తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi January 13th Episode: కావ్య కంటే రుద్రాణి బెటర్ అన్న స్వప్న- బోసి మెడతో కళావతి- నగల తాకట్టు విషయం బయటకు!

Brahmamudi January 13th Episode: కావ్య కంటే రుద్రాణి బెటర్ అన్న స్వప్న- బోసి మెడతో కళావతి- నగల తాకట్టు విషయం బయటకు!

Sanjiv Kumar HT Telugu

13 January 2025, 7:21 IST

google News
    • Brahmamudi Serial January 13th Episode: బ్రహ్మముడి జనవరి 13 ఎపిసోడ్‌లో తన సీమంతం పుట్టింట్లో జరగడానికి కారణం కావ్య అని గొడవ పెట్టుకుంటుంది స్వప్న. నీకంటే మా అత్త బెటర్ అని స్వప్న అంటుంది. తర్వాత గదిలో స్వప్న బాధపడుతుంటే రుద్రాణి, రాహుల్ వచ్చి ఎమోషనల్‌ డ్రామా చేస్తారు. ఆ మాటలను స్వప్న నమ్ముతుంది.
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 13వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 13వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 13వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో తాతయ్య హాస్పిటల్ బిల్‌కి చెక్ కాకుండా క్యాష్ ఇచ్చారని రాహుల్ చెబుతాడు. అవునా, ఏదో తేడాగా ఉందే. రాజ్ బ్లాక్ మనీ పెట్టుకునే టైప్ కాదు. అంతా లీగల్‌గా జరగాలని అనుకుంటాడు. అసలు కంపెనీ అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయా. రాజ్ చెప్పినట్లు ఆడిట్ కోసం అకౌంట్స్ హోల్డ్ చేశారా. చేసిన ఇంతా టైమ్ పట్టదుగా. యస్.. ఎక్కడో ఏదో జరుగుతుంది. రాజ్, కావ్య కలిసి తోడు దొంగల్లా నాటకాలు ఆడుతున్నారు అని రుద్రాణి అంటుంది.

అన్నీ కోల్పోతున్నాను

స్వప్న సీమంతం పుట్టింట్లో కావ్య ఎందుకు జరిపిస్తుందో.. ఐదు లక్షలు క్యాష్ రూపంలో ఎందుకు కట్టారో మొత్తం కనుక్కుంటా అని రుద్రాణి అంటుంది. మరోవైపు కావ్య వంటింట్లో ఉంటే స్వప్న వచ్చి సమాధానం కావాలి అంటుంది. సీమంతం గురించి. ఎందుకు అలా చేశావ్. అమ్మకు ఆ ఆలోచన వచ్చేలా చేసింది నువ్వే అని తెలుసు. సొంత అక్క సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఏ ఆడపిల్లైన తన సీమంతం గొప్పగా జరగాలని అనుకుంటుంది. వచ్చినవాళ్లకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనికుంటుంది. కానీ, నీ వల్ల అవన్నీ కోల్పోతున్నాను అని స్వప్న అంటుంది.

నువ్ నాకు మనింట్లోనే చెల్లెలివి. ఇక్కడ తోడి కోడలివి అని అర్థం అవుతోంది అని స్వప్న అంటుంది. లేదు అక్క. నువ్ కూడా నన్ను శత్రువులా చూడకు. నేను ఏం చేసిన మన మంచికోసం. ఈ కుటుంబం మేలు కోసమే చేస్తాను. అది అర్థం చేసుకో అక్క అని కావ్య అంటుంది. మేలు కోరుకోవడం అంటే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం. నీకు నచ్చినట్లు బతకాలని అనుకోవడం కాదు అని స్వప్న అంటుంది. అందరూ నిందలు వేస్తారని తెలిసిన ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నానో అర్థం చేసుకో అని కావ్య అంటుంది.

ఆస్తి నీ పేరు మీద ఉందిగా. ఇక నిందలు నీ చెవికి ఏం వినపడాతాయ్. దుళిపేసుకుని వెళ్లిపోవడం నేర్చుకున్నావ్. అమ్మమ్మ, అత్తయ్య సపోర్ట్ ఉందికదా. ఇంత మారిపోతావ్ అని అస్సలు ఊహించలేదు. చూస్తుంటే నీకంటే మా అత్త బెటర్ అనిపిస్తుంది అని స్వప్న అంటుంది. అక్క ఇంకా చాలు ఆపేయ్. అందరు నిందించడం వేరు. సొంత అక్కవి నువ్ అనడం వేరు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా అక్క. ఇప్పుడు నేను ఏం చెప్పిన నీకు అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు అన్ని నీకు తెలుస్తాయ్ అని కావ్య అంటుంది.

