తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hina Khan Breast Cancer: స్టార్ హీరోయిన్‌కు బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ మహమ్మారిని జయిస్తానంటూ ఎమోషనల్ పోస్ట్

Hina Khan breast cancer: స్టార్ హీరోయిన్‌కు బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ మహమ్మారిని జయిస్తానంటూ ఎమోషనల్ పోస్ట్

Hari Prasad S HT Telugu

Published Jun 28, 2024 02:15 PM IST

google News
  • Hina Khan breast cancer: స్టార్ హీరోయిన్ హీనా ఖాన్ స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతోందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడిస్తూ ఈ మహమ్మారిని జయిస్తానని చెప్పడం విశేషం.

స్టార్ హీరోయిన్‌కు బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ మహమ్మారిని జయిస్తానంటూ ఎమోషనల్ పోస్ట్

స్టార్ హీరోయిన్‌కు బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ మహమ్మారిని జయిస్తానంటూ ఎమోషనల్ పోస్ట్

Hina Khan breast cancer: ప్రముఖ నటి, సీరియల్స్, ఇండియన్ ఐడల్, బిగ్ బాస్ లాంటి షోలు, సినిమాలు చేసిన హీనా ఖాన్ క్యాన్సర్ తో బాధపడుతోంది. అది కూడా స్టేజ్ 3 కావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కొన్నాళ్లుగా తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై ఆమె శుక్రవారం (జూన్ 28) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.


హీనా ఖాన్‌కు క్యాన్సర్

క్యాన్సర్ మహమ్మారి జీవితాలను కబళించే ప్రమాదకరమైన వ్యాధి. దీని పేరు వింటే ఎవరైనా వణికిపోతారు. అందులోనూ సీరియల్స్, షోలు, సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన వారికి కూడా ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధి రావడం అనేది అభిమానులకు ఆందోళన కలిగించేదే. తాజాగా బాలీవుడ్ నటి హీనా ఖాన్ కూడా స్టేజ్ రొమ్ము క్యాన్సర్ బారిన పడింది.

అయితే తాను బాగానే ఉన్నట్లు తెలిపింది. "అందరికీ నమస్కారం. ఈ మధ్య వచ్చిన కొన్ని పుకార్ల విషయంలో నేను మీ అందరితో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నాకు స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఇంతటి కష్టకాలంలోనూ నేను బాగానే ఉన్నానని మీకు హామీ ఇస్తున్నాను. ఈ మహమ్మారిని జయించడానికి నేను చాలా పూర్తి శక్తితో కట్టుబడి ఉన్నాను. ఇప్పటికే చికిత్స కూడా ప్రారంభమైంది. దీని నుంచి బయటపడి బలంగా బయటకు రావడానికి చేయాల్సినవన్నీ చేస్తాను" అని హీనా ఖాన్ చెప్పింది.

మీ ఆశీర్వాదం, ప్రేమ కావాలి

ఈ కష్టకాలంలో అందరూ తనకు అండగా ఉండాలని కోరింది. "ఈ కష్టకాలంలో మీ మద్దతు నాకు కావాలి. మీ ప్రేమ, ఆశీర్వాదం కావాలి. మీ వ్యక్తిగత అనుభవాలు, సలహాలు ఈ ప్రయాణంలో నాకు ఎంతో అవసరం. నేను, నా కుటుంబం, నా శ్రేయోభిలాషులంతా ఈ విషయంపై సానుకూలంగానే ఉంటాము. ఆ దేవుడి దయతో నేను దీనిని అధిగమించి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానన్న నమ్మకం ఉంది. మీ ఆశీర్వాలు, ప్రేమ నాకు కావాలి" అని ఆమె చెప్పింది.

హీనా ఖాన్ 2008లో ఇండియన్ ఐడల్ లో కంటెస్టెంట్ గా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్, షోస్, సినిమాలు కూడా చేసింది. బిగ్ బాస్ 10, బిగ్ బాస్ 12, బిగ్ బాస్ ఓటీటీ, బిగ్ బాస్ 15లలోనూ పాల్గొంది. ఆమెకు క్యాన్సర్ అన్న వార్త తెలియగానే అభిమానులు ఆమె బాగుండాలని ప్రార్థిస్తున్నారు. హీనాకు సందేశాలు పంపిస్తున్నారు.