Amaran OTT: ఓటీటీలో మొన్న రిలీజైన సాయి పల్లవి మూవీ.. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
02 November 2024, 16:15 IST
Amaran OTT Streaming: సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన లవ్, యాక్షన్, ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీలో శివ కార్తికేయన్ హీరోగా చేశాడు. మొన్న (అక్టోబర్ 31) థియేటర్లలో విడుదలైన అమరన్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేస్తే..
ఓటీటీలో మొన్న రిలీజైన సాయి పల్లవి మూవీ.. రెండు ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
Amaran OTT Release: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఎలాంటి గ్లామర్ షో లేకుండా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న అతికొద్దిమంది హీరోయిన్లలో ప్రముఖంగా సాయి పల్లవి గురించి చెప్పుకుంటారు. ఇక ఆమె నటించే సినిమాలపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అలాంటి సాయి పల్లవి రీసెంట్‌గా నటించిన మూవీ అమరన్.
ముకుంద్ వరదరాజన్ బయోగ్రఫీ
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన లవ్, యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషనల్ మూవీ అమరన్. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా అమరన్ సినిమాను బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కించారు.
శివ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా అమరన్ సినిమాను చిత్రీకరించారు. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివ కార్తికేయన్, ఆయన భార్య ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి రియల్ లైఫ్ క్యారెక్టర్ చేసింది.
నిర్మాతగా కమల్ హాసన్
అంతేకాకుండా అమరన్ సినిమాకు లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్‌పై అమరన్ సినిమాను నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది అమరన్ మూవీ.
అమరన్ మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ అదరగొడుతోంది. శివ కార్తికేయన్ కెరీర్‌లోనే ఓపెనింగ్ రోజున (రూ. 25 కోట్ల నెట్ కలెక్షన్స్) ఎన్నడు రాని అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది అమరన్ సినిమా. ఇక అమరన్ రెండు రోజుల్లో ఇప్పటికీ ఇండియాలో రూ. 40.65 కోట్ల నెట్ కలెక్షన్స్, వరల్డ్ వైడ్‌గా రూ. 80 కోట్ల వరకు వసూళ్లు సాధించి దూసుకుపోతోంది.
హిందీ అండ్ సౌత్ వెర్షన్స్
ఇలాంటి మంచి టాక్ తెచ్చుకుంటున్న అమరన్ ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అమరన్ మూవీ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతోంది. అమరన్ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రెండు ప్లాట్‌ఫామ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అమరన్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ వెర్షన్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది.
అలాగే, అమరన్ హిందీ వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. ఇక థియేట్రికల్ రిలీజ్‌కు నెల తర్వాత అంటే నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ మొదటి వారంలో అమరన్ ఓటీటీ రిలీజ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
అమరన్ ఓటీటీ రిలీజ్
అమరన్ సినిమాకు లాంగ్ రన్‌లో వచ్చే రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రకారం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌లో మార్పులు కూడా చేసే అవకాశం ఉంది. అయితే, అనుకున్నదానికంటే ముందుగా లేదా, ఆలస్యంగా ఓటీటీలోకి అమరన్ వచ్చే అవకాశం ఉంది. కానీ, అమరన్ ఓటీటీ రిలీజ్ డేట్‌కు రెండు మూడు రోజుల ముందే అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.