Gunde Ninda Gudi Gantalu: మీనా ధైర్యానికి బాలు ఫిదా -భార్యపై మీడియా ముందు పొగడ్తలు-కోడలిని చూసి భయపడ్డ ప్రభావతి
13 December 2024, 9:00 IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు డిసెంబర్ 13 ఎపిసోడ్‌లో శృతిని కాపాడిన మీనా సెలబ్రిటీగా మారిపోతుంది. వండర్ ఉమెన్ అంటూ టీవీ ఛానెల్ వాళ్లు శృతిని ఇంటర్వ్యూ చేస్తారు. భర్త నుంచే ధైర్యసాహసాలు నేర్చుకున్నానని క్రెడిట్ మొత్తం బాలుకు ఇస్తుంది మీనా.
గుండె నిండా గుడిగంటలు డిసెంబర్ 13 ఎపిసోడ్
Gunde Ninda Gudi Gantalu: పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేసిన శృతిపై యాసిడ్‌తో సంజు ఎటాక్ చేయబోతాడు. సంజు బారి నుంచి శృతిని మీనా కాపాడుతుంది. ఒంటరిగా ఉంటే సంజు ఇలాగే ఇబ్బందులకు గురిచేస్తుంటాడని, రవితో కలిసి ఇంటికివచ్చేయమని శృతికి సలహా ఇస్తుంది మీనా.
ఇంట్లో అందరితో కలిసి ఉంటే మీపై ఎటాక్ చేసే ధైర్యం సంజు చేయలేడని అంటుంది. మీ ఆయనే పెద్ద రౌడీలా ఉన్నాడని, ఇంటికి ఎలా వచ్చేదని మీనాతో అంటుంది శృతి. అదంతా తండ్రి మీదున్న ప్రేమతో వచ్చిన కోపమని మీనా అంటుంది. మావయ్య పోలీస్ స్టేషన్‌లో అవమానాలు పడటం, అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరడంతోనే బాలు ...రవిని కొట్టాడని శృతికి చెబుతుంది.
రవి ఎంట్రీ...
అప్పుడే రవి ఎంట్రీ ఇస్తాడు. రవిని చూడగానే కన్నీళ్లతో జరిగింది చెబుతుంది శృతి.నువ్వు లేకపోయి ఉంటే శృతి జీవితం ఏమయ్యేదని తల్చుకుంటే భయంగా ఉందని రవి అంటాడు. నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వదిన అంటూ మీనాను అడుగుతాడు రవి. నాకు తెలియదని మీనా సమాధానమిస్తుంది. మీనాకు థాంక్స్ చెబుతుంది శృతి. తానేం పరాయిదానిని కాదని, నీకు అక్క అవుతానని మీనా అనగానే శృతి ఎమోషనల్ అవుతుంది.
శృతి తల్లిదండ్రుల ఇంటికి మీనా...
రవి ఇంటి నుంచి మీనా నేరుగా శృతి తల్లిదండ్రులను కలవడానికి వెళుతుంది. బాలు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్లావని కోపంగా అడుగుతాడు. బయట ఉన్నానని వచ్చాకా చెబుతానని మీనా బదులిస్తుంది. మళ్లీ ఏ తద్దినం పెట్టడానికి వెళ్లావని, ఇప్పటికే నీ వల్ల అంటూ బాలు చెప్పబోతుండగా...ఇంటికి వచ్చాకా తిట్టండి...ఇప్పుడు బిజీగా ఉన్నానని ఫోన్ కట్ చేస్తుంది. మీనా వల్ల మళ్లీ ఇంటికి ఏదో పెద్ద ప్రాబ్లెమ్ రాబోతుందని బాలు అనుకుంటాడు.
శోభన ఎమోషనల్...
శృతి ఫొటోలు చూస్తూ శోభన ఎమోషనల్ అవుతుంది. ఆ ఫొటోలను సురేంద్ర విసిరేస్తాడు. శృతి ఫొటోలు మీనా కాళ్ల దగ్గర పడతాయి. వాటిని చూడగానే శృతి గురించి మీతో మాట్లాడటం అనవసరం అని, వినే పరిస్థితుల్లో మీరు లేరని అర్థమైందని మీనా అంటుంది. ఆ సత్యం రాయబారం నడపమని నిన్ను పంపించాడా సురేంద్ర కోపంగా మీనాతో అంటాడు.
తప్పుగా మాట్లాగొద్దు...
మావయ్య గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదని మీనా అంటుంది.మీ మంచి కోరి ఓ విషయం చెప్పడానికి వచ్చానని మీనా అంటుంది. శృతి చాలా ప్రమాదంలో ఉందని చెబుతుంది. శృతి ఎవరో తనకు తెలియదని సురేంద్ర కోపంగా బదులిస్తాడు. ఆవేశపడితే మీ అమ్మాయి జీవితమే నాశనమవుతుందని సురేంద్రకు ఆన్సర్ ఇస్తుంది మీనా.
మంచి చెడు ఆలోచించకుండా...
మంచి చెడు ఆలోచించకుండా నరరూప రాక్షసుడిలాంటి సంజుకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లిచేయాలని అనుకున్నారు...కానీ శృతి తనకు దక్కకపోవడంతో ఆమె ప్రాణాలు తీయాలని అనుకున్నాడని సంజు ఎటాక్ గురించి శోభన, సురేంద్రలకు చెబుతుంది మీనా. ఆ సంఘటన గురించి వినగానే శోభన కంగారుపడుతుంది. తాను అక్కడే ఉండటం వల్ల శృతి ప్రాణాలు కాపాడగలిగానని మీనా అంటుంది.
ప్రతిక్షణం నరకయాతన...
మనల్ని కాదని వెళ్లిపోయిన శృతి ఏమైపోయినా మనకెందుకు అని సురేంద్ర అంటాడు. మిమ్మల్ని కాదని రవిని పెళ్లిచేసుకున్నందుకు మీకు కోపంగా ఉంది. కానీ రవిని కాదని మీరు చూసిన వాడిని పెళ్లిచేసుకుంటే ఆమె కాపురం దినదిన గండంలా ఉండేదని, సంజు ఎలాంటి వాడో తెలుసుకున్న శృతి...రవిని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని కాపాడుకుందని మీనా అంటుంది. లేదంటే సంజును పెళ్లిచేసుకొని ప్రతిక్షణం నరకయాతన అనుభవించేది. అప్పుడు మీ మాటే నెగ్గిందని సంతోషపడేవాళ్లా...కూతురు పడే నరకయాతన చూసి కుమిలిపడేవాళ్లా అని శోభన, సురేంద్రలకు క్లాస్ ఇస్తుంది మీనా.
సంజును వదిలిపెట్టను...
. శృతిని కలిసి ఇప్పుడే మాట్లాడుదామని శోభన కంగారుగా భర్తతో అంటుంది. కానీ సురేంద్ర అందుకు ఒప్పుకోడు. కానీ సంజును మాత్రం వదిలిపెట్టేది లేదని, ఇప్పుడే అతడి తండ్రి నీలకంఠంతో మాట్లాడుతానని బయలుదేరుతాడు.
బాలు టెన్షన్...
బాలు కంగారుగా ఇంటి బయట తిరుగుతుంటాడు. అతడి టెన్షన్ చూసి ఏమైందని మౌనిక అడుగుతుంది.
బాలు బయటకు వెళ్లాలి...కానీ బాంబు బయటకు వెళ్లిందని బాలు బదులిస్తాడు. ఆ బాంబు పేరు నా పెళ్లాం అని చెబుతాడు. మీనా చెప్పకుండా వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతుందని, ఈ సారి ఎలాంటి అనర్థం తెచ్చిపెడుతుందోనని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి మీనా ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కడికి వెళ్లావు...ఎందుకు వెళ్లావని బాలు...మీనాపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు.
శృతిని కలవడానికి వెళ్లా...
శృతిని కలవడానికి వెళ్లానని మీనా అనగానే...ఆ అమ్మాయితో మాట్లాడవద్దని చెప్పాను.. అయినా ఎందుకు వెళ్లావు...ఎక్కడికి వెళ్లావని మళ్లీ ఆపకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. రవికి, తనకు ఏదో సమస్య ఉందని అంటే కలవడానికి వెళ్లానని, కానీ అక్కడ శృతిపై సంజు ఎటాక్ చేశాడని జరిగిన సంగతి చెబుతుంది. మీనా రౌడీలను కొట్టిందని తెలియగానే బాలు షాకవుతాడు.
మీనాకు మర్యాద...
అప్పుడే అక్కడికి వచ్చిన ప్రభావతి కాఫీ ఇవ్వకుండా ఎక్కడ పెత్తనాలు చేస్తున్నావని మీనాపై ఫైర్ అవుతుంది. పక్కనే ఉన్న ఇటుక తీసి బాలు పక్కన పడేస్తాడు. ఇక నుంచి మీనాకు మర్యాద ఇచ్చి మాట్లాడమని అంటాడు. అప్పుడే అక్కడికి మీడియా వాళ్లు వస్తారు. వండర్ ఉమెన్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చామని మీనాను పొగుడుతారు. మీనాను పదే పదే దెప్పిపొడుస్తుంది ప్రభావతి. మీనాను ఇన్‌సల్ట్ చేసి ప్రమాదం కొనితెచ్చుకోవద్దని తల్లిని హెచ్చరిస్తుంటాడు బాలు.
