తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Father Dies: నటి సమంత ఇంట విషాదం.. ఆమె తండ్రి జోసెఫ్‌ ప్రభు కన్నుమూత

Samantha Father Dies: నటి సమంత ఇంట విషాదం.. ఆమె తండ్రి జోసెఫ్‌ ప్రభు కన్నుమూత

Galeti Rajendra HT Telugu

29 November 2024, 17:50 IST

google News
  • Samantha Ruth Prabhu father Dies: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించారు. 

సమంత
సమంత

సమంత

Samantha father Joseph Prabhu passes away: సీనియర్ హీరోయిన్ సమంత ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ప్రభు అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సమంతనే అభిమానులకి తెలియజేశారు. ‘‘నాన్నా.. మనం మళ్లీ కలిసేంత వరకూ’’ అని ఎమోషనల్‌గా సమంత రాసుకొచ్చారు. అలానే ఒక హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని కూడా యాడ్ చేశారు. జోసెఫ్‌ ప్రభు ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్న సమంత అభిమానులు.. ధైర్యంగా ఉండాలని భరోసాగా నిలుస్తున్నారు.

సమంత తండ్రి ఆంగ్లో ఇండియన్

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఒక ఆంగ్లో ఇండియన్. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ని తీర్చిదిద్దుకోవడంలో తన తండ్రి పాత్ర చాలా ఉందని ఇటీవల సమంత ఎమోషనల్‌గా గుర్తు చేసుకుంది. ఇప్పటి వరకూ జోసెఫ్ ప్రభు ఏం చేస్తుంటారు? ఎక్కడ ఉన్నారు? అనే విషయాన్ని సమంత గోప్యంగా ఉంచుతూ వచ్చింది. 

మరణానికి కారణాలేంటి? 

మలయాళి కుటుంబానికి చెందిన నినెట్ ప్రభుని అప్పట్లో జోసెఫ్ ప్రభు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సమంత హీరోయిన్‌గా ఎదిగే వరకూ జోసెఫ్ ప్రభు కుటుంబం మధ్యతరగతి జీవితం గడిపేదని.. సమంత స్టార్ హీరోయిన్‌గా మారిన తర్వాత తల్లిదండ్రులకి అన్ని సౌకర్యాల్ని కల్పించిదట. జోసెఫ్ ప్రభు మరణానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా.. గత కొన్ని రోజుల నుంచి జోసెఫ్ తన భార్యతో పాటు చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అక్కినేని ఫ్యామిలీ వెళ్తుందా? 

సమంత తండ్రి పార్థివ దేహాన్ని చూసేందుకు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఎవరూ వెళ్లకపోవచ్చు. డిసెంబరు 4న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం జరగనుండగా.. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హ‌ల్దీ పంక్షన్ ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. 

తదుపరి వ్యాసం