Guppedantha Manasu September 4th Episode: రిషిని విలన్‌ను చేసిన వసుధార - క్షమాపణలు చెప్పించిన ఏంజెల్
04 September 2023, 8:37 IST
Guppedantha Manasu September 4th Episode:ఏంజెల్ మనసులో రిషి పట్ల ఉన్న ఇష్టాన్ని ఎలాగైనా తొలగించాలని వసుధార ఫిక్స్ అవుతుంది. రిషిని ఏంజెల్ పెళ్లి చేసుకోకుండా చూడాలని అనుకుంటుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu September 4th Episode: ఏంజెల్‌ను తన ఇంటికి పిలుస్తుంది వసుధార. రిషికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఒంటరిగా ఉండటానికే రిషి ఇష్టపడుతున్నావని ఆమెను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ రిషి ఒంటరిగా ఎందుకు బతకాలని అనుకుంటునాడనేదానికి కారణం తెలియడం లేదని వసుధారతో అంటుంది ఏంజెల్. ఆ కారణం నేనే అని, రిషి మనసులో తానే ఉన్నానని మనసులో అనుకుంటుంది వసుధార.రిషితో ఉంటే లైఫ్ కంఫర్ట్‌గా ఉంటుందనే రిషిని భర్తగా సెలెక్ట్ చేసుకున్నానని వసుధారతో చెబుతుంది ఏంజెల్.
ఏంజెల్‌కు వసుధార ప్రశ్నలు...
ఏంజెల్‌మాటలతో రిషిని నువ్వు ప్రేమిస్తున్నావా అని ఆమెను అడుగుతుంది వసుధార. రిషిని తాను ప్రేమించడం లేదని బదులిస్తుంది ఏంజెల్. రిషి తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని అంటుంది. పెళ్లికి ప్రేమ అడ్డురాదని చెబుతుంది. రిషి నిన్ను పెళ్లి చేసుకోకపోతే డిజపాయింట్ అవుతావా అని అనుమానంగా ఏంజెల్‌ను అడుగుతుంది వసుధార.
వందశాతం డిజపాయింట్ అవుతానని, బెస్ట్ ఫ్రెండ్‌తో లైఫ్ కంపెర్ట్‌గా ఉంటుందని కలలు కన్నానని, కానీ ఆ కోరిక తీరకపోతే నిరుత్సాహం కాక మరేమిటి ఉంటుందని సమాధానమిస్తుంది. ఈ సమస్య కొలిక్కి రావడం కష్టమని తెలపడంతో రిషిపై అసహనం వ్యక్తం చేస్తుంది వసుధార. ఏంజెల్ సమస్యను పరిష్కరించే బాధ్యతను తనపై ఎందుకు వేశారని అతడిపై ఫీల్ అవుతుంది. తనను తప్ప రిషి ఎవరిని బాధపెట్టలేడని, అదినాపై ప్రేమతోనేనని అంటూ తనకు తాను సర్ధిచెప్పుకుంటుంది.
రిషి ప్లస్‌లు...
రిషిని పెళ్లిచేసుకోవాలనే ఏంజెల్ ఆలోచనను ఎలాగైనా ఆమె మనసు నుంచి తొలగించాలని వసుధార నిర్ణయించుకుంటుంది. రిషి నీకు కరెక్ట్ కాదని ఏంజెల్‌తో అంటుంది. ఎవరికి కరెక్ట్ మరి నీకా అంటూ ఏంజెల్ బదులివ్వడంతో వసుధార షాక్ అవుతుంది. ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బందిపడుతుంది.
ఆ తర్వాత రిషిలోని ప్లస్‌లు, మైనస్‌లతో ఓ ఛార్ట్ వేస్తుంది వసుధార. రిషిలోని ప్లస్‌ల కంటే మైనస్‌లను ఎక్కువగా రాసి ఏంజెల్ మనసు మళ్లించాలని చూస్తుంది వసుధార. వాటి ఆధారంగా రిషిని పెళ్లిచేసుకోవాలా? లేదా? అన్నది నిర్ణయించుకోమని ఏంజెల్‌కు చెబుతుంది.
పెయింటింగ్ దాచిన రిషి....
తాను వేసిన వసుధార కళ్ల తాలూకు పెయింటింగ్ చూసి గతాన్ని గుర్తుచేసుకుంటాడు రిషి. సడెన్‌గా అప్పుడే అతడి రూమ్‌లోకి ఏంజెల్ వస్తుంది. ఆమె రావడంతో ఆ పెయింటింగ్‌ను దాచేస్తాడు రిషి. తలగడ కింద ఆ పెయింటింగ్‌ను రిషి దాచిపెట్టడం ఏంజెల్ కనిపెడుతుంది. ఈ రోజు ఇంటికి ఓ గెస్ట్ వస్తున్నారని, అతడికి ఆతిథ్యం ఇవ్వడానికి నువ్వు ఇంట్లోనే ఉండాలని రిషిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంజెల్.
