Bigg Boss 6 Telugu Episode 35: బాలాదిత్య, ఆదిరెడ్డి, ఫైమా సేఫ్ - శ్రీసత్య పైశాచిక ఆనందం
09 October 2022, 10:11 IST
Bigg Boss 6 Telugu Episode 35: ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి ఆదిరెడ్డి, ఫైమా, బాలాదిత్య సేఫ్ అయ్యారు. హౌజ్‌మేట్స్‌లో నాగార్జున ఆడించిన హిట్, ఫ్లాప్ గేమ్ సరదాగా సాగింది.
శ్రీసత్య
Bigg Boss 6 Telugu Episode 35: శనివారం వీకెండ్ ఎపిసోడ్ ఆరంభంలో బాలాదిత్య తో టగ్ ఆఫ్ వార్ టాస్క్‌లో జరిగిన గొడవకు సంబంధించి అతడితో మరోసారి వాదనకు దిగింది గీతూ. తానను లయర్ అని పిలిచినందుకు హర్ట్ అయినట్లు బాలాదిత్య చెప్పాడు. గీతూ మాత్రం తాను లాయర్ అని అన్నానని చెప్పింది. ఆ తర్వాత తనకు ఫ్యామిలీ తప్ప ఎవరూ అవసరం లేదని, తన లైఫ్ నుంచి ఎవరు వెళ్లిపోయినా ఇబ్బంది పడనని అర్జున్ కళ్యాణ్‌తో శ్రీసత్య చెబుతూ కనిపించింది. ఆమె మాటలకు నీ సైడ్ నుంచి ఇక నేను ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయను అంటూ అర్జున్ చెప్పాడు. తన మనసు మారదని శ్రీసత్య గట్టిగా అతడితో చెప్పింది.
కెప్టెన్‌గా మారిన తర్వాత రేవంత్ రూల్స్ మాట్లాడటం బాగాలేదని శ్రీసత్య అతడితో వాదనకు దిగింది. వారు మాట్లాడుతుండగా అర్జున్ మధ్యలోకి రావడంతో అతడిపై రేవంత్ సీరియస్ అయ్యాడు. తాను పిలిస్తే ఎవరైనా రావాల్సిందే ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకూడదని ఇనాయాకు రేవంత్ వార్నింగ్ ఇచ్చాడు.
రేవంత్‌కు నాగార్జున క్లాస్...
కెప్టెన్ అనేవాడు కాన్‌ఫ్లిక్ట్ లేకుండా అందరితో కలిసిపోవాలని, కాన్‌ఫ్లిక్ట్ సృష్టించవద్దని రేవంత్‌కు నాగార్జున సూచించాడు. కెప్టెన్‌గా ఎన్ని మార్కులు వేసుకుంటావని కీర్తిని నాగార్జున అడిగాడు. ఆమె యాభై మార్కులు మాత్రమే వేసుకుంటానని చెప్పింది. కీర్తి కెప్టెన్సీపై ఆదిరెడ్డిని ఒపినియన్ అడిగాడు నాగార్జున. కెప్టెన్సీ టాస్క్ కోసం రాజ్‌ను స్పెషల్‌గా ఎంపిక చేసుకోవడానికి రీజన్ ఏమిటని నాగార్జున.. కీర్తిని అడిగాడు. ఆమె చెప్పిన రీజన్స్‌తో నాగార్జున కన్వీన్స్ కాలేదు. పదే పదే అదే ప్రశ్న అడగటంతో రాజ్‌కు, తనకు మధ్య ఏం లేదని కీర్తి సమాధానం చెప్పింది. సుదీప అందరిపై బాసిజం చేస్తుందనే విషయంలో ఓటింగ్ పెట్టగా యునానమస్‌గా ఓటు వేశారు.
హిట్ ఫ్లాప్ గేమ్
హౌజ్‌మేట్స్‌తో హిట్, ఫ్లాప్ అనే గేమ్ ఆడించాడు నాగార్జున. ఇద్దరిని బోన్‌లలో నిలబెట్టి తాము ఎందుకు హిట్టో, ఎదుటివారు ఎందుకు ఫ్లాప్ అనుకుంటున్నారో చెప్పమని నాగార్జున అడిగారు. తొలుత ఇనాయా, సూర్య వచ్చారు. తొలివారంలో ఇనాయాలో జెన్యూనిటీ కనిపించలేదని, ఇప్పటికీ ఇనాయాను తాను అర్థం చేసుకోలేకపోతున్నానని సూర్య అన్నాడు. ఒక్కోసారి చాలా క్యూట్‌గా ఉంటుందని, అప్పుడప్పుడు మాట్లాడితేనే కసురుకుంటుందని సూర్య చెప్పాడు. తాను అన్ని కలిపిన కంప్లీట్ ప్యాకేజ్ అని ఇనాయా అన్నది. ఫస్ట్ త్రీ వీక్స్‌లో సూర్య సరిగా ఆడలేదని, ఇప్పుడే అతడి గేమ్‌లో స్పిరిట్ కనిపిస్తుందని ఇనాయా తెలిపింది. ఈ విషయంలో ఓటింగ్ పెట్టగా సూర్య హిట్ అని, ఇనాయా ఫ్లాప్ అని హౌజ్‌మేట్స్ పేర్కొన్నారు.
ఆదిరెడ్డి హిట్ - గీతూ ఫ్లాప్...
