Guppedantha Manasu June 21st Episode: వసుధార తండ్రిని అవమానించిన రిషి - జగతికి శైలేంద్ర క్షమాపణలు
21 June 2023, 7:35 IST
Guppedantha Manasu June 21st Episode: రిషిని కలిసి అతడికి జరిగిన సంఘటనలను వివరించాలని వసుధార తండ్రి చక్రపాణి అనుకుంటాడు. కానీ రిషి మాత్రం అతడి మాటలు వినకుండా అవమానిస్తాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu June 21st Episode: రిషి ప్రాణాలతో లేడని, తానే అతడిని చంపేసినట్లు తల్లి దేవయానితో నిజం చెబుతాడు శైలేంద్ర. కొడుకు మాటలతో దేవయాని షాక్ అవుతుంది. తానే రౌడీలతో రిషిని చంపించానని అంటాడు శైలేంద్ర. అప్పటివరకు శైలేంద్రను సమర్థిస్తూ వచ్చిన దేవయానికి కొడుకు చేసిన పనితో కోపం పెరిగిపోతుంది. ఇంత పెద్ద తప్పు చేసి తనతో ఇన్నాళ్లు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదని శైలేంద్రపై ఫైర్ అవుతాడు.
కానీ తల్లి మాటలను శైలేంద్ర లక్ష్యపెట్టడు. నువ్వు బాధపడ్డా, నా మీద కోప్పడినా రిషి తిరిగి రాడని అంటాడు. తనకు కావాల్సింది ఎండీ సీట్ అని, రిషిని సీట్ నుంచి దింపేలా చేసినా జగతి మాత్రం ఎండీ సీట్‌ను తనకు ఇవ్వకుండా మొండిపట్టు పడుతోందని అంటాడు. రిషి ప్రాణాలతో ఉంటే ఏ రోజుకైనా తిరిగివస్తాడని అందుకే వాడిని గాలిలో కలిపివేశానని అంటాడు.
కొడుకును కన్వీన్స్ చేసిన దేవయాని...
రిషిని రౌడీలు చంపేసిన విషయం ఇంట్లో అందరితో చెబుతానని అంటాడు శైలేంద్ర. అతడి మాటలతో దేవయాని భయపడిపోతుంది. ఈ నిజం తెలిస్తే ఇంట్లోని వారు చూస్తూ ఊరుకోరు అని, అది మనకే రిస్క్ అని శైలేంద్రతో అంటుంది. రిషి లేడనే నిజం తెలిసిన మరుక్షణం మన చేసిన కుట్రల గురించి జగతి అందరికి చెబుతుందని, రిషి చనిపోయిన విషయం తెలిస్తే జగతి బారి నుంచి మనల్ని ఎవరూ కాపాడలేరని భయపపడుతుంది. ఈ ఒక్కసారి తానుచెప్పినట్లు నడుచుకోమని కొడుకును బతిమిలాడుతుంది దేవయాని. నిన్ను ఎలాగైనా ఎండీసీట్‌లో కూర్చోబెడతానని, ఆవేశపడి అందరితో ఈ నిజం చెప్పద్దని అంటుంది. తల్లి మాటలతో శైలేంద్ర ఆలోచనలో పడతాడు.
రిషిని కలిసిన చక్రపాణి...
వసుధారతో కలిసి కాలేజీకి వెళ్లాలని చక్రపాణి నిర్ణయించుకుంటాడు. రిషిని కలిసి మాట్లాడాలని అనుకుంటాడు. రిషిని కలవబోతున్న విషయం వసుధార దగ్గర దాస్తాడు. కూతురితో కలిసి కాలేజీకి వస్తాడు చక్రపాణి. వసుధార కాలేజీ లోపలికి వెళ్లిపోగానే రిషిని కలుస్తాడు. రిషిని కలవడానికి తండ్రి ప్రయత్నిస్తోన్న విషయం వసుధార కనిపెడుతుంది.
రిషి ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతుంది. వసుధార ఊహించినట్లుగానే చక్రపాణిని చూడగానే రిషి సీరియస్ అవుతాడు. రాయబారానికి వచ్చారా? మీరే వచ్చారా? ఎవరైనా పంపించారా? అంటూ అతడిపై కోపగించుకుంటాడు. వసుధార తండ్రిగా నాకు మాట్లాడే సమయం ఇవ్వరా? నేనైతే ఏ తప్పు చేయలేదని రిషితో అంటాడు చక్రపాణి. తప్పు ఒప్పులతో పని లేకుండా తాను గతాన్ని ఎప్పుడో వదిలిపెట్టానని, ఇప్పుడు తానో కామన్‌మ్యాన్‌నని, వసుధారతో తనకు ఎలాంటి సంబంధం లేదని చక్రపాణితో అంటాడు రిషి.
చక్రపాణికి అవమానం...
మరోసారి తనను కలవడానికి, మాట్లాడటానికి ప్రయత్నించవద్దని చక్రపాణితో చెబుతాడు రిషి. అతడి మాటలకు చక్రపాణి ఎమోషన్ అవుతాడు. చాటునుంచి తండ్రితో రిషి మాట్లాడిన మాటలు వింటుంది వసుధార. చక్రపాణి వెళ్లిపోగానే... తప్పు చేసింది తాను అయితే తన తండ్రి ఏం చేశాడని రిషిని నిలదీస్తుంది. నీకు తండ్రి కావడమే అంటూ కఠువుగా వసుధారకు సమాధానమిస్తాడు రిషి.
