తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sarath Babu : శరత్ బాబు వందల కోట్ల ఆస్తి ఎవరికి చెందుతుంది?

Sarath Babu : శరత్ బాబు వందల కోట్ల ఆస్తి ఎవరికి చెందుతుంది?

Anand Sai HT Telugu

28 May 2023, 6:04 IST

google News
    • Sarath Babu : ఇటీవలే సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఆయన ఆస్తులు చెన్నై, పొరుగున ఉన్న బెంగుళూరు, హైదరాబాద్‌తో సహా ఇతర నగరాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆస్తిపై చర్చ మెుదలైంది.
శరత్ బాబు
శరత్ బాబు

శరత్ బాబు

ప్రముఖ దక్షిణ భారత నటుడు శరత్ బాబు (71) సోమవారం (మే 22) కన్నుమూశారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆయన చెన్నై(Chennai)లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం ఆయన ఆత్మీయుల హృదయాల్లో శూన్యాన్ని మిగిల్చింది. శరత్ బాబు(Sarath Babu) నటన, వ్యక్తిత్వం ఆయన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయనకు భారీ ఆస్తులు ఉన్నాయి. చాలా ధనవంతుడు. ఆయన తండ్రి వీఎస్ఆర్ మూర్తి అప్పట్లో చెన్నైలో ప్రముఖ హోటల్ వ్యాపారి. నటుడు శరత్ అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ .

శరత్ బాబు(Sarath Babu) అందం, మంచి వ్యక్తిత్వం, పాత్రలకు జీవం పోసిన తీరు ప్రజల్లో గుండెల్లో ఎప్పుడూ నిలిచి ఉంటుంది. కె బాలచందర్ శిష్యుడిగా ఆయన సినిమాల్లోకి వచ్చారు. ఇక వెనుదిరిగి చూడలేదు. సినిమా(Cinema) రంగంలో రాణించాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కానీ అతని వ్యక్తిగత జీవితం కారణంగా పిల్లలు పుట్టలేదు. శరత్ బాబుకు ఏడుగురు తోబుట్టువులు. తన తోబుట్టువుల పిల్లలతో సాన్నిహిత్యం కలిగి ఉన్నారు.

శరత్ బాబు తోబుట్టువుల్లో నాల్గో వాడు అని అతడి సోదరుడు చెప్పారు. వారంతా చివరి వరకు ఐక్యంగా కలిసి ఉన్నారు. నటుడు శరత్ తన ఆస్తి పంపకాలపై వీలునామా రాశాడా? దాని గురించి మాత్రం కచ్చితంగా తెలియదు. అయితే అతడి అన్నయ్య మాత్రం ఆస్తిని తన తోబుట్టువులకే పంచుతామని చెబుతున్నాడు. ఇది మా కుటుంబ వ్యక్తిగత విషయమని, ఇతరులు తమను పట్టించుకోవద్దన్నారు.

శరత్ బాబు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌(Hyderabad)లో భారీగా ఆస్తులు కలిగి ఉన్నారని సమాచారం. అతడి అపార సంపద ఇప్పుడు క్రమపద్ధతిలో పదమూడు భాగాలుగా విభజించారట. ఈ భాగాలను అతడి సోదరులు, సోదరీమణుల పిల్లలకు పంపిణీ చేయవచ్చు. శరత్ బాబు (1951–2023) ఐదు దశాబ్దాల కెరీర్‌లో 200కి పైగా చిత్రాల్లో నటించారు.

శరత్ బాబుకి చిన్నతనంలో పోలీస్ ఆఫీసర్ కావాలని కోరిక. అయితే కాలేజ్ డేస్ లో సినిమాల వైపు ఆకర్షితుడై కలలు కనడం మొదలుపెట్టారు. శరత్ తన హోటల్ వ్యాపారం చూసుకోవాలని అతని తండ్రి కోరుకున్నాడు. కానీ శరత్ మాత్రం ఫ్యామిలీ బిజినెస్‌లోకి రావాలనుకోలేదు. కాలేజీలో చదువుతున్నప్పుడు సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోమని అందరూ సలహాలు ఇచ్చేవారు. కళాశాల నాటక బృందంలో చేరి, థియేటర్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి ఓ వెలుగు వెలిగారు.

తదుపరి వ్యాసం