ఆ తర్వాత ఆదిరెడ్డి, గీతూ వచ్చారు. ఆడిరెడ్డి స్ట్రాటజిక్‌గా గేమ్ ఆడుతాడని, కానీ ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవుతుందని గీతూ చెప్పింది. ఆ రెండింటిని మాత్రం తాను బ్యాలెన్స్ చేసుకుంటానని గీతూ అన్నది. గీతూ మాటలతో ఆది ఏకీభవించలేదని అన్నాడు. ఇది కామెడీ షో కాదని అన్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తే కెప్టెన్ కాలేరని, ఆట ఆడితేనే గెలుస్తామని, తాను కెప్టెన్ అయ్యానని, గీతూ మాత్రం ఇప్పటివరకు కెప్టెన్ కాలేదని ఆదిరెడ్డి పేర్కొన్నాడు. ఈ విషయంలో ఓటింగ్ పెట్టగా ఆది హిట్ అని గీతూ ఫ్లాప్ అని కంటెస్టెంట్స్ పేర్కొన్నారు.
తాను ఫ్లాప్ అని ఒప్పుకున్న చంటి...
ఆ తర్వాత చంటి, సుదీప వచ్చారు. తాను హిట్ కాదని చంటి తనకు తానే ఒప్పుకున్నాడు. నాలుగు వారాలు గేమ్ సరిగా ఆడలేదని అన్నాడు. అర్జున్, వాసంతి బోనులోకి వచ్చారు. బిగ్‌బాస్ ఇచ్చే ప్రతి రూల్‌ను తాను తప్పకుండా పాటించానని వాసంతి చెప్పింది. ఎవరితో తనకు గొడవలు లేవని అందుకే తాను హిట్ చెప్పింది వాసంతి. ప్రతి గేమ్‌లో అర్జున్ త్యాగాలు చేయడం అలవాటు అయిపోయిందని అందుకే అతడు ఫ్లాప్ అని పేర్కొన్నది. ట్రాయాంగిల్ లవ్‌స్టోరీలో ఇరుక్కుపోవడం వల్లే అర్జున్ ఫ్లాప్ అయ్యాడా అని వాసంతిని నాగార్జున అడిగాడు. అందుకు సత్య వల్లే అతడు సరిగా ఆడలేదని వాసంతి చెప్పింది.
అర్జున్ కళ్యాణ్‌కు శ్రీసత్య ఓటు..
గేమ్స్‌లో వాసంతికి సరైన అవకాశాలు రాలేదని అర్జున్ కళ్యాణ్ అన్నాడు. అర్జున్ కళ్యాణ్, వాసంతి లలో ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ అనే విషయంలో కేవలం శ్రీసత్యను మాత్రమే ఓటు వేయమని నాగార్జున అన్నాడు. అర్జున్ కళ్యాణ్ హిట్ అని శ్రీసత్య చెప్పింది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ ఓటింగ్‌లో వాసంతి హిట్, అర్జున్ ఫ్లాప్ అని వచ్చింది. ఆ తర్వాత ఇచ్చిన బెలూన్ టాస్క్‌లో ఆదిరెడ్డి సేఫ్ అయ్యాడు.
ఫైమా సేఫ్...
హిట్ ఫ్లాప్ టాస్క్‌లో బాలాదిత్య, రాజ్ వచ్చారు. అందులో బాలాదిత్య హిట్ అని, రాజ్ ఫ్లాప్ అని వచ్చింది. ఫైమా, మరీనాలో ఫైమా ఫ్లాప్, మెరీనా హిట్ అని వచ్చింది. ఆ తర్వాత రోహిత్ ఫ్లాప్, కీర్తి హిట్ అని కంటెస్టెంట్స్ తేల్చారు. కీర్తి చిన్న చిన్న విషయాలకు ఎమోషనల్ అవుతుందని రోహిత్ అన్నాడు.ఆ తర్వాత ఇచ్చిన బర్త్‌డే క్యాప్ టాస్క్‌లో ఫైమా సేఫ్ అయ్యింది.
పైశాచిక ఆనందం పొందుతున్న శ్రీసత్య...
శ్రీసత్య శ్రీహాన్ బోనులోకి వచ్చారు. అర్జున్‌ను రెచ్చగొట్టి, పైశాచిక ఆనందం పొందుతుందని శ్రీహాన్ అన్నాడు. శత్రువులను కూడా కలుపుకుపోయే తత్వం తనలో ఉంటుందని,ఆ పాజిటివ్ నెస్ వల్లే తాను హిట్ అని శ్రీహాన్ చెప్పాడు. హౌజ్‌లో తనకు అనిపించింది మాత్రమే చేస్తానని, ఎదుటి వారిని హర్ట్ చేయనని శ్రీసత్య పేర్కొన్నది. హౌజ్‌మేట్స్ దృష్టిలో సత్య వల్లే అర్జున్ గేమ్ పోతుందనే అపోహ ఉందని, అందువల్లే అతడిని రెచ్చగొడుతున్నానని పేర్కొన్నది. ఇందులో శ్రీసత్య ఫ్లాప్, శ్రీహాన్ హిట్ అని ఓటు వేశారు. ఈ సందర్భంగా శ్రీసత్య, శ్రీహాన్ కలిసి చేసిన డ్యాన్స్ వీడియోను చూపించారు. ఆ సమయంలో అర్జున్ కళ్యాణ్ ఫీల్ అయినట్లుగా ఈ వీడియోలో కనిపించాడు.
రేవంత్ హిట్...
ఆ తర్వాత హిట్‌ఫ్లాప్ గేమ్‌లో రేవంత్ ఒక్కడే మిగిలిపోవడంతో హిట్, ఫ్లాప్ విషయంలో కంటెస్టెంట్స్ ఒపినియన్ అడిగాడు. రేవంత్‌లో కోపం ఎక్కువగా ఉంటుందని, అది తప్ప గేమ్ బాగా ఆడుతాడని అందరూ అన్నారు. హిట్ అని ఏకగ్రీవంగా తేల్చారు. ఆ తర్వాత ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ టాస్క్‌లో బాలాదిత్య సేఫ్ అయ్యాడు.