అతడి మాటలతో వసుధార ఉద్వేగానికి లోనవుతుంది. నాలాంటి కూతురికి తండ్రి కావడం ఆయన చేసిన తప్పే. కూతురికి వచ్చిన కష్టాన్ని కడుపులో దాచుకోలేక మీ దగ్గరకు ఇలా రావడమే ఆయన చేసిన తప్పు. మిమ్మల్ని ప్రాధేయపడటమే ఆ పిచ్చి తండ్రి చేసిన తప్పు. ఆశగా మీ దగ్గరకు వచ్చిన తండ్రికి కన్నీళ్లు కానుకగా ఇచ్చి పంపించారని రిషితో అంటుంది.
వసుకు రిషి క్లాస్...
వసుధార ఎమోషనల్ డైలాగ్స్‌కు రిషి కరిగిపోడు. ఒక్కసారి మీ నాన్న బాధను చూసి చలించిపోయావే...మరి ఇన్నాళ్లు నేను అనుభవించిన బాధ ఎవరికి తెలుసు. నా ఆవేదన విలువ ఎంత. అన్ని ఆ భగవంతుడికే తెలియాలి అంటూ వసుధారతో చెప్పిన రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రిషి మాటలతో చక్రపాణి చాలా ఆవేదనకు లోనవుతాడు. వసుధార కూడా రిషి మాటలతో చాలా కలత చెందుతుంది.
వసుధార ఆలోచనలతో...
కాలేజీ ముగిసిన తర్వాత గ్రౌండ్‌లో కూర్చొన్న రిషి వసుధార ఆలోచనల్లో మునిగిపోతాడు. గతం గుర్తుచేయవద్దని ఎంత చెప్పిన వసుధార ఎందుకు తనను వేధిస్తున్నాన్నదని మనసులో అనుకుంటాడు. ఎవరి కోసం ఇదంతా చేస్తుందని తనలో తానే మదనపడతాడు. కన్నీళ్లు కనిపిస్తే బాధ తెలుస్తుందని, కానీ గుండెల్లో భారం ఎవరికి అర్థం కాదు. అది అనుభవించేవాడికి తెలుస్తుందని అనుకుంటాడు. మరోవైపు వసుధార కూడా రిషి గురించే ఆలోచిస్తుంటుంది. రిషి తనను ఎంత తప్పు పట్టిన భరిస్తూ , సహిస్తున్నానని, అయినా తన మనసులోని భారాన్ని అతడు గుర్తించడం లేదని బాధపడుతుంది. ఇద్దరు కొద్ది దూరంలోనే కూర్చున్నా ఒకరితో మరొకరు మాట్లాడరు.
ఏంజెల్ ఫోన్...
ఇంతలోనే రిషికి ఏంజెల్ ఫోన్ చేస్తుంది. కలిసి షాపింగ్‌కు వెళ్దామని అంటుంది. కానీ తనకు ఇంట్రెస్ట్ లేదని, రానని ఏంజెల్‌కు సమాధానం చెబుతాడు రిషి. జీవితాన్ని కోల్పోయిన వాడిలా ఎప్పుడూ ఎందుకు మూడీలా ఉంటావని ఏంజెల్ అంటుంది. ఇంట్లో విశ్వనాథం ఒక్కరే ఉన్నారని, ఆయన్ని పలకరించమని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
శైలేంద్ర క్షమాపణలు...
ఆ తర్వాత ఫణీంద్రతో కాలేజీ గురించి జగతి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడకు వచ్చిన శైలేంద్ర... జగతిని క్షమాపణలు కోరుతాడు.రిషి గురించి తప్పుగా మాట్లాడానని అంటాడు. మహేంద్రకు కూడా సారీ చెబుతాడు. రిషి గురించి అలా అనడం నా తప్పు అని మహేంద్రతో అంటాడు. దేవయానికి కూడా కొడుకు బుద్ధి చెప్పినట్లు కొత్త నాటకానికి తెరతీస్తుంది.
రిషి తిరిగి రావాలి. అతడు క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు అందరితో చెబుతాడు శైలేంద్ర. అతడి యాక్టింగ్ చూసి భర్త మరో కొత్త ఎత్తు ఏదో వేయబోతున్నాడని ధరణి ఊహిస్తుంది. ఆ తర్వాత రిషి గౌరవాన్ని కాపాడాలంటే అతడు చేపట్టిన మిషన్ ఎడ్యుకేషన్ పోగ్రామ్‌ను కలిసి ముందుకు తీసుకెళ్దామని మహేంద్రతో అంటాడు ఫణీంద్ర.
ఇంతలోనే ఈ ప్రాజెక్ట్‌లో తనను ఇన్‌వాల్వ్ చేస్తే రిషి ప్లేస్‌ను రీప్లేస్ చేస్తానని శైలేంద్ర అంటాడు. అతడి మాటలతో జగతి ఫైర్ అవుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది.