Pushpa 1 vs Pushpa 2: పుష్ప 1 వర్సెస్ పుష్ప 2 - సీక్వెల్ లో చేసిన మార్పులు ఇవే -బడ్జెట్, బిజినెస్... అన్నీ డబుల్!
30 November 2024, 10:58 IST
Pushpa 1 vs Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది. 2021 వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ పుష్ప కు రీమేక్‌గా పుష్ప 2 తెరకెక్కుతోంది. పార్ట్ వన్‌తో పోలిస్తే సీక్వెల్‌లో ఎలాంటి మార్పులు చేశారు? కొత్తగా కనిపించే పాత్రలు ఏవంటే?
పుష్ప 1 వర్సెస్ పుష్ప 2
అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున ఈ మూవీని విడుదలచేయబోతున్నారు. పుష్ప 2 ప్రమోషన్స్ మొత్తం అల్లు అర్జున్ స్వయంగా చూసుకుంటున్నారు.
ముంబై, చెన్నై, పాట్నాతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో జరిగిన అన్ని ఈవెంట్స్‌లో పాల్గొన్నాడు. అభిమానులు అడగకుండానే పుష్ఫ 2లోని పాటలకు డ్యాన్సులు చేస్తూ, డైలాగ్‌లు చెబుతూ అభిమానులను ఆకట్టుకుంటోన్నాడు. మరోవైపు పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న సుకుమార్ ఇప్పటివరకు ఒక్క ప్రమోషన్ ఈవెంట్‌లో కనిపించలేదు.
వెయ్యి కోట్ల కలెక్షన్స్...
పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప 2పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా ఈ మూవీ దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటోన్నాయి. కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే టాలీవుడ్ గత రికార్డులు మొత్తం పుష్ప 2తో బద్దలు కావడం ఖాయమని అంటున్నారు.
ఇంటర్నేషనల్ లెవెల్...
పుష్ప పార్ట్ వన్‌తో పోలిస్తే పుష్ప 2లో డైరెక్టర్ సుకుమార్ భారీగానే మార్పులు చేశాడు. ట్రైలర్, టీజర్ చూస్తుంటే సినిమా స్పాన్ మొత్తం మారిపోయింది. పుష్ప పార్ట్ 1 లో పుష్పరాజ్ స్మగ్లింగ్ దందాలు లోకల్‌కే పరిమితం కాకుండా సీక్వెల్‌లో మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంటాయని ట్రైలర్‌లోనే డైలాగ్‌తోనే క్లారిటీ ఇచ్చాడు.
జగపతిబాబు ప్రకాష్ రాజ్...
పుష్ప2లో కొత్తగా జగపతిబాబు, ప్రకాష్‌రాజ్ పాత్రలు కనిపించబోతున్నాయి. జగపతిబాబు సీఏం పాత్రలో నటించనున్నట్లు సమాచారం. సీఏంతోనే పుష్పరాజ్‌కు ఏర్పడిన వైరం నేపథ్యంలోనే సీక్వెల్ కథ సాగుతుందని సమాచారం. సౌరబ్ సచ్‌దేవాతో పాటు మరికొందరు కొత్త ఆర్టిస్టులు ఈ సీక్వెల్‌లో కనిపించనున్నట్లు చెబుతోన్నారు.
పుష్ప పార్ట్ వన్‌లో ఐటెంసాంగ్‌లో సమంత నటించగా...పుష్ప 2లో శ్రీలీల కనిపించబోతున్నది. అల్లు అర్జున్, శ్రీలీలపై తెరకెక్కించిన కిస్సిక్ పాట ట్రెండింగ్ అవుతోంది.
పుష్ప బడ్జెట్ రెండు వందల యాభై కోట్ల లోపే కాగా...పుష్ప 2 బడ్జెట్ ఐదు వందల కోట్లకుపైనే అని సమాచారం. పార్ట్ వన్ హిట్ నేపథ్యంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించారు.
నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు...
పుష్ప కు దేవిశ్రీప్రసాద్ ఒక్కటే మ్యూజిక్ అందించగా...సీక్వెల్‌కు మాత్రం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తోన్నారు. దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ కంపోజ్ చేయగా...బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను తమన్, సామ్ సీఎమ్, అజనీష్ లోకనాథ్ సమకూర్చుతున్నారు.
పుష్ప పార్ట్ వన్ రన్‌టైమ్ రెండు గంటల ముప్ఫై తొమ్మిది నిమిషాలు ఉండగా....సీక్వెల్ మాత్రం మూడు గంటల పదిహేను నిమిషాల కంటే ఎక్కువే రన్‌టైమ్‌తో రిలీజ్ అవుతోన్నట్లు సమాచారం.
పుష్ప పార్ట్ ను త్రీడీ, ఐమాక్స్ వెర్షన్‌లో రిలీజ్ చేస్తోన్నారు. వరల్డ్ వైడ్‌గా దాదాపు 12 వేల స్క్రీన్స్‌లో ఈ మూవీ రిలీజ్ వుతోంది.
1085 కోట్లు...
పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల వరకు జరగ్గా...పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ 1085 కోట్లకు అమ్ముడుపోయాయి.
పుష్ప ఓటీటీ హక్కులను 30 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనగా...పుష్ప 2 డిజిటల్ రైట్స్ 275 కోట్ల భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
పుష్ప నిర్మాణంలో అల్లు అర్జున్ బంధువులు ప్రారంభించిన ముత్తంశెట్టి మీడియా ప్రొడక్షన్‌లో పాలు పంచుకుంది. పుష్ప 2లో మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.