Aadhi Pinisetty Sabdham Movie: పదమూడేళ్ల తర్వాత వైశాలి డైరెక్టర్‌తో ఆదిపినిశెట్టి సినిమా
14 December 2022, 10:33 IST
Aadhi Pinisetty Sabdham Movie: యంగ్ హీరో ఆదిపినిశెట్టి మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. శబ్దం పేరుతో హారర్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరంటే...
ఆదిపినిశెట్టి
Aadhi Pinisetty Sabdham Movie: వైశాలి సినిమాతో కెరీర్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు హీరో ఆదిపెనిశెట్టి. అగ్ర దర్శకుడు శంకర్ నిర్మాణంలో హారర్ క్రైమ్ థ్రిల్లