తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Don 3 Teaser: షారుక్ ఔట్.. కొత్త డాన్ రణ్‌వీర్ సింగ్.. డాన్ 3 టీజర్ అదుర్స్

Don 3 Teaser: షారుక్ ఔట్.. కొత్త డాన్ రణ్‌వీర్ సింగ్.. డాన్ 3 టీజర్ అదుర్స్

Hari Prasad S HT Telugu

08 January 2024, 18:34 IST

google News
    • Don 3 Teaser: డాన్ ఫ్రాంఛైజీ నుంచి షారుక్ ఔట్ అయ్యాడు. కొత్త డాన్ గా రణ్‌వీర్ సింగ్ రావడం విశేషం. తాజాగా బుధవారం (ఆగస్ట్ 9) రిలీజైన డాన్ 3 టీజర్ ఈ విషయాన్ని కన్ఫమ్ చేసింది.
డాన్ 3 టీజర్ లో రణ్‌వీర్ సింగ్
డాన్ 3 టీజర్ లో రణ్‌వీర్ సింగ్

డాన్ 3 టీజర్ లో రణ్‌వీర్ సింగ్

Don 3 Teaser: బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ డాన్ నుంచి షారుక్ ఖాన్ ఔటయ్యాడు. మంగళవారం (ఆగస్ట్ 8) రిలీజైన డాన్ 3 టీజర్ ద్వారా కొత్త శకం ప్రారంభం కాబోతున్నట్లు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ వెల్లడించాడు. చెప్పినట్లే బుధవారం (ఆగస్ట్ 9) మరో టీజర్ ద్వారా కొత్త డాన్ రణ్‌వీర్ సింగ్ అని కన్ఫమ్ చేశాడు. షారుక్ స్థానంలో రణ్‌వీర్ రాబోతున్నాడని ఇప్పటికే వార్తలు రాగా.. ఇప్పుడు మేకర్సే అతడు ఉన్న టీజర్ ను రిలీజ్ చేశారు.

అయితే దీనిపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అసలు షారుక్ లేని డాన్ మూవీ ఏంటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కొత్త టీజర్ విషయానికి వస్తే తనను 11 దేశాల పోలీసులు పట్టుకోవాలని చూస్తున్నారని, ఎవరైనా పట్టుకోగలరా అంటూ రణ్‌వీర్ డాన్ లాగా దర్శనమిచ్చాడు. ఈ కొత్త డాన్ పాత్రలో రణ్‌వీర్ చాలా స్టైలిష్ గా కనిపించాడు.

ఫర్హాన్ ఈ కొత్త టీజర్ షేర్ చేస్తూ.. కొత్త శకం ప్రారంభమైంది అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ సినిమాను ఫర్హానే డైరెక్ట్ చేయనున్నాడు. ఓ ఎత్తయిన బిల్డింగ్ లోపల రణ్‌వీర్ అటువైపు ముఖం చేసి కూర్చున్న సీన్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ఓ లెదర్ జాకెట్, లెదర్ బూట్స్ వేసుకొని ఉన్న రణ్‌వీర్ సిగరెట్ కాలుస్తూ కనిపిస్తాడు. తనను డాన్ గా పరిచయం చేసుకుంటూ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి.

డాన్ కొత్త శకం ప్రారంభం కాబోతున్నట్లు మంగళవారం తన ఇన్‌స్టా పోస్ట్ ద్వారా ఫర్హాన్ వెల్లడించాడు. "తొలిసారి 1978లో డాన్ గా అమితాబ్ బచ్చన్ కనిపించాడు. ఆ సినిమా ఇప్పటికీ అభిమానుల మనసుల్లో నిలిచిపోగా.. ఇప్పుడు ఎక్సెల్ ఎంటైర్‌టైన్మెంట్స్ ఫర్హాన్ అక్తర్ డాన్ తిరిగి వస్తోందని చెప్పడానికి సంతోషిస్తోంది. 2006, 2011లో షారుక్ ఖాన్ తో డాన్ సినిమాలతో ఉర్రూతలూగించిన ఫర్హాన్.. ఇప్పుడు డాన్ 3తో తనదైన స్టోరీ టెల్లింగ్ ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు" అని ఆ నోట్‌లో రాసి ఉంది.

ఇప్పటి వరకూ డాన్లుగా కనిపించిన అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ లపై మీరు చూపించిన ప్రేమను కొత్త డాన్ పై కూడా చూపిస్తారని భావిస్తున్నట్లు ఫర్హాన్ చెప్పాడు. ఆ కొత్త డాన్ రణ్‌వీర్ సింగేనని బుధవారం అతడు టీజర్ ద్వారా తేల్చాడు. ఈ కొత్త డాన్ 2025లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 1978లో వచ్చిన అమితాబ్ బచ్చన్ డాన్ మూవీని 2006లో ఫర్హాన్ అదే పేరుతో రీమేక్ చేశాడు.

తదుపరి వ్యాసం