తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Don 3 Announced: డాన్ 3 వచ్చేస్తోంది.. టీజర్ రిలీజ్ చేసిన ఫర్హాన్ అక్తర్

Don 3 announced: డాన్ 3 వచ్చేస్తోంది.. టీజర్ రిలీజ్ చేసిన ఫర్హాన్ అక్తర్

Hari Prasad S HT Telugu

08 August 2023, 13:40 IST

google News
    • Don 3 announced: డాన్ 3 వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ ను మంగళవారం (ఆగస్ట్ 8) డైరెక్టర్, యాక్టర్ ఫర్హాన్ అక్తర్ రిలీజ్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
డాన్ 3 అనౌన్స్‌మెంట్ చేసిన ఫర్హాన్ అక్తర్
డాన్ 3 అనౌన్స్‌మెంట్ చేసిన ఫర్హాన్ అక్తర్

డాన్ 3 అనౌన్స్‌మెంట్ చేసిన ఫర్హాన్ అక్తర్

Don 3 announced: డాన్ ఫ్రాంఛైజీ నుంచి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే డాన్, డాన్ 2లతో దుమ్ము రేపిన ఈ ఫ్రాంఛైజీ నుంచి డాన్ 3 రాబోతోంది. ఈ విషయాన్ని ఓ చిన్న టీజర్ ద్వారా డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ వెల్లడించాడు. మంగళవారం (ఆగస్ట్ 8) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతడు ఈ అనౌన్స్‌మెంట్ చేశాడు. అసలు ఎలాంటి క్యాప్షన్ లేకుండా ఈ వీడియో రిలీజ్ చేశాడు.

అయితే దానిని చూస్తే ఫ్యాన్స్ కు అది డాన్ 3 అనౌన్స్‌మెంట్ అన్న విషయం అర్థమైపోయింది. కేవలం 3 నంబర్ ను హైలైట్ చేస్తూ ఈ టీజర్ వీడియో ఉంది. ఈ 3 నంబర్ ఫాంట్, స్టైల్ చూస్తే అది డాన్ ను గుర్తు చేస్తోంది. డాన్ మూవీలోని పాపులర్ సాంగ్ మై హూ డాన్ లోని మ్యూజిక్ లాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. దీంతో ఫ్యాన్స్ ఇది డాన్ 3 అనౌన్స్‌మెంట్ అని ఫిక్సయిపోయారు.

ఈ పోస్ట్ పై ఐఎండీబీ ఇండియా కామెంట్ చేసింది. "11 దేశాల పోలీసులు రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు" అంటూ సరదాగా కామెంట్ చేయడం విశేషం. ఫర్హాన్ సోదరి, డైరెక్టర్ జోయా అక్తర్ కూడా బూమ్ అనే కామెంట్ తో స్పందించింది. ఈ వీడియోలో కింద కొత్త శకం ప్రారంభమైంది అనే లైన్ ఆకర్షించింది. అయితే ఇప్పుడిదే లైన్ షారుక్ ఫ్యాన్స్ నూ ఆందోళనకు గురి చేస్తోంది.

డాన్ 3లో రణ్‌వీర్ సింగ్?

ఈ కొత్త శకం అంటే కింగ్ ఖాన్ డాన్ గా తిరిగి రాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త డాన్ గా రణ్‌వీర్ సింగ్ వస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు షారుక్ లేకుండా డాన్ ఏంటని ఓ యూజర్ కామెంట్ చేయడం విశేషం. డాన్ రోల్లో షారుక్ స్వాగ్ ను మ్యాచ్ చేసే మరో నటుడు లేడని మరో యూజర్ కామెంట్ చేశారు.

షారుక్ లేకుండా డాన్ 3 లేదు అని ఇంకొకరు అన్నారు. షారుక్ లేకుండా కొత్త శకం అవసరం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. నిజానికి 1978లో అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ సూపర్ డూపర్ హిట్ అయింది. అదే పేరుపై షారుక్ డాన్ తీసినా.. అది అధికారిక రీమేక్ కాదు. డాన్ 3 అయినా ఆ రీమేక్ అవుతే బాగుంటుందని మరో యూజర్ కామెంట్ చేశారు.

ఈ డాన్ 3 మూవీని కూడా ఫర్హాన్ అక్తర్ నిర్మించి, డైరెక్ట్ చేయనున్నాడు. డాన్ 2 మూవీని అతడే డైరెక్ట్ చేశాడు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఫ్రాంఛైజీలోని సినిమాతో రాబోతున్నాడు. డాన్ 2006లో, డాన్ 2 2011లో వచ్చాయి. ఈ సినిమాల్లో షారుక్ ఖాన్, ప్రియాంకా చోప్రా నటించారు.

తదుపరి వ్యాసం