మీనా చేసిన సాహసం...
మీనా చేసిన సాహసం తాలూకు వీడియోను ప్రభావతితో పాటు ఇతర కుటుంబసభ్యులకు మీడియా వాళ్లు చూపిస్తారు. ఇటురరాయితో మీనా రౌడీలను చితక్కొట్టిన వీడియో చూడగానే ప్రభావతి భయపడిపోతుంది. అంత ధైర్యంగా రౌడీలను ఎలా ఎదురించారు...మీకు భయంగా అనిపించలేదా అని మీడియా వాళ్లు మీనాను అడుగుతారు. అంత ఆలోచించలేదని, ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలని రాయి విసిరానని మీనా ఆన్సర్ ఇస్తుంది. నాపై ఎటాక్ జరిగినా ఇలాగే రెస్పాండ్ అయ్యేదానినని అంటుంది.
బాలుకు క్రెడిట్...
ఈ ధైర్యం అంత తాను భర్త దగ్గర నేర్చుకున్నానని క్రెడిట్ మొత్తం బాలుకు ఇచ్చేస్తుంది మీనా. ఎవరికైనా సాయం కావాలంటే భర్త ముందుంటాడని, గొడవ వస్తే పందెం కోడిలా తలపడతాడని చెబుతుంది.
ఇలాంటి వీరవనిత మీ భార్య కావడం ఎలా ఫీలవుతున్నారని బాలును మీడియా వాళ్లు అడుగుతారు. మీనా మంచి అమ్మాయి...తనలో ఇంత ధైర్యం ఉందని తెలియలేదని బాలు అంటాడు. మీనాను చూస్తుంటే గర్వంగా ఉందని అంటాడు. ఆ ఇటుకరాయిని మీడియా వాళ్ల దగ్గర నుంచి తీసుకుంటాడు.
మనోజ్ జోకులు...
మీనా చేసిన సాహసం గురించి విని భయపడిన ప్రభావతి, మనోజ్, రోహిణి సెలైంట్‌గా ఇంట్లోకి వెళ్లిపోతారు. ఇంట్లో రౌడీలు ఎక్కువైపోయారని మనోజ్ అంటాడు. బాలు, మీనా కలిసి రౌడీ అండ్ కంపెనీ ఏర్పాటుచేస్తే బాగుంటుందని రోహిణి, మనోజ్ జోకులు వేస్తారు.
దుష్టశక్తులు ఏమైనా అంటే...
అప్పుడే బాలు ఇటుకరాయితో లోపలికి రావడంతో సెలైంట్ అయిపోతారు. తన భార్యకు ఊరంతా బిరుదుల మీద బిరుదులు ఇస్తున్నారని బాలు సంబరంగా అంటాడు. ఇక నుంచి నీకు ఏం భయం లేదని, నిన్ను దుష్టశక్తులు ఏమైనా అంటే పనికొస్తుందని ఇటుక రాయి తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నానని బాలు అంటాడు.
ఒకటి రెండుసార్లు ఆలోచించుకో...
మీనా రోజు బయటకు వెళుతున్నందుకు ఆమెను ఏమైనా తిట్టాలని అనుకుంటున్నావా అని ప్రభావతిని అడుగుతాడు. నేనేందుకు అంటానని ప్రభావతి తడబడిపోతుంది. మనోజ్, రోహిణిలకు వార్నింగ్ ఇస్తాడు బాలు. ఇంకోసారి మా స్టోన్ లేడీని ఏదైనా అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమని అంటాడు.
ఆడది అన్నక హద్దుల్లో ఉండాలి. రౌడీలా ప్రవర్తిస్తే ఎలా అని గొంతు పెంచి మాట్లాడుతుంది ప్రభావతి. ఈ రాయి చూసి ఆ మాట చెప్పమని బాలు అనగానే ప్రభావతి ఆవేశం చల్లారిపోతుంది.
మీనాకు ముద్దు...
తన ఫ్రెండ్స్‌కు పార్టీ ఇవ్వడానికి వెళుతున్నానని, ఇంట్లో వాళ్లకు తెలియకుండా నువ్వే మ్యానేజ్ చేయాలని మీనాను రిక్వెస్ట్ చేస్తాడు బాలు. మీనా ఒకే అనగానే ఆనందంగా ఆమెకు ముద్దు పెడతాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.