తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Serial: బ్రహ్మముడి- తల్లి విడాకులతో దిగొచ్చిన రాజ్- అత్తింటికి కావ్య- రేపటికల్లా తీసుకొస్తానన్న ఇగో మాస్టర్!

Brahmamudi Serial: బ్రహ్మముడి- తల్లి విడాకులతో దిగొచ్చిన రాజ్- అత్తింటికి కావ్య- రేపటికల్లా తీసుకొస్తానన్న ఇగో మాస్టర్!

Sanjiv Kumar HT Telugu

01 December 2024, 7:23 IST

google News
    • Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో పనిమనిషి స్టెల్లా అడుగుపెడుతుంది. ఆమెకు ఎలాంటి వంటలు చేయాలో దుగ్గిరాల కుటుంబం లిస్ట్ చెబుతుంది. సుభాష్‌కు అపర్ణ విడాకుల నోటీసు పంపించిటన్లు రాజ్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. అపర్ణను రేపటికల్లా ఇంటికి తీసుకొస్తానని రాజ్ అంటాడు.
బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్

Brahma Mudi Serial Latest Episode: బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌లో దుగ్గిరాల ఇంటికి కావ్య రావడాన్ని, వంట తేవడాన్ని తట్టుకోలేని రాజ్ కొత్త పనిమనిషిగా స్టెల్లా అనే అందమైన అమ్మాయిని పనిలో పెడతాడు. స్టెల్లా పేరు వినగానే రాహుల్ తెగ ఆతృతగా ఎదురుచూస్తుంటాడు.

స్టైలిష్‌గా పనిమనిషి స్టెల్లా

ధాన్యలక్ష్మీకి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో ప్రకాశం కావాలనే ఎప్పుడు వస్తుంది స్టెల్లా అని చొంగకార్చినట్లు బిహేవ్ చేస్తాడు. దాంతో ధాన్యలక్ష్మీ వారిస్తుంది. ఏంటీ తెగ ఆతృతగా ఉన్నారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలోనే కారులో చాలా స్టైల్‌గా ఒకామే వస్తుంది. స్లీవ్‌లెస్ టీ షర్ట్‌, కళ్లకు బ్లాక్ షేడ్స్ పెట్టుకుని ఎంతో స్టైల్‌గా వస్తున్న ఆ అమ్మాయిని చూసి పనిమనిషి స్టెల్లా అనుకుని చూస్తారు.

వంటల లిస్ట్ చెప్పి

స్టెల్లా అందానికి అంతా ఫిదా అయిపోతారు. ఆమె రాగానే అంతా వంటల గురించి డిస్కషన్ పెడతారు. ఎలాంటి వంటలు వండుతావ్, స్టార్ హోటల్‌లో చెఫ్ అంటే కాంటినెంటల్ వంటి అన్ని రకాల వంటలు వచ్చు కదా అని రుద్రాణితోపాటు మిగతా వారు వారికి కావాల్సిన వంటకాల లిస్ట్ చెబుతారు. కానీ, తను పనిమనిషి స్టెల్లా కాదని, లాయర్ అని చెప్పినట్లు తెలుస్తోంది.

విడాకులు పంపించావా

తను వచ్చింది వంట వండటానికి కాదని, విడాకుల పేపర్స్ ఇవ్వడానికి అని చెప్పినట్లు సమాచారం. దాంతో ఆ విడాకులు పేపర్స్ తనకు కావ్య పంపించిందేమో అనుకున్న రాజ్ అడుగుతాడు ఇక్కడే ఉండే డివోర్స్ పంపించావా.. నాకు కావాల్సింది అదే. నేనే విడాకులు ఇస్తాను అని రాజ్ అంటాడు. దాంతో నేను ఎందుకు పంపిస్తాను. ఆ విడాకులు నేను పంపించలేదు అని కావ్య చెబుతుంది.

సుభాష్‌కు డివోర్స్

కావ్య అలా చెప్పగానే ఇంట్లో అందరిముందు ఆ విడాకుల పేపర్స్ రాజ్ చూస్తాడు. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏముందిరా అందులో, అంతలా షాక్ అయ్యావ్ అని తండ్రి సుభాష్ అడుగుతాడు. మమ్మీ నీకు విడాకులు ఇస్తున్నట్లు నోటీస్ పంపించింది డాడీ అని రాజ్ చెబుతాడు. దాంతో ఇంట్లో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు.

కావ్యనే కారణమంటూ

పక్కనే ఉన్న కావ్య అత్తయ్య గారు మావయ్య గారికి విడాకులు ఇవ్వడం ఏమిటి అని అయోమయంగా అడుగుతుంది. దానికి షటప్ అని కావ్యపై కోపంగా అరుస్తాడు రాజ్. మీ ఇంట్లో అంతా కలిసి మా మమ్మీకి ఏం నూరిపోశారు అని కావ్యపై ఫైర్ అవుతాడు. కనకం, కావ్య కావాలనే తన తల్లిని ఇంటికి పిలిపించుకుని లేనిపోనివి చెప్పి ఇలా చేయిస్తున్నారని, దీనంతటికి కారణం కావ్యనే అని రాజ్ నిందిస్తాడు. దానికి రాజ్‌కు రుద్రాణి సపోర్ట్ చేస్తూ మరింత ఆజ్యం పోస్తుంది.

ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది

కానీ, అంతలోనే రాజ్ మాటలను తండ్రి సుభాష్ అడ్డుకుంటాడు. ఎవరెలా పోయినా నాకు సంబంధం లేదు. నాకు నా భార్య ముఖ్యం. జీవితాంతం తోడు ఉండాల్సిన నా భార్యని ఎవరి కోసం నేను దూరం చేసుకోదుచుకోలేదు అని సుభాష్ ఆవేశంగా చెబుతాడు. దాంతో రాజ్ దిగొస్తాడు. రేపటికల్లా మా అమ్మను ఈ ఇంటికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని రాజ్ చెబుతాడు.

దిగొచ్చిన రాజ్

అయితే, తల్లి విడాకులతో రాజ్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. అపర్ణను ఇంటికి తీసుకురావాలంటే కావ్యను కూడా భార్యగా ఒప్పుకుని దుగ్గిరాల ఇంటికి తీసుకురావాలి. తండ్రి కోసం కావ్యను అత్తింటికి తీసుకొస్తాడని అనిపిస్తుంది. లేదా మరేదైనా ప్లాన్ రాజ్ వేస్తాడని అనుమానం వస్తోంది. అపర్ణ విడాకుల నోటీసు పంపించినట్లే కావ్యకు రాజ్ కూడా డివోర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

తదుపరి వ్యాసం