కానీ తనకు అర్జెంట్ పని ఉందని, బయటకు వెళ్తున్నానని, కుదరదని అంటాడు రిషి. నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావని, కావాలనే తనను అవైడ్ చేస్తున్నావని రిషిపై సీరియస్ అవుతుంది ఏంజెల్. ఆమె బాధను చూడలేక చివరకు రిషి ఒప్పుకుంటాడు. ఆ గెస్ట్ వసుధారేనని రిషి అనుమానపడతాడు. అప్పుడే వసుధార లోపలికి ఎంట్రీ ఇస్తుంది. ఆమెను అక్కడ చూసి రిషి షాకవుతాడు. నేను చెప్పిన గెస్ట్ వసుధారనేనని రిషితో అంటుంది ఏంజెల్. వసుధార రావడంతో రిషి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తాడు.
ఇరుక్కుపోయిన వసుధార...
ఆ తర్వాత నీ ప్లస్‌లు, మైనస్‌లను తెలియజేస్తూ వసుధార ఓ ఛార్ట్‌ను ప్రిపేర్ చేసిందని, అది నీకు చూపించడానికే వసుధారను ఇక్కడికి గెస్ట్‌గా పిలిపించానని రిషితో అంటుంది ఏంజెల్. రిషి ముందు ఏంజెల్ తనను ఇరికించడంతో వసుధార ఇబ్బందిపడుతుంది. వసుధార రాసిన ప్లస్‌లు, మైనస్‌లను రిషి చదువుతాడు. పాజిటివ్స్ కంటే నెగెటివ్స్ లిస్ట్ పెంచడంతో రిషి కోప్పాడుతాడు. ఏంజెల్‌ను మీ నుంచి దూరం చేయడానికే నాకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని నెగెటివ్ లిస్ట్ రాశానని రిషితో అంటుంది ఏంజెల్.
నాపై కోపాన్ని ప్రదర్శిస్తే ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనని అంటుంది. వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. వసుధారను పిలుస్తాడు రిషి. అతడి పిలుపుతో రిషి తనను అక్కడే ఉండిపొమ్మన్నాడని వసుధార ఆనందపడుతుంది. కిచెన్ వైపు వెళ్లబోతున్న వసుధారను వారించి గుమ్మం ఇటువైపు ఉందని సెటైర్ వేస్తాడు రిషి. ఏంజెల్‌కు చెప్పి వెళతానని వసుధార అంటుంది. కానీ నీ బదులు నేను చెబుతానని వెళ్లిపొమ్మని వసుధారతో అంటాడు రిషి.
రిషి మాటలతో వసుధార వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన ఏంజెల్ ఎందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నావని వసుధారను నిలదీస్తుంది. రిషి ఏదో ఒకటి అనడంతోనే వసుధార హర్ట్ అయి వెళ్లిపోతుందని గ్రహించిన ఏంజెల్...వసుధారకు సారీ చెప్పమని రిషితో అంటుంది. నా గురించి నాకే తెలియనన్నీ గొప్ప విషయాలు రాశారు. మీరు రాసినవి అన్ని నిజాలు అని చెప్పి వసుధారకు సారీ చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. వసుధార కూడా ఏంజెల్‌కు గుడ్‌బై చెప్పి వెళ్లిపోతుంది.
రిషి సీక్రెట్ కనిపెట్టిన ఏంజెల్...
రిషి లేని టైమ్‌లో అతడి రూమ్‌లోకి వస్తుంది ఏంజెల్. తలగడ కింద అతడు దాచిన పెయింటింగ్‌ను చూస్తుంది. కానీ ఆ కళ్లు ఎవరితో ఏంజెల్ గుర్తుపట్టలేకపోతుంది. ఆ పెయింటింగ్‌ను ఫోన్‌లో ఫొటో తీసుకుంటుంది. రిషి రూమ్ నుంచి బయటకు వస్తోన్న ఏంజెల్‌కు అతడు ఎదురుపడతాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మరోసారి పెళ్లి టాపిక్ వస్తుంది.
నా జీవితంలో ప్రేమ, పెళ్లి బంధాలకు ఎప్పుడో ముగింపు పలికానని అంటాడు రిషి. నీ మనసులో ఎవరైనా అమ్మాయి ఉంటే తనతో చెప్పమని రిషిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంజెల్. కానీ వాటికి నా దగ్గర సమాధానాలు లేవని ఏంజెల్‌కు బదులిస్తాడు రిషి. ఇకపై నా విషయంలో ఎక్కువగా చొరవ తీసుకోవద్దని, నా విషయంలో నువ్వు కోరుకున్నది ఎప్పటికీ నిజం కాదని అంటాడు. రిషి వేసిన పెయింటింగ్ ద్వారా అతడు ప్రేమించింది ఎవరినో తెలుసుకోవాలని ఏంజెల్ ఫిక్స్ అవుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.