తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ayodhya Seer Warns Sharukh Khan: షారుక్‌ఖాన్‌ను సజీవ దహనం చేస్తా: అయోధ్య సాధువు హెచ్చరిక

Ayodhya Seer warns Sharukh Khan: షారుక్‌ఖాన్‌ను సజీవ దహనం చేస్తా: అయోధ్య సాధువు హెచ్చరిక

HT Telugu Desk HT Telugu

21 December 2022, 19:22 IST

google News
    • Ayodhya Seer warns Sharukh Khan: షారుక్‌ఖాన్‌ను సజీవ దహనం చేస్తానంటూ అయోధ్య సాధువు హెచ్చరించడం దుమారం రేపుతోంది. అతని నెక్ట్స్‌ మూవీ పఠాన్‌ నుంచి వచ్చిన బేషరమ్‌ రంగ్‌ పాటపై ఇంకా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
బేషరమ్ రంగ్ పాటలో దీపికా, షారుక్ ఖాన్
బేషరమ్ రంగ్ పాటలో దీపికా, షారుక్ ఖాన్

బేషరమ్ రంగ్ పాటలో దీపికా, షారుక్ ఖాన్

Ayodhya Seer warns Sharukh Khan: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తన ముందుకు వస్తే సజీవ దహనం చేస్తానంటూ అయోధ్యకు చెందిన ఓ సాధువు హెచ్చరించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. షారుక్‌ నటించిన పఠాన్‌ మూవీ నుంచి వచ్చిన బేషరమ్‌ రంగ్‌ సాంగ్‌పై ఆ సాధువు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఇలాంటి హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.

ఈ పాటలో దీపికా పదుకోన్‌ డ్రెస్సింగ్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె కాషాయ రంగు బికినీ వేసుకోవడంపై కొందరు హిందూ మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అయోధ్యకు చెందిన సాధువు మహంత్‌ పరమహంస ఆచార్య కూడా ఇదే విషయంపై స్పందించారు. అయితే పఠాన్‌ మూవీ హీరో షారుక్‌ను ఆయన హెచ్చరించారు.

"బేషరమ్‌ రంగ్‌ పాట మేకర్స్‌ కాషాయ రంగును అవమానించారు. ఈ రంగు హిందూ మతానికి చెందినది. దీనిపై సనాతన ధర్మానికి చెందిన వ్యక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ షారుక్‌ ఖాన్‌ పోస్టర్‌ను మేము దహనం చేశాం. ఈ ఫిల్మ్‌ జిహాదీ షారుక్‌ ఖాన్‌ను నేరుగా కలిసే అవకాశం వస్తే అతన్ని సజీవ దహనం చేస్తాం" అని మహంత్‌ పరమహంస హెచ్చరించారు.

అంతేకాదు పఠాన్‌ మూవీని నిషేధించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఒకవేళ ఈ మూవీని రిలీజ్‌ చేస్తే థియేటర్లను ధ్వంసం చేస్తామని కూడా మహంత్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పఠాన్‌ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న హిందీతోపాటు తెలుగు, తమిళంలలో రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు బేషరమ్‌ రంగ్‌లో దీపికా డ్రెస్సింగ్‌పై సోషల్‌ మీడియాలో ఇప్పటికీ ట్రోలింగ్‌ నడుస్తోంది. ఈ పాట మొత్తం ఆమె బికినీల్లోనే కనిపించింది. ఆమె కాషాయ రంగు బికినీ, షారుక్‌ ఆకుపచ్చ రంగు డ్రెస్‌ వేసుకోవడంతో దానికి కొందరు మతం రంగు పులిమారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది.

తదుపరి వ్యాసం