తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu July 29th Episode: జ‌గ‌తి బెదిరింపుల‌కు శైలేంద్ర హ‌డ‌ల్ - రిషి, వ‌సుధార గ‌తం రివీల్ కానుందా?

Guppedantha Manasu July 29th Episode: జ‌గ‌తి బెదిరింపుల‌కు శైలేంద్ర హ‌డ‌ల్ - రిషి, వ‌సుధార గ‌తం రివీల్ కానుందా?

HT Telugu Desk HT Telugu

29 July 2023, 7:11 IST

google News
  • Guppedantha Manasu July 29th Episode: జ‌గ‌తిపై ఉన్న కోపాన్ని ధ‌ర‌ణిపై చూపిస్తాడు శైలేంద్ర‌. అత‌డికి జ‌గ‌తి గ‌ట్టి వార్నింగ్ ఇస్తుంది. నీ పెత్త‌నాలు ఇక‌పై చెల్లుబాటు కావ‌ని హెచ్చ‌రిస్తుంది. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu July 29th Episode: రిషి, వ‌సుధార ఎక్క‌డున్నారో తెలిసినా వారిని ఏం చేయ‌లేక‌పోతాడు శైలేంద్ర‌. వారి గుట్టును బ‌య‌ట‌పెట్టాల‌ని అత‌డు చేసిన ప్ర‌య‌త్నాలు వ‌రుస‌గా విఫలం అవుతుండ‌టం స‌హించ‌లేక‌పోతాడు. మ‌రోవైపు జ‌గ‌తి, మ‌హేంద్ర‌ల‌కు పూర్తిగా భ‌యం లేకుండా పోయింద‌ని, వారి ధైర్యాన్ని ఎలాగైనా చంపేయాల‌ని నిశ్చ‌యించుకుంటాడు. కోపంతో ర‌గిలిపోతున్న‌ అత‌డి వ‌ద్ద‌కు ధ‌ర‌ణి వ‌చ్చి కాఫీ ఇస్తుంది. ఆ కాఫీ క‌ప్‌ను విసిరికొడ‌తాడు శైలేంద్ర‌. అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన జ‌గ‌తి...ధ‌ర‌ణికి స‌పోర్ట్ చేస్తూ శైలేంద్ర‌కు క్లాస్ ఇస్తుంది.

జ‌గ‌తి ఫైర్‌...

నీ కోపాన్ని ధ‌ర‌ణిపై చూపించ‌డంలో అర్థం లేద‌ని, నీ ఇష్టం ప్ర‌కారం చేయ‌డానికి ఆడ‌ది ఆట‌వ‌స్తువు కాద‌ని శైలేంద్ర‌పై ఫైర్ అవుతుందిజ‌గ‌తి. నా భార్య‌ను కొడ‌తాను. తిడ‌తాను నా ఇష్టం, మీరు న‌న్ను ఏం చేయ‌లేర‌ని జ‌గ‌తికి ఎదురుతిరుగుతాడు శైలేంద్ర‌. నువ్వు భ‌ర్త అన్న ఒకే ఒక్క కార‌ణంగా ఎన్ని త‌ప్పులు చేసినా ఎన్ని మాట‌లు అన్న ధ‌ర‌ణి ప‌డుతుంది. భ‌రిస్తుంది. దానిని అలుసుగా తీసుకొని అధికారం చూపించ‌కు. ధ‌ర‌ణి నీకు ఎదురుతిర‌గ‌డానికి ఒక్క క్ష‌ణం చాలు. అప్పుడు పోయేది నీ ప‌రువే అని శైలేంద్ర‌కు వార్నింగ్ ఇస్తుంది జ‌గ‌తి.

ఒక ఆడ‌పిల్ల స‌హ‌నంగా ఉన్నంత‌వ‌ర‌కే నీ ఆట‌లు సాగుతాయి. నీ పెత్త‌నాలు చెల్లుబాటు ఆవుతాయి. త‌ను ఒక్క‌సారి తెగిస్తే ఎదురునిల‌బ‌డ‌లేవ‌ని శైలేంద్ర‌ను గ‌ట్టిగా హెచ్చ‌రిస్తుంది. తాను అనుకున్న‌ది జ‌రిగి తీరుతుంద‌ని జ‌గ‌తికే రివ‌ర్స్ వార్నింగ్ ఇవ్వ‌డానికి శైలేంద్ర ప్ర‌య‌త్నిస్తాడు. కానీ అది నీ భ్ర‌మ, అత్యాశ‌కు పోవ‌డం నీకే మంచిది కాద‌ని శైలేంద్ర‌ను మంద‌లిస్తుంది జ‌గ‌తి.

త‌న‌ది అత్యాశ‌కాద‌ని, త‌న స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని జ‌గ‌తితో అంటాడు శైలేంద్ర‌. నువ్వేం చేస్తావో, చేయాల‌ని అనుకుంటున్నావో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అవ‌న్నీ మీ నాన్న‌గారికి తెలిసేదాకా తీసుకువెళ్ల‌కు. అది నీకే స‌మ‌స్య అవుతుంది. మేము ఇంకా నీకు భ‌య‌ప‌డేది ఏది లేదు. నాకు ఈ ధైర్యం ఎక్క‌డ‌నుంచి వ‌చ్చిందో నీకు తెలుసు. మాతో, ఇంట్లో వాళ్ల‌తో బుద్ధిగా ఉండు. కాలేజీ విష‌యాల్లో క‌లుగ‌జేసుకోకు అని మ‌రోసారి శైలేంద్ర‌కు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జ‌గ‌తి.

ధ‌ర‌ణి భ‌యం....

శైలేంద్ర‌కు ఎదురుతిరిగిన జ‌గ‌తి ధైర్యాన్ని చూసి ధ‌ర‌ణి భ‌య‌ప‌డుతుంది. శైలేంద్ర ఇంకా ఎన్ని ఆటంకాలు సృష్టిస్తాడో అని కంగారుప‌డుతుంది. ధ‌ర‌ణికి జ‌గ‌తి ధైర్యం చెబుతుంది. ఫ‌ణీంద్ర‌కు శైలేంద్ర‌ భ‌య‌ప‌డ‌తాడు కాబ‌ట్టి అత‌డినే త‌మ ఆయుధంగా వాడుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు ధ‌ర‌ణితో అంటుంది జ‌గ‌తి.

శైలేంద్ర‌, దేవ‌యాని బ‌ల‌హీన‌తే మ‌న‌కు బ‌లం, భ‌య‌ప‌డి రిషిని దూరం చేస్తుకున్న‌ పాఠం నాది. ఆ ధైర్యంతోనే వారి ఢీకొట్ట‌బోత‌న్న‌ట్లు ధ‌ర‌ణితో చెబుతుంది జ‌గ‌తి. రిషిని ఇంటికి తిరిగి ర‌ప్పించ‌డానికే ఈ పోరాటమ‌ని, త్వ‌ర‌లోనే అత‌డు తిరిగి వ‌స్తాడ‌నే న‌మ్మ‌కం ఉంద‌ని, అతడే అన్నింటికి స‌మాధానం చెబుతాడ‌ని జ‌గ‌తి అంటుంది. రిషి వ‌చ్చి ఈ త‌ల్లి క‌న్నీళ్ల‌ను తుడుస్తాడ‌ని ఆశ‌ప‌డుతుంది

ఏంజెల్ డౌట్‌...

వ‌సుధార ఇంటి నుంచి రిషి, ఏంజెల్ తిరిగి బ‌య‌లుదేరుతారు. ఆ స‌మ‌యంలో నీకు, వ‌సుధార‌కు మ‌ధ్య ఏదైనా గ‌తం ఉందా అని రిషిని అడుగుతుంది ఏంజెల్‌. ఇంత‌కుముందు మీ మ‌ధ్య ఏదో జ‌ర‌గ‌రానిది జ‌రిగిందా? అది శ‌త్రుత్వ‌మా? ప్రేమా? అని ప్ర‌శ్నిస్తుంది. మాట‌లు లేవు కానీ మీ మ‌ధ్య‌భ‌గ్న ప్రేమికుల మ‌ధ్య ఉండే ఎమోష‌న్ క‌నిపిస్తుంద‌ని రిషితో అంటుంది ఏంజెల్‌.

కానీ రిషి మాత్రం స‌మాధానం చెప్ప‌డు. స్నేహితుల‌కు కూడా చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. వాటిని వ్య‌క్తిగ‌తం అని అంటార‌ని నిజాల్ని చెప్ప‌కుండా దాచేస్తాడు. నా గ‌తంలో ఎవ‌రు ఉన్నారు? ఎవ‌రు లేరు? అన్న‌ది నీకు అన‌వ‌స‌రం అని క్లాస్ ఇస్తాడు. నువ్వు ఎప్ప‌టికీ నా బెస్ట్ ఫ్రెండ్‌వి. అంత మాత్రానా న‌న్ను వ్య‌క్తిగ‌త విషయాలు అడ‌గ‌డం క‌రెక్ట్ కాద‌ని క్లాస్ ఇస్తాడు.

