తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mrunal Thakur: మార్ఫింగ్ ఫొటోతో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కి కోపం తెప్పించిన నెటిజన్, చురకలు అంటిస్తూనే ఆఖర్లో ప్రశంసలు

Mrunal Thakur: మార్ఫింగ్ ఫొటోతో హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కి కోపం తెప్పించిన నెటిజన్, చురకలు అంటిస్తూనే ఆఖర్లో ప్రశంసలు

Galeti Rajendra HT Telugu

02 November 2024, 17:10 IST

google News
  • మృణాల్ ఠాకూర్‌ తనతో కలిసి దీపావళి చేసుకుంటున్నట్లు ఓ నెటిజన్ మార్ఫింగ్ ఫొటో పోస్ట్ చేశాడు. తొలుత ఆ ఫొటోపై సాప్ట్‌గానే రియాక్ట్ అయిన మృణాల్ గంటల వ్యవధిలోనే సీరియస్ అవుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందంటే? 

మృణాల్ ఠాకూర్
మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్

హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌‌ ఫొటోని మార్ఫింగ్ చేసిన ఓ నెటిజన్.. ఆమె ఆగ్రహానికి గురయ్యాడు. దీపావళి సందర్భంగా మృణాల్‌తో తాను పండగ చేసుకున్నట్లు ఎడిట్ చేసిన ఫొటోని ఓ నెటిజన్ పోస్ట్ చేయగా తొలుత లైట్ తీసుకున్న మృణాల్.. జస్ట్ ఒక కామెంట్‌తో సరిపెట్టింది. కానీ.. ఆ తర్వాత కాసేపటికే ఆ ఫొటోని తన అకౌంట్‌లో షేర్ చేస్తూ నెటిజన్‌కి గట్టిగానే చురకలు అంటించేసింది. మృణాల్ ఇలా చేయడానికి ఒక కారణం ఉంది.

ఏంటి బ్రదర్ ఇది?

అభిమాని మృణాల్‌తో కలిసి టపాసులు పేలుస్తున్నట్లు ఫొటో మార్ఫింగ్ చేశాడు. దాంతో తొలుత ఆ ఫొటోని చూసిన మృణాల్.. ఇది కరెక్ట్ కాదంటూ కామెంట్ చేసింది. కానీ.. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే తన అకౌంట్‌లో ఆ ఫొటోని చూపిస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. ‘‘బ్రదర్, మీరెందుకు తప్పుడు అభిప్రాయంతో ఇలా చేస్తున్నారు. మీరు చేస్తున్నది బాగుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కాదు కదా? ’’ అని చెప్పుకొచ్చింది. దానికి కారణం సదరు నెటిజన్ మృణాల్‌తో పాటు అప్పటికే ఒక్కో హీరోయిన్‌తో అలాంటి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి ఉండటమే.

నేను ఒక్కదాన్నే అనుకున్నా.. కానీ?

‘‘దయచేసి ఇలాంటివి ఆపండి. నిజమే.. ఆ ఫొటో మార్ఫింగ్‌కి నేను కామెంట్ చేశాను. కానీ మొదట నేను చూసినప్పుడు కేవలం నేను మాత్రమే అతనితో కలిసి దీపావళి చేసుకున్నట్లు అనిపించింది. కానీ అతని అకౌంట్‌లోకి వెళ్లి చూస్తే ప్రతి హీరోయిన్‌తో అతను ఫొటోలు, వీడియో మార్ఫింగ్ చేసినట్లు చూసి నా గుండె పగిలింది. చాలా బాధపడ్డాను’’ అని మృణాల్ చెప్పుకొచ్చింది.

‘‘కానీ నేను అతని ఎడిటింగ్ నైపుణ్యాలు చాలా బాగున్నాయి. అయితే అతను తన స్కిల్స్‌ను సరైన విషయాల కోసం ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను. నాలా ఇంకెవరినీ అతను బాధపెట్టడని ఆశిస్తున్నా’’ అంటూ మృణాల్ ఠాకూర్ ఆ వీడియోలో చురకలు అంటించింది.

మృణాల్ చేతిలో సినిమాలు

యాక్షన్ కామెడీ 'సన్ ఆఫ్ సర్దార్' సీక్వెల్‌లో ప్రస్తుతం అజయ్ దేవగణ్‌తో కలిసి నటిస్తున్న మృణాల్ ఠాకూర్.. వరుణ్ ధావన్‌తో ఓ పుల్ లెంగ్త్ కామెడీ సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది. అలానే హ్యూమా ఖురేషి సినిమా కూడా ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉంది.

సీతారామం సినిమాతో సౌత్‌లో మంచి పేరు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత నానితో కలిసి నాన్న, విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించింది. కానీ.. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర రాణించలేకపోయాయి. దాంతో సౌత్‌లో ప్రస్తుతం అవకాశాలు తగ్గగా.. మళ్లీ బాలీవుడ్‌పై మృణాల్ ఫోకస్ పెట్టింది.

తదుపరి వ్యాసం