తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aha Ott: హారర్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ కథలు రాయగలరా? అయితే, ఆహా ఓటీటీ రైటర్స్ హంట్ మీకోసమే!

Aha OTT: హారర్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ కథలు రాయగలరా? అయితే, ఆహా ఓటీటీ రైటర్స్ హంట్ మీకోసమే!

Sanjiv Kumar HT Telugu

10 November 2024, 10:27 IST

google News
  • Aha OTT Writers Hunt: ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు రైటర్స్ హంట్ మొదలుపెట్టింది. హారర్, థ్రిల్లర్, కామెడీ, డ్రామా, రొమాన్స్ అండ్ యాక్షన్ వంటి వివిధ జోనర్లలో కథలను రాసే రైటర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ విషయాన్ని ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి అధికారికంగా వెల్లడించారు.

హారర్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ కథలు రాయగలరా? అయితే, ఆహా ఓటీటీ రైటర్స్ హంట్ మీకోసమే!
హారర్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ కథలు రాయగలరా? అయితే, ఆహా ఓటీటీ రైటర్స్ హంట్ మీకోసమే!

హారర్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ కథలు రాయగలరా? అయితే, ఆహా ఓటీటీ రైటర్స్ హంట్ మీకోసమే!

Aha OTT Writers Hunt: విభిన్న కంటెంట్‌తో దూసుకుపోతోంది తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా. సినిమాలు, వెబ్ సిరీసులు రూపొందిస్తూ న్యూ టాలెంట్‌కు సపోర్ట్ అందిస్తోంది ఆహా సంస్థ. ఈ క్రమంలోనే ప్రతిభావంతులైన రచయితలను ప్రోత్సహించేందుకు టాలెంట్ హంట్‌ను ప్రవేశపెట్టింది ఆహా టీమ్.

టాలెంట్ హంట్ కార్యక్రమం

సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ కంపెనీస్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాస్ మూవీ మేకర్స్, డైరెక్టర్ సాయి రాజేష్ అమృత ప్రొడక్షన్స్ సహకారంతో ఈ రైటర్ హంట్‌ను ప్రకటించింది ఆహా ఓటీటీ. ఈ టాలెంట్ హంట్ ద్వారా ప్రతిభ గల రచయితలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టాలెంట్ హంట్ వివరాలను తెలిపే కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు.

అరవింద్ బాటలోనే ఆహా

ఈ కార్యక్రమంలో ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ.. "అల్లు అరవింద్ గారు ఎప్పుడూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పటికే పలువురు ఆయన ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అరవింద్ గారి బాటలోనే ఆహా పయణిస్తోంది" అని తెలిపారు.

స్క్రిప్ట్‌ను బట్టిన సినిమా, వెబ్ సిరీస్

"ఆహా ద్వారా యంగ్ టాలెంట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇది మరింతగా కొనసాగించేందుకే మాస్ మూవీ మేకర్స్ ఎస్‌కేఎన్, అమృత ప్రొడక్షన్స్ సాయి రాజేశ్ గారితో మేము రైటర్ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నాం. వారి స్క్రిప్ట్‌ను బట్టి సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు అందించే ప్రయత్నం చేస్తాం" అని ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని వెల్లడించారు.

కష్టానికి తగిన ఫలితం

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ.. "మిగతా భాషల్లో వచ్చిన వైవిధ్యమైన కథలు మన తెలుగులో ఎందుకు రావడం లేదనేది మాకు తరుచూ ఎదురయ్యే ప్రశ్న. తమకు తగినంత గుర్తింపు, కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదని చెప్పే రచయితలు కొందరితో నేను మాట్లాడాను. అందుకే ఎగ్జైట్ చేసే స్క్రిప్టులతో వచ్చే టాలెంటెడ్ రైటర్స్ కోసం ఒక వేదికగా ఈ టాలెంట్ హంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం" అని చెప్పారు.

మంచి అవకాశాలు

"ఆహా, అమృత ప్రొడక్షన్స్ సహకారంతో టాలెంటెడ్ రైటర్స్‌కు మంచి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిభావంతులైన రచయితలను ఈ టాలెంట్ హంట్‌కు ఆహ్వానిస్తున్నాం" అని బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ తెలిపారు.

వివిధ జోనర్స్

ఇదిలా ఉంటే, ఆహా ఓటీటీ రైటర్స్ టాలెంట్ హంట్‌లో పాల్గొనాలనుకునేవారు కామెడీ, థ్రిల్లర్, డ్రామా, హర్రర్, రొమాన్స్ అండ్ యాక్షన్ వంటి వివిధ జోనర్స్‌లో తమ రచనలను పంపించవచ్చు. మరిన్ని వివరాలు ఆహా ఓటీటీ, ఆహా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో చూడవచ్చు. కాబట్టి, అందమైన కథలు రాసే నైపుణ్యం ఉన్న వాళ్లు తమకు నచ్చిన జోనర్‌లో స్క్రిప్ట్ రెడీ చేసి ఆహా ఓటీటీకి పంపించి టాలెంట్ నిరూపించుకోవచ్చు.

ఆహా ఓటీటీ ఒరిజినల్స్

ఇదిలా ఉంటే, ఆహా ఓటీటీలో ఇటీవల తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఆపరేషన్ రావణ్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అలాగే, ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2, బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 4 స్ట్రీమింగ్ అవుతున్నాయి.

తదుపరి వ్యాసం