నువ్ చెప్పేవరకు

ఏం అవసరం లేదు. నా ఏడుపు నేను ఏడుస్తాను అని స్వప్న వెళ్లిపోతుంది. అప్పుడే వచ్చిన అదంతా అపర్ణ చూస్తుంది. మీరెప్పుడు వచ్చారు అత్తయ్య. మీరు కూడా ఏదైనా అనాలంటే అనండి అని కావ్య అంటుంది. నువ్ నేను అంటే పడతావ్ అని నాకు తెలుసు. అసలు ఇదంతా ఎందుకు. దేనికి చేస్తున్నావ్. ఒక్క మాట అన్న పడవు. అలాంటి నువ్వు ఇలా ఎందుకు మారిపోయావ్. దీనికి కూడా కారణాలు ఉన్నాయా. నీ అంతట నువ్ చెప్పేవరకు నేను నిన్ను అడగను అని అపర్ణ అంటుంది.

నేను వచ్చింది సీమంతానికి కావాల్సిన వస్తువులు తీసుకొద్దామని. నీ పని పూర్తి చేసుకుని రా వెళ్దాం అని అపర్ణ వెళ్లిపోతుంది. మరోవైపు స్వప్న సీమంతానికి కావాల్సినవి సీమంతం శీనుతో కనకం లిస్ట్ రాయిస్తుంది. లిస్ట్‌కు రూ. 40 వేలు అయింది అని సీమంతం శీను అంటాడు. రెండో సీమంతం నీకారా అని కనకం అంటుంది. సిటీలో పర్ఫెక్ట్‌గా నా అంత బాగా సీమంతం చేయరు. తక్కువలో తక్కువ 50 వేలు. మన కనకం అక్కే కదా అని పది వేలు డిస్కౌంట్ ఇచ్చాను అని శీను అంటాడు.

నా బడ్జెట్ 20 వేలు. నా ఇంటికి దుగ్గిరాల కుటుంబం వాళ్లు అంతా వస్తారు. చూసేందుకు రిచ్‌గా కనిపించాలి. కానీ, నా బడ్జెట్ 20 వేలు అని కనకం అంటుంది. అయితే అన్ని వాసన చూపించి పంపించాలా అని శీను అంటాడు. దాంతో సామాను ఉండే సమయం సగానికి తగ్గించేస్తుంది కనకం. అలాగే, పిలిచే మందిని, టిఫిన్స్ అన్ని తక్కువ చేస్తుంది. పండ్లలో కొన్ని ప్లాస్టిక్ పళ్లు పెట్టమంటుంది. ఇప్పుడు ఎంత అయింది అని అడిగితే.. 24 వేల 900 అయిందని శీను అంటాడు. వాటిలో 20 వేలు చేసుకో అని కనకం అంటుంది.

వెళ్లి హత్తుకో

దాంతో బాధగా శీను ఒప్పుకుంటాడు. సీమంతం మాత్రం రిచ్‌గా జరగాలని అంటుంది కనకం. మరోవైపు కావ్యకు రాజ్ సైట్ కొడుతుంటే అంతరాత్మ వచ్చి సిగ్గులేదా అంటాడు. అంత కర్మ నీకెంట్రా. వెళ్లి వెనకనుంచి వాటేసుకుంటే నీ మీద వయలెన్స్ కేసు పెడుతుందా, చీటింగ్ గేసు పెడుతుందా అని అంతరాత్మ అంటాడు. అలా చేస్తే చీప్ అయిపోతాం అని రాజ్ అంటాడు. వాటేసుకోకుంటేనే చీప్ అయిపోతాం అని అంతరాత్మ అంటాడు.

