బ్ అయ్యింది. 

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu Serial: తెలుగులో గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు ఆగ‌స్ట్ నెల‌లో మేక‌ర్స్ ఎండ్ కార్డ్ వేశారు. రిషి రీఎంట్రీ త‌ర్వాత సీరియ‌ల్ ఇంట్రెస్టింగ్‌గా సాగుతోన్న త‌రుణంలో అర్థాంత‌ర‌గా సీరియ‌ల్‌ను ముగించారు. రిషి, వ‌సుధార‌ల ప్రేమ‌క‌థకు పుల్‌స్టాప్ పెట్టారు.

రెండోసారి శుభంకార్డు...

తాజాగా గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు రెండోసారి శుభంకార్డు ప‌డింది. బుధ‌వారం నాటితో గుప్పెడంత మ‌న‌సు క‌న్న‌డ డ‌బ్బింగ్ వెర్ష‌న్ సీరియ‌ల్ ముగిసింది. ఈ విష‌యాన్ని స్టార్ సువ‌ర్ణ ఛానెల్‌ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. క‌న్న‌డంలోకి హొంగ‌నాసు పేరుతో గుప్పెడంత మ‌న‌సు సీరియల్ డ‌బ్ అయ్యింది.

టీఆర్‌పీలో టాప్‌....

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ హీరోహీరోయిన్లు ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ క‌న్నడ భాష‌కు చెందిన వారే కావ‌డంతో అక్క‌డ కూడా స్ట్రెయిట్ సీరియ‌ల్స్‌కు ధీటుగా టీఆర్‌పీ రేటింగ్స్‌ను సొంతం చేసుకున్న‌ది. తెలుగులో ఆగ‌స్ట్‌లో గుప్పెడంత మ‌న‌సు ఎండ్ కాగా....క‌న్న‌డ వెర్ష‌న్ మాత్రం నెల రోజులు ఆల‌స్యంగా ముగిసింది.

క‌న్న‌డంలోనే కాకుండా త‌మిళం, మ‌ల‌యాళం, బెంగాళీ, మ‌రాఠీతో పాటు మ‌రికొన్ని భాష‌ల్లో గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ రీమేక్ అయ్యింది. మిగిలిన భాష‌ల్లో వేరే హీరోహీరోయిన్లు లీడ్ రోల్స్‌లో క‌నిపించారు. ఒక్క తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో మాత్ర‌మే రిషి, వ‌సుధార పాత్ర‌ల్లో ముఖేష్ గౌడ‌, ర‌క్షా గౌడ క‌నిపించారు.

గుప్పెడంత మ‌న‌సు సీక్వెల్‌...

రిషి, వ‌సుధార పాత్ర‌ల‌కు బుల్లితెర అభిమానుల్లో ఉన్న క్రేజ్ కార‌ణంగా వీరిద్ద‌రి కాంబోలో మ‌రో సీరియ‌ల్ రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే అది గుప్పెడంత మ‌న‌సు సీక్వెలా? లేదంటే కొత్త క‌థ‌తో మ‌రో సీరియ‌ల్ మొద‌లుపెడ‌తారా అన్న‌ది త్వ‌ర‌లోనే క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం.

సినిమాల‌పై ఫోక‌స్‌...

మ‌రోవైపు గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగించిన రిషి సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాడు. హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒక‌టి బైలింగ్వ‌ల్ మూవీ కాగా...మ‌రొక‌టి స్ట్రెయిట్ తెలుగు మూవీ కావ‌డం గ‌మ‌నార్హం. స్ట్రెయిట్ తెలుగు మూవీ గీతాశంక‌రం గ‌త ఏడాది ప్రారంభ‌మైంది.

విలేజ్ బ్యాక్‌డ్రాప్ ల‌వ్‌స్టోరీగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. గీతా శంక‌రం సినిమాకు రుద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్రియాంక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌లే బెంగ‌ళూరులో కీల‌క‌మైన ఎపిసోడ్‌ను షూట్‌చేశారు.

క‌న్న‌డ‌, తెలుగు బైలింగ్వ‌ల్‌...

క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో ప్రియ‌మైన నాన్న‌కు పేరుతో మ‌రో బైలింగ్వ‌ల్ మూవీని ఇటీవలే అనౌన్స్‌చేశాడు రిషి. క‌న్న‌డంలో తీర్థ‌రూప తండేయావ‌రిగే అనే టైటిల్‌తో ఈ మూవీ రాబోతోంది. ప్రియ‌మైన నాన్న‌కు మూవీకి రామేన‌హ‌ల్లి జ‌గ‌న్నాథ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోన్న‌ట్లు స‌మాచారం.

నిహార్ ముఖేష్‌...

ఈ రెండు సినిమాలు వ‌చ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ అవుతాయ‌ని ఇటీవ‌లే రిషి ప్ర‌క‌టించాడు. తెలుగు, క‌న్న‌డ బైలింగ్వ‌ల్ మూవీ పోస్ట‌ర్స్‌పై ముఖేష్ గౌడ పేరు నిహార్ ముఖేష్‌గా క‌నిపించింది. ముఖేష్ గౌడ పేరుతో సీరియ‌ల్స్ చేసిన రిషి...సినిమాల్లో మాత్రం నిహార్ ముఖేష్‌గా కొన‌గాల‌ని రిషి నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. రిషి బాట‌ల‌తోనే ర‌క్షా గౌడ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

తదుపరి వ్యాసం