తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu Trp: అన్ని రికార్డులు బ్రేక్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ నైట్.. అదిరిపోయే టీఆర్పీ

Bigg Boss 8 Telugu TRP: అన్ని రికార్డులు బ్రేక్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ నైట్.. అదిరిపోయే టీఆర్పీ

Hari Prasad S HT Telugu

12 September 2024, 20:28 IST

google News
    • Bigg Boss 8 Telugu TRP: బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ నైట్ అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. రికార్డు వ్యూయింగ్ మినట్స్ తో ఈ రియాల్టీ షో దూసుకెళ్లింది. ఈ విషయాన్ని షో హోస్ట్ అక్కినేని నాగార్జున గురువారం (సెప్టెంబర్ 12) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
అన్ని రికార్డులు బ్రేక్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ నైట్.. అదిరిపోయే టీఆర్పీ
అన్ని రికార్డులు బ్రేక్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ నైట్.. అదిరిపోయే టీఆర్పీ

అన్ని రికార్డులు బ్రేక్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ నైట్.. అదిరిపోయే టీఆర్పీ

Bigg Boss 8 Telugu TRP: బిగ్ బాస్ 8 తెలుగు రియాల్టీ షో తొలి రోజే టీఆర్పీ రికార్డులు బ్రేక్ చేసినట్లు ఈ షో హోస్ట్ నాగార్జున వెల్లడించాడు. సెప్టెంబర్ 1న ఈ కొత్త సీజన్ గ్రాండ్ లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ లాంచ్ నైట్ కు అదిరిపోయే టీఆర్పీ వచ్చినట్లు నాగ్ చెప్పాడు. ఏకంగా వందల కోట్ల నిమిషాల వ్యూయింగ్ మినట్స్ నమోదు చేయడం విశేషం.

బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ నైట్ టీఆర్పీ

బిగ్ బాస్ 8 తెలుగు షో లాంచ్ నైట్ కు వచ్చిన టీవీఆర్ ను గురువారం (సెప్టెంబర్ 12) తన ఎక్స్ అకౌంట్ ద్వారా నాగార్జున వెల్లడించగా.. అదే ట్వీట్ ను స్టార్ మా కూడా రీట్వీట్ చేసింది. ఈ రియాల్టీ షో టీఆర్పీ విషయంలో అన్ని రికార్డులను బ్రేక్ చేసినట్లు అతడు చెప్పాడు.

"590 కోట్ల నిమిషాల రికార్డు బ్రేకింగ్ వ్యూయింగ్.. ది పవర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ తెలుగు 8 వ్యూయింగ్ మినట్స్, రేటింగ్స్ లో రికార్డులను తిరగరాసింది. బిగ్ బాస్ కొత్త ఎత్తులకు వెళ్లడంలో మీరు చూపించిన ప్రేమకు నేను చాలా థ్రిల్ గా, గౌరవంగా ఫీలవుతున్నాను. ఎంటర్టైన్మెంట్ లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాం. డ్రామా, ఎక్సైట్‌మెంట్, మరచిపోలేని క్షణాల కోసం బిగ్ బాస్ తెలుగు 8 స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లలో చూస్తూనే ఉండండి" అనే క్యాప్షన్ తో నాగార్జున ఈ అప్డేట్ ఇచ్చాడు.

బిగ్ బాస్ తెలుగు 8 లాంచ్ నైట్ లో ఏకంగా 18.9 టీవీఆర్ సాధించినట్లు కూడా ఈ సందర్భంగా అతడు చెప్పాడు. ఓ ప్రత్యేకమైన పోస్టర్ కూడా స్టార్ మా రిలీజ్ చేసింది. బిగ్ బాస్ తెలుగు 8 షో వీక్ డేస్ లో ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు, వీకెండ్స్ లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుండగా.. హాట్‌స్టార్ ఓటీటీలో మాత్రం 24 గంటలూ చూసే వీలుంది.

బిగ్ బాస్ 8 తెలుగు ఇలా..

బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే. వీళ్లలో తొలి వారమే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. ఈసారి షో గొడవలతో మరింత రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్లకు కొత్త కొత్త టాస్క్ లతో షోని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వీకెండ్ మరో కంటెస్టెంట్ కూడా హౌజ్ వీడనున్నారు. ప్రతి వీకెండ్ షోలో నాగార్జున వస్తాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే నాగార్జున ప్రస్తుతం కుబేర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ధనుష్, రష్మిక మందన్నా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి నా సామి రంగా మూవీతో ప్రేక్షకులను పలకరించిన నాగ్.. వచ్చే ఏడాది కుబేరతో రానున్నాడు.

తదుపరి వ్యాసం