తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Cutout: గేమ్ ఛేంజర్ రిలీజ్ ముంగిట రామ్ చరణ్‌కి అతి పెద్ద కటౌట్.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?

Ram Charan Cutout: గేమ్ ఛేంజర్ రిలీజ్ ముంగిట రామ్ చరణ్‌కి అతి పెద్ద కటౌట్.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?

Galeti Rajendra HT Telugu

20 December 2024, 20:46 IST

google News
  • Ram Charan Cutout: ఆచార్య డిజాస్టర్ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీపై రామ్ చరణ్ గంపెడాశలు పెట్టుకున్నాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అంచనాల్ని పెంచేయగా.. రామ్ చరణ్‌కి పెద్ద కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటు చేయబోతున్నారు. 

రామ్ చరణ్ కటౌట్
రామ్ చరణ్ కటౌట్

రామ్ చరణ్ కటౌట్

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ కోసం మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్.. ట్రైలర్‌తో పాటు మూడు పాటలను కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచనాల్ని పెంచేసింది.

అతి పెద్ద కటౌట్ ఎక్కడంటే?

మూవీ రిలీజ్ ముంగిట అమెరికాలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుండగా.. ఇండియాలోనే అతి పెద్ద కటౌట్‌ను రామ్ చరణ్ అభిమానులు ఏర్పాటు చేయబోతున్నారు. డిసెంబరు 29న ఈ కటౌట్‌ను ఆవిష్కరించబోతున్నారు. ఇంతకీ ఈ కటౌట్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసా? విజయవాడలోని బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్‌లో.. ఆరోజు సాయంత్రం 4 గంటలకి మెగా అభిమానుల సమక్షంలో కటౌట్‌ను ఆవిష్కరించబోతున్నారు.

గేమ్ ఛేంజర్‌లో స్టార్ కాస్ట్

పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీని దిల్ రాజు.. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథ అందించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా కియారా అడ్వాణీ నటిస్తోంది. అలానే సీనియర్ నటులు శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, హీరోయిన్ అంజలి, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీలో రామ్ చరణ్ తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపించబోతున్నాడు.

సంక్రాంతికి గట్టి పోటీ

ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఆచార్యలో నటించిన రామ్ చరణ్‌కి చేదు అనుభవం ఎదురైంది. దాంతో.. గేమ్ ఛేంజర్‌పై ఈ గ్లోబల్ స్టార్ గంపెడాశలు పెట్టుకున్నాడు. మరోవైపు శంకర్ కూడా భారతీయుడు -2 నిరాశపరచడంతో గేమ్ ఛేంజర్‌తో మళ్లీ సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. సంక్రాంతికి డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల రూపంలో గేమ్ ఛేంజర్ గట్టి పోటీని ఎదుర్కోబోతోంది.

తదుపరి వ్యాసం