Guppedantha Manasu July 5th Episode: రిషి, వసుధారల బంధంపై ఏంజెల్‌కు డౌట్ - దేవయాని నాటకాన్ని బయటపెట్టిన ధరణి
05 July 2023, 7:38 IST
Guppedantha Manasu July 5th Episode: రిషి, వసుధారల బంధంపై ఏంజెల్‌కు డౌట్ మొదలవుతుంది. వారిద్దరి మధ్య ఏదో ఫ్లాష్‌బ్యాక్ ఉందని అనుకుంటుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu July 5th Episode: తాను ఏ తప్పు చేయలేదని వసుధార ఎంత నచ్చజెప్పాలని చూసినా ఆమె మాటలను రిషి నమ్మడు. మాటలతో తనను ఏమార్చలేవని వసుధారపై ఫైర్ అవుతాడు. ఏంజెల్ ఇంట్లో తాను ఉండటం వల్ల రిషి ఇబ్బంది పడుతున్నాడని వసుధార గ్రహిస్తుంది. యాక్సిడెంట్ కారణంగా అయినా గాయాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో వసుధార కాలేజీకి బయలుదేరుతుంది. కాలేజీ నుంచి నేరుగా తమ ఇంటికి వెళ్లిపోతానని అంటుంది. కానీ ఏంజెల్ ఆమెను వారిస్తుంది. గాయం పూర్తిగా తగ్గే వరకు కాలేజీకి వెళ్లాల్సిన పనిలేదని పట్టుపడుతుంది.
ఏంజెల్ కోరిక...
మీ ఇంట్లోను నిన్ను చూసుకోవడానికి ఎవరు లేరని, ఇక్కడే ఉండమని వసుధారను బతిమిలాడుతుంది ఏంజెల్. కానీ వసుధార మాత్రం వెళ్లడానికే సిద్ధపడుతుంది. వసుధారను ఉండిపొమ్మని చెప్పమని రిషితో అంటుంది ఏంజెల్. దాంతో రిషి కూడా బాగాలేనప్పుడు కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదని అంటాడు. అప్పుడే అక్కడకు వచ్చిన విశ్వనాథం వసుధార ధైర్యవంతురాలని ప్రశంసలు కురిపిస్తాడు.
పూర్తిగా బాగయ్యేంతవరకు ఇక్కడే ఉండాలని, నేను, రిషి పర్మిషన్ ఇచ్చిన రోజే ఇంట్లో నుంచి వెళ్లాలని విశ్వనాథ్ అంటాడు. తాను కూడా వసుధారకు అదే చెప్పానని రిషి అంటాడు. తనపై ప్రేమతో రిషి ఆ మాట అన్నాడా? జాలితో చెప్పాడా? అని వసుధార ఆలోచిస్తుంది. కానీ ఆమె ఆలోచనల్ని కనిపెట్టిన రిషి ఇదే జాలి అని చెబుతాడు. కష్టాల్లో ఉన్న మనిషిపై జాలి చూపించాలి. శత్రువైన సరే ఆపదలో ఉంటే ఆదుకోవాలని అంటాడు.
శైలేంద్ర ప్లాన్ సక్సెస్...
రిషి లేకపోయినా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి జగతి, మహేంద్ర, ఫణీంద్ర కష్టపడుతోంటారు. ఆ పనులతో ముగ్గురు బిజీగా ఉన్న సమయంలో అక్కడకు శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు. సింపథీ డ్రామా ప్లే చేసి ముగ్గురిని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లాలని ఫిక్స్ అవుతాడు. ముగ్గురిని ఇంటికి రమ్మని కోరుతాడు శైలేంద్ర.
అమ్మ మీ అందరి కోసం చాలా ఆరాటపడుతోందని, మహేంద్ర, జగతిలను తీసుకొస్తానని చెప్పిన మీరు కూడా తిరిగి రాకపోవడంతో మమ్మీ బాధపడుతోందని తండ్రితో ఎమోషనల్ డ్రామా మొదలుపెడతాడు. ఒకవేళ మీ ముగ్గురు ఇంటికి రాకపోతే మమ్మీనే ఇక్కడకు వస్తానని అంటోంది బాధపడినట్లుగా నటిస్తాడు. కొడుకు నాటకాల్ని కనిపెట్టలేని ఫణీంద్ర అతడి మాటలకు కన్వీన్స్ అవుతాడు. తిరిగి ఇంటికి వెళ్లిపోదాం అంటూ మహేంద్ర, జగతిలతో అంటాడు.
ఇక్కడే ఉంటే శైలేంద్రకు అనుమానం వస్తుందని జగతి అర్థం చేసుకుంటుంది. గెస్ట్ హౌజ్ నుంచి ఇంటికి వెళ్లిపోదామని మహేంద్రను కోరుతుంది. అతడు సరే అంటాడు. తన ప్లాన్ వర్కవుట్ కావడంతో శైలేంద్ర ఆనందపడతాడు. వాళ్లు ఏ పనిచేసినా తాను ఇలాగే చెడగొడతానని, జగతి ఒడిపోయి తాను గెలవడం ఖాయమని, జరిగేది ఇదే అని మనసులో అనుకుంటాడు.
రిషి హడావిడి...
రిషి హాల్‌లోకి రాగానే అక్కడ ట్యాబ్లెట్స్ డబ్బా కనిపిస్తుంది. వసుధార ట్యాబ్లెట్స్ వేసుకుందో లేదో అని ఆలోచిస్తాడు. ఏంజెల్‌ను అడుగుతాడు. కానీ ఆమె పనిలో బిజీగా ఉండి రిషి మాటలను వినదు. ఇంతలోనే ట్యాబ్లెట్ బాక్స్ తీసుకోవడానికి వసుధార వస్తుంది. కానీ పట్టుతప్పి కిందపడబోతుంది. రిషి ఆమెకు చేయి అందించబోతాడు. అది చూసి వసుధార షాక్ అవుతుంది. ఆ తర్వాత ట్యాబ్లెట్ బాక్స్ వసుధార రూమ్‌లో లేకుండా ఇక్కడ ఎందుకుందని రిషి హడావిడి చేస్తాడు.
ఏంజెల్ డౌట్...
వసుధార ఇంట్లోకి వచ్చి చాలా రోజులైనా రిషి, వసుధార ఒకరితో మరొకరు మాట్లాడుకోకపోవడంతో ఏంజెల్‌కు డౌట్ వస్తుంది. అదే విషయాన్ని స్ట్రెయిట్‌గా రిషిని అడుగుతుంది. ఇద్దరి మధ్య ఏదైనా ఫ్లాష్‌బ్యాక్ ఉందా అని అడుగుతుంది. ఆమె మాటలకు ఇద్దరు షాక్ అవుతుంది. మీ వాలకం చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో ఉందనిపిస్తుందని ఏంజెల్ అంటుంది. రిషి ఏం మాట్లాడకపోవడంతో వసుధారను సమాధానం చెప్పమని అంటుంది ఏంజెల్.
రిషి కంగారు...
వసుధార ఎక్కడ గతం బయటపెడుతుందో అని కంగారుపడతాడు రిషి. వసుధారతో తనకు ప్రాబ్లెమ్స్ వచ్చేంత పరిచయం లేదని అంటాడు. ఇంకా ఫ్లాష్‌బ్యాక్ ఎక్కడుంటుందని ఏంజెల్‌తో అంటాడు. కాలేజీకి వెళుతూ మధ్యాహ్నం కూడా వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఉన్నాయి. జాగ్రత్త ఏంజెల్ అని ఇన్‌డైరెక్ట్‌గా వసుధారతో చెప్పి వెళతాడు రిషి. అతడి ప్రేమ చూసి వసుధార ఎమోషన్ అవుతుంది మీ మనసులో నేను లేను అంటూ నీ మీద ఇంత కేర్ తీసుకుంటున్నారని మనసులోనే పొంగిపోతుంది.
దేవయాని భయం...
శైలేంద్ర చేసిన కుట్రలు బయటపడితే తమ భవిష్యత్తు ఏమవుతుందో అని దేవయాని టెన్షన్ పడుతుంటుంది. దేవయాని టెన్షన్‌ను గమనించిన ధరణి ఆమెపై సెటైర్స్ వేస్తుంది. ఇంతలోనే జగతి, మహేంద్ర, ఫణీంద్ర తిరిగి ఇంటికి వస్తారు. మీరు తిరిగిరావడం చాలా సంతోషంగా ఉందని, మీరు వెళ్లిపోయిన తర్వాత తన మనసు నిలకడగా లేదని, నిద్రకూడా పోలేదని నాటకం ఆడుతుంది. పక్కనే ఉన్న ధరణి రాత్రి పప్పు చారు అన్నం తిని హాయిగా నిద్రపోయారు కదా అని ఆమె నాటకాన్ని బయటపెడుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.