తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu July 13th Episode: త‌ల్లిదండ్రుల చేతుల మీదుగా రిషికి స‌న్మానం - జ‌గ‌తిని అవ‌మానించిన వ‌సుధార‌

Guppedantha Manasu July 13th Episode: త‌ల్లిదండ్రుల చేతుల మీదుగా రిషికి స‌న్మానం - జ‌గ‌తిని అవ‌మానించిన వ‌సుధార‌

HT Telugu Desk HT Telugu

13 July 2023, 10:09 IST

google News
  • Guppedantha Manasu July 13th Episode: సెమినార్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన రిషి, వ‌సుధార‌ల‌ను జ‌గ‌తి, మ‌హేంద్ర త‌మ చేతుల‌తో స‌త్క‌రిస్తారు. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే...

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu July 13th Episode: కాలేజీలో రిషి నిర్వ‌హించ‌నున్న సెమినార్‌కు మ‌హేంద్ర‌, జ‌గ‌తి గెస్ట్‌లుగా వ‌స్తారు. త‌ల్లిదండ్రుల‌ను కాలేజీలో చూసి రిషి షాక‌వుతాడు. అదే స‌మ‌యంలో జ‌గ‌తి, మ‌హేంద్ర‌ల‌ను ఫాలో అవుతూ కాలేజీకి వ‌చ్చిన శైలేంద్రకు రిషి బ‌తికి ఉన్నాడ‌నే నిజం తెలుస్తుంది. త‌న‌ను మోస‌గాడిగా ముద్ర‌వేసిన జ‌గ‌తి ముందు మోటివేష‌న‌ల్ స్పీచ్ ఇవ్వాలా? వ‌ద్దా? అనే ఆలోచ‌నతో సెమినార్ హాల్‌లోకి వెళ్ల‌కుండా కాలేజీ వ‌రండాలోనే ఆగిపోతాడు రిషి.

ప్రిన్సిపాల్ కంగారు...

సెమినార్‌లో రిషి క‌నిపించ‌క‌పోవ‌డంతో ప్రిన్సిపాల్ కంగారు ప‌డ‌తారు. రిషిని ఎక్క‌డున్నాడో ఫోన్ చేసి తెలుసుకొమ్మ‌ని వ‌సుధార‌ను కోరుతాడు ప్రిన్సిపాల్‌. జ‌గ‌తి, మ‌హేంద్ర‌ త‌న ప‌క్క‌నే కూర్చోవ‌డంతో వారిపై ద్వేషంతో ఎందుకొచ్చార‌ని అడుగుతుంది వ‌సుధార‌.

ఇక్క‌డ రిషి సంతోషంగా ప్ర‌శాంతంగా ఉన్నాడు. అది మీకు న‌చ్చ‌లేదా? అంటూ మ‌హేంద్ర‌పై ఫైర్ అవుతుంది. జ‌గ‌తిని ఎందుకు తీసుకొచ్చార‌ని ప్ర‌శ్నిస్తుంది.. మీరు వ‌స్తున్నార‌ని తెలిస్తే రిషి ఈ సెమినార్‌ను నిర్వ‌హించేవారు కాద‌ని అంటుంది. . మ‌ధ్య‌లో జ‌గ‌తి మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంది. కానీ ఆమె మాట‌ల‌ను వ‌సుధార అడ్డుకుంటుంది. నేను మీతో మాట్లాడ‌ను అని బ‌దులిస్తుంది.

మ‌హేంద్ర ఎమోష‌న‌ల్‌...

వ‌సుధార మాట‌ల‌కు మ‌హేంద్ర హ‌ర్ట్ అవుతాడు. సెమినార్‌కు ఇన్విటేష‌న్‌ రావ‌డంతోనే తాము ఇక్క‌డ‌కు వ‌చ్చామ‌ని, కావాల‌ని ప్లాన్ చేసి రాలేద‌ని వ‌సుధారతో అంటాడు మ‌హేంద్ర‌. అబ‌ద్దాలు ఆడ‌కండి సార్ అని వ‌సుధార అత‌డితో అన‌గా...నువ్వు నేను మాట్లాడుకోవాలి అబ‌ద్దాల గురించి అంటూ వ‌సుధార‌ను దెప్పిపోడుస్తాడు.

సెమినార్ ప‌నుల‌తో రిషి త‌న బాధ‌ల‌న్నీ మ‌ర్చిపోతాడ‌ని, ఒక‌ప్ప‌టి పాత‌ రిషిని ముందు ముందు మ‌ళ్లీ చూడ‌బోతున్నాన‌ని సంతోష‌ప‌డ్డాన‌ని...కానీ మీరు ఇక్క‌డ‌కు వ‌చ్చి దానిని మొత్తం చెడ‌గొట్టార‌ని మ‌హేంద్ర‌పై ఫైర్ అవుతుంది వ‌సుధార‌. రిషి సెమినార్‌కు రాడు అని నీకు ఎవ‌రు చెప్పార‌ని, ఎందుకు డిస‌పాయింట్‌గా మాట్లాడుతున్నావ‌ని వ‌సుధార‌తో కోపంగా మ‌హేంద్ర‌. నేనే కాదు ఎవ‌రూ పిలిచినా రిషి సెమినార్‌కు రాడ‌ని వ‌సుధార గ‌ట్టిగా చెబుతుంది.