ఇద్దరు వాదించుకుంటారు. ఇప్పుడే మంచి ఛాన్స్. మనం పెళ్లాం సర్దిందే సర్దుతు రెచ్చగొట్టి చంపేస్తోంది. వెళ్లి హత్తుకో అని అంతరాత్మ అంటాడు. సడెన్‌గా హత్తుకుంటే మొత్తుకుంటుందేమో అని రాజ్ అంటాడు. నువ్వు నీ డౌట్ వెళ్లి అని కోప్పడుతాడు అంతరాత్మ. కావ్య వెనుక మెల్లిగా రాజ్ వెళ్తాడు. సడెన్‌గా వెనక్కి చూసిన కావ్య పడిపోతుంటే రాజ్ పట్టుకుంటాడు. రొమాంటిక్‌గా సీన్ సాగుతుంది. ఇద్దరు అలాగే మాట్లాడుకుంటారు.

పక్కన ఉన్న అంతరాత్మ హత్తుకో అని అంటాడు. రాజ్ వెళ్లిపో అని అరుస్తాడు. ఏదో చెప్పాలని వచ్చారు అని కావ్య అంటే.. అవును, అని కావ్యను వదిలేసి స్వప్న సీమంతం ఏర్పాట్ల గురించి అడుగుతాడు. మీ అమ్మ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో. మనం ఖర్చు తగ్గించుకోడానికి మీ అమ్మకు ఖర్చు పెట్టాం అని రాజ్ అంటాడు. తను బడ్జెట్‌లోనే చేస్తుంది. అడిగిన నాకే గడ్డి పెట్టింది. మీరు అడుగుతారా అని కావ్య అంటుంది. వద్దు. ఇద్దరిలో ఒకరికి పెడితే చాలు అని రాజ్ అంటాడు.

శత్రువులా చూస్తారు

తర్వాత రాజ్ వెళ్లిపోతాడు. దాంతో అంతరాత్మ ఊస్తాడు. మరోవైపు నగలన్నీ బయటపెట్టి సీమంతం గ్రాండ్‌గా జరగట్లేదని స్వప్న బాధపడుతుంది. రానంటే అమ్మా, వెళ్లనంటే అక్క బాధపడుతుంది అని స్వప్న అంటుంది. ఇంతలో రుద్రాణి, రాహుల్ వస్తారు. మొహం మాడ్చుకుని కూర్చున్నావ్ అని రుద్రాణి అంటే సీమంతం సింపుల్‌గా జరుగుతుంటే ఎలా ఉంటుంది అని రాహుల్ అంటాడు. ఎంత బాధున్న గుండెల్లోనే దాచుకోవాలి. బయటపడితే శత్రువులా చూస్తారు అని రుద్రాణి అంటుంది.

శత్రువులా ప్రవర్తిస్తే శత్రువులా చూస్తారు అని స్వప్న అంటుంది. దాంతో నన్ను నీ భార్య శత్రువులా చూస్తుంది. అదే నాకు బాధగా ఉంది అని రుద్రాణి అంటుంది. నీకు జరుగుతున్న అన్యాయం గురించి మా మామ్ ఫీల్ అయి ఓదార్చడానికి వచ్చాం అని రాహుల్ అంటాడు. నాకు రెచ్చగొట్టాడనికి వచ్చినట్లు అనిపిస్తుందని స్వప్న అంటుంది. ఒక్కటి మాత్రం నిజం నువ్ మా వారసుడుని మోస్తున్నావ్. ఇంట్లో సీమంతం జరిగితే చూసి మురిసిపోదామనుకున్నాం. ఎంత అత్త అయినా నాకు ఆ ఆశ ఉంటుంది కదా అని ఎమోషనల్‌గా మాట్లాడుతుంది రుద్రాణి.

రాహుల్ కూడా ఎమోషనల్‌గా మాట్లాడుతాడు. ఇదంతా చేసింది మీ చెల్లి కావ్యనే అని రుద్రాణి అంటుంది. హో అనుకున్నాను. అటు ఇటు తిరిగి కావ్య దగ్గరికే వస్తావని అని స్వప్న అంటుంది. డొంక తిరగడం ఏంటీ. ఇదంతా చేసింది కావ్యే కదే. ఇంట్లో ఆస్తి దేనికోసం ఫైట్ చేస్తున్నాం. మనకోసం. మాకు వస్తే నీక్కూడా వచ్చినట్లే కదా. అలా వస్తే నీ సీమంతం గ్రాండ్‌గా చేసేవాళ్లం కదా. రేపు నీ డెలీవరీ కూడా పెద్ద హాస్పిటల్‌లో చేశాం. అక్షరభ్యాసం ఇంకా చాలా ఉన్నాయి. అన్ని గ్రాండ్‌గా చేసేవాళ్లం అని రుద్రాణి, రాహుల్ ఎక్కిస్తారు.

గవర్నమెంట్ ఆస్పత్రిలో

అన్ని కావ్య చేతిలోనే ఉన్నాయి. ఏం చేస్తాం. ఇంత జరిగినా నీ చెల్లికే సపోర్ట్ చేస్తున్నావ్. కాపాడుతున్నా మమ్మల్ని శత్రువులా చూస్తున్నావ్ అని రుద్రాణి అంటుంది. పోనిలే మామ్ ఎవరేంటో తెలుసుకునేంత చిన్నపిల్ల కాదు కదా. ఎక్కువ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని రాహుల్ అంటాడు. సీమంతం ఖర్చు తగ్గించడానికి పుట్టింట్లో ప్లాన్ చేసింది కావ్య. రేపు డెలివరీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేయిస్తుంది. నువ్వే బాగా ఆలోచించుకో అని రుద్రాణి అంటుంది.

దాంతో స్వప్న ఆలోచిస్తుంది. అనుకుంది సాధించాం అని చూసుకుని వెళ్లిపోతారు రుద్రాణి, రాహుల్. బయటకెళ్లాక ఇప్పుడు ఇక్కడ నిప్పు రాజేశాం. రేపు అక్కడ మొత్తం తగలెట్టేద్దాం అని రుద్రాణి అంటుంది. మరుసటి రోజు ఉదయం కనకం ఇంట్లో స్వప్న సీమంతం ఏర్పాటు జరుగుతుంటాయి. కాలు విరిగిన కుర్చీ ఉంటుంది. దాన్ని తీసేయమని శీను అంటే.. కనకం ఉండని అంటుంది. దాంట్లో కూర్చుంటే నడుం విరుగుద్దని అతను అంటాడు.

మనకు అలాంటి శత్రువులు ఎవరున్నాబ్బా అని రుద్రాణిని గుర్తు చేసుకుంటుంది కనకం. దాంట్లో రుద్రాణి కూర్చునేలా ప్లాన్ చేద్దామనుకుని ఇది ఇక్కడే ఉండాలి. చూడటానికి బాగుండేందుకు దానిపై శాలువ కప్పుతుంది కనకం. దాంతో విరిగినట్లు కనిపించదు. మహారాణి చెయిర్‌లా ఉందిగా అని కనకం అంటుంది.

ఇంతలో కృష్ణమూర్తి వచ్చి ప్లాస్టిక్ పళ్లు ఏంట్రా అని అడుగుతాడు. ఉన్నంతలో చేయమంటే పరువు పోయేలా చేస్తున్నావ్. నీ కక్రుత్తి వల్లి మాట వచ్చిందంటే ఊరుకునేది లేదు అని కనకంకు వార్నింగ్ ఇచ్చి విరిగిన కుర్చీలో కూర్చోబోతుంటాడు కృష్ణమూర్తి.

పేదరికానికి కేరాఫ్ అడ్రస్‌లా

దాంతో కనకం, శీను ఇద్దరు అరుస్తారు. భయపడి కూర్చోడు కృష్ణమూర్తి. ఆగండి, దీంట్లో కూర్చోకండి. అది తర్వాత చెబుతాను అని అంటుంది. ఇంతలో కారులల్లో దుగ్గిరాల కుటుంబం వస్తుంది. స్వప్న అందం గురించి కావ్య పొగుడుతుంది. నా కోడలు అందంగానే ఉంది కానీ, నువ్వే పేదరికానికి కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తున్నావ్ అని రుద్రాణి అంటుంది.

దివాళ తీసినట్లు, అప్పుల పాలైనట్లు, అసలు నగలే లేనట్లు ఆ బోసి మెడతో వచ్చావేంటీ. మా పరువు తీయడానికా అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో రాజ్, కావ్య ఇద్దరు చూసుకుంటారు. ఏంటీ కావ్య ఇది నేను నీకిచ్చిన నగలు ఉన్నాయి కదా. అవి వేసుకుని రావొచ్చు కదా అని అపర్ణ అంటుంది. దాంతో రుద్రాణికి డౌట్ వస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

తదుపరి వ్యాసం