తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna Dabidi Dibidi Dance: ఊర్వశితో బాలయ్య మరోసారి దబిడిదిబిడి.. సక్సెస్ పార్టీలో హుషారుగా స్టెప్స్.. వీడియో వైరల్

Balakrishna Dabidi Dibidi Dance: ఊర్వశితో బాలయ్య మరోసారి దబిడిదిబిడి.. సక్సెస్ పార్టీలో హుషారుగా స్టెప్స్.. వీడియో వైరల్

13 January 2025, 14:50 IST

google News
    • Balakrishna Dabidi Dibidi Dance: డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలకృష్ణ ఫుల్ జోష్ చూపారు. ఊర్వశి రౌతేలాతో మరోసారి దబిడి దిబిడి స్టెప్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Balakrishna Dabidi Dibidi Dance: ఊర్వశితో బాలయ్య మరోసారి దబిడిదిబిడి.. సక్సెస్ పార్టీలో హుషారుగా స్టెప్స్.. వీడియో వైరల్
Balakrishna Dabidi Dibidi Dance: ఊర్వశితో బాలయ్య మరోసారి దబిడిదిబిడి.. సక్సెస్ పార్టీలో హుషారుగా స్టెప్స్.. వీడియో వైరల్

Balakrishna Dabidi Dibidi Dance: ఊర్వశితో బాలయ్య మరోసారి దబిడిదిబిడి.. సక్సెస్ పార్టీలో హుషారుగా స్టెప్స్.. వీడియో వైరల్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రం మంచి ఓపెనింగ్ అందుకుంది. సంక్రాంతి సందర్భంగా ఆదివారం జనవరి 12న రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ డే రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటి దుమ్మురేపింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో మూవీ టీమ్ ఓ పార్టీ చేసుకుంది. ఫుల్ జోష్‍తో ఈ పార్టీ సాగింది. బాలకృష్ణ బాగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఊర్వశి రౌతేలాతో హుషారుగా డ్యాన్స్ చేశారు.

దబిడి దబిడి స్టెప్స్

డాకు మహారాజ్ చిత్రంలో దబిడి దిబిడి పాట పాపులర్ అయింది. బాలకృష్ణ, ఊర్వశి రౌతేలాతో ఉండే ఈ పాటలోని స్టెప్‍లపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే, సక్సెస్ పార్టీలో మళ్లీ దబిడి దిబిడి స్టెప్ వేశారు బాలయ్య. ఊర్వశి రౌతేలాతో చిందేశారు. దబిడి దిబిడి స్టెప్‍ను ఫుల్ జోష్‍తో చేశారు బాలకృష్ణ. ఈ వీడియో వైరల్‍గా మారింది.

దబిడి దిబిడి పాటలోని డ్యాన్స్‌పై విమర్శలు ఎక్కువగా వచ్చాయి. కొన్ని స్టెప్స్ అసభ్యంగా ఉన్నాయంటూ కొందరు అభ్యంతరాలు వక్తం చేశారు. ఇలా స్టెప్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌పై కొందరు నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయితే, ఆ స్టెప్‍లను మూవీ టీమ్ సమర్థించుకుంది. మొత్తంగా ఈ సాంగ్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడు సక్సెస్ మీట్‍లో మరోసారి దబిడి దిబిడి స్టెప్ వేశారు హీరో బాలకృష్ణ.

విశ్వక్, సిద్ధుకు ముద్దులు

యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా డాకు మహారాజ్ సక్సెస్ పార్టీకి హాజరయ్యారు. బాలయ్యకు అభినందనలు తెలిపారు. ఆ సమయంలో విశ్వక్‍, సిద్ధుకు బాలకృష్ణ ముద్దు పెట్టారు. వారు కూడా ఆయన ముద్దు పెట్టారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిద్ధు, విశ్వక్‍కు బాలకృష్ణతో మంచి సంబంధం ఉంది. ఆయనను ఎంతో అభిమానిస్తారు.

డాకు మహారాజ్ తొలి కలెక్షన్లు

డాకు మాహారాజ్ చిత్రానికి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుందని మూవీ టీమ్ వెల్లడించింది. బాలకృష్ణకు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా ఉంది.

డాకు మహారాజ్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. ఈ మూవీలో బాలకృష్ణతో పాటు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా కీరోల్స్ చేశారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలు నిర్మించిన ఈ మూవీకి.. థమన్ సంగీతం అందించారు.

తదుపరి వ్యాసం