రిషి త‌న కొడుకు అని, అత‌డి మ‌న‌స్త‌త్వ‌మేమిటో త‌న‌కు తెలుసున‌ని, పంతాలు, ప‌ట్టింపుల కంటే బాధ్య‌త‌ల‌కే ఎక్కువ‌గా విలువ ఇస్తాడ‌ని, తాను వెళ్లి రిషిని పిలుచుకొస్తాన‌నిమ‌హేంద్ర లేస్తాడు. కానీ ఇంత‌లోనే రిషి సెమినార్ హాల్‌లోకి అడుగుపెతాడు. అత‌డిని చూడ‌గానే మ‌హేంద్ర ఎమోష‌న‌ల్ అవుతాడు. నువ్వు వ‌స్తావ‌నే న‌మ్మ‌కం నాకు ఉంద‌ని అంటాడు. వారి అనుబంధం చూసి విశ్వ‌నాథం అనుమాన‌ప‌డ‌తాడు. ఇద్ద‌రి మ‌ధ్య ముందే ప‌రిచ‌యం ఉందా అని అడుగుతాడు. వీరు నాకు ఆత్మీయులు...గురువుతో స‌మాన‌మ‌ని విశ్వ‌నాథంతో అంటాడు రిషి.

జ‌గ‌తి రిక్వెస్ట్‌...

రిషిపై విశ్వ‌నాథం ప్ర‌శంస‌లు కురిపిస్తాడు. త‌న కొడుకును ప్రేమించే అదృష్టం త‌న‌కు లేనందుకు జ‌గ‌తి బాధ‌పడుతుంది. ఆ త‌ర్వాత సెమినార్‌లో స్పీచ్ ఇవ్వ‌డానికి రిషి ఇష్ట‌ప‌డ‌డు. ఇప్పుడు త‌న‌కు మాట్లాడాల‌ని అనిపించ‌డం లేద‌ని అంటాడు. త‌న స్పీచ్‌ను మొత్తం రాసి ఇస్తాన‌ని అంటాడు.

అత‌డి మాట‌ల‌తో ప్రిన్సిపాల్ షాక‌వుతాడు. మ‌ధ్య‌లో జ‌గ‌తి క‌ల్పించుకొని ప‌ర్స‌న‌ల్‌గా మీ స్పీచ్ వినాల‌ని ఉంద‌ని రిషిని రిక్వెస్ట్ చేస్తుంది. రిషి మాట్లాడాల‌ని స్టూడెంట్స్ కూడా కోరుతారు. దాంతో వారి కోసం స్పీచ్ ఇస్తాడు రిషి. శాంతి మంత్రంతో త‌న స్పీచ్‌తో మొద‌లుపెడ‌తాడు రిషి. చ‌దువు గొప్ప‌త‌నాన్ని అంద‌రికి అర్థ‌మ‌య్యేలా వివ‌రిస్తాడు. అత‌డి స్పీచ్‌కు అంద‌రూ ముగ్ధులైపోతారు.

జ‌గ‌తి, మ‌హేంద్ర స‌త్కారం

ఆ త‌ర్వాత పాండ్య‌న్ స్టేజ్‌పైకి ఎక్కి రిషి సార్ వ‌ల్లే త‌మ జీవితం మారిపోయింద‌ని, కాలేజీ అంటే ఏంజాయ్‌మెంట్ అనుకునే భ్ర‌మలో ఉన్న త‌మ‌కు జీవితం విలువ‌ను రిషి, వ‌సుధార‌ చాటిచెప్పార‌ని అంటాడు. రిషి, వ‌సుధార‌లాంటి గురువులు ఉంటే ప్ర‌తి విద్యార్థి ఉన్న‌త స్థాయికి చేరుకుంటార‌ని పొగుడుతాడు. ప్రిన్సిపాల్ అనుమ‌తితో రిషి, వ‌సుధార‌ల‌ను స‌త్క‌రించాల‌ని ఉంద‌ని పాండ్య‌న్ కోరుతాడు. అయితే ఆ స‌త్కారం చీఫ్ గెస్ట్‌లైనా జ‌గ‌తి, మ‌హేంద్ర చేతుల మీదుగా జ‌రిగితే బాగుంటుంద‌ని ప్రిన్సిపాల్ అంటాడు.

అత‌డి మాట‌ల‌కు రిషి, వ‌సుధార షాక‌వుతారు. స్టేజ్‌పైకి వెళ్ల‌డానికి వ‌సుధార సంశ‌యిస్తుంది. రిషి కూడా ప్రిన్సిపాల్ మాట కాద‌న‌లేక ఒప్పుకుంటాడు. రిషి, వ‌సుధార‌ల‌ను జ‌గ‌తి, మ‌హేంద్ర శాలువాల‌తో స‌త్క‌రిస్తారు. రిషికి జ‌గ‌తి కంగ్రాట్స్ చెబుతుంది. కానీ అత‌డు మాత్రం బ‌దులివ్వ‌డు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

తదుపరి వ్యాసం