వ‌సుధార‌ను కూడా ఇదే ప్ర‌శ్న అడిగావా అని ఏంజెల్‌తో అంటాడు రిషి. అడ‌గ‌లేద‌ని బ‌దులిస్తుంది ఏంజెల్. అడుగుదామ‌ని అనుకున్నాన‌ని, కానీ వ‌సుధార ఫీల‌వుతుంద‌ని ఆగిపోయాన‌ని అంటుంది. ఇక‌పై కూడా ఆడ‌గ‌కు. వ‌సుధార చాలా సెన్సిటివ్ అని ఏంజెల్‌కు స‌ల‌హా ఇస్తాడు. రిషి స‌మాధానంపై ఏంజెల్ అనుమానం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. వారిద్ధ‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని, ఆ సీక్రెట్ ఏమిటో తెలుసుకోవాల‌ని ఫిక్స్ అవుతాడు.

వ‌సుధార‌కు ఫోన్‌...

మిష‌న్ ఎడ్యుకేష‌న్ ప్రాజెక్ట్ బాధ్య‌త‌ల్ని తిరిగి స్వీక‌రించ‌డానికి రిషి ఒప్పుకుంటాడో? లేదో? అని జ‌గ‌తి మ‌ద‌న‌ప‌డుతుంటుంది. ఈ ప్రాజెక్ట్‌ను రిషికి అప్ప‌గిస్తోన్న విష‌యం శైలేంద్ర‌కు తెలిస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయో అని కంగారు ప‌డుతుంది. ఇదే విష‌యాన్ని భ‌ర్త‌తో చెబుతుంటుంది. జ‌గ‌తి, మ‌హేంద్ర మాట‌ల్ని చాటునుంచి శైలేంద్ర వింటుంటాడు.

వ‌సుధార‌కు ఫోన్ చేసి రిషి మిష‌న్ ఎడ్యుకేష‌న్‌ను అంగీక‌రించాడా? లేదా? అని అడ‌గాల‌ని అనుకుంటాడు మ‌హేంద్ర‌. కానీ ప‌దే ప‌దే ఫోన్ చేసి వ‌సుధార‌ను ఇబ్బంది పెట్ట‌డం స‌రికాదంటూ జ‌గ‌తి స‌ల‌హా ఇస్తుంది. వ‌సుధార‌కు కాకుండా విశ్వ‌నాథానికి ఫోన్ చేయ‌బోతాడు జ‌గ‌తి. అత‌డికి కూడా ఫోన్ చేయ‌వ‌ద్ద‌ని అంటుంది జ‌గ‌తి. మ‌నం రిషి కోసం మిష‌న్ ఎడ్యుకేష‌న్‌ను ఎర‌గా వేస్తున్నామ‌ని అనుమాన‌ప‌డ‌తాడ‌ని, అదే జ‌రిగితే రిషి ఎప్ప‌టికీ మిష‌న్ ఎడ్యుకేష‌న్‌ను ఒప్పుకోడ‌ని అంటుంది.

శైలేంద్ర కొత్త ఎత్తు...

ఎండీ సీట్‌ కోసం ఇంకా ఎదురుచూపులు ఉండ‌కూడ‌ద‌ని, ఏదో ఒక‌టి చేసి ప‌ద‌విని లాగేసుకోవాల‌ని శైలేంద్ర అనుకుంటాడు. ఇంత‌లోనే రిషి, వ‌సుధార‌ల‌ను క‌నిపెట్ట‌మ‌ని శైలేంద్ర నియ‌మించిన వ్య‌క్తి ఫోన్ చేస్తాడు. రిషి, వ‌సుధార గొడ‌వ గురించి శైలేంద్ర‌కు చెబుతాడు.

ఇద్ద‌రి మ‌ధ్య ఏదో అనుబంధం ఉంద‌ని కాలేజీ మొత్తం అనుకునేలా చేశాన‌ని అంటాడు. రిషి, వ‌సుధార‌ ర‌హ‌స్యాలు బ‌య‌ట‌ప‌డే స‌మ‌యం వ‌చ్చింద‌ని చెప్పిన శైలేంద్ర అత‌డికి వాళ్లిద్ధ‌రి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు పంపిస్తాడు. ఈ ఫొటో కాలేజీ మొత్తం క‌న‌ప‌డేలా గోడ‌ల‌కు అంటించ‌మ‌ని చెబుతాడు.

అనుకోకుండా అత‌డి మాట‌ల్ని జ‌గ‌తి వింటుంది. అత‌డి చేతిలో రిషి, వ‌సుధార ఎంగేజ్‌మెంట్ ఆల్బ‌మ్ క‌నిపించ‌డంతో షాక్ అవుతుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

తదుపరి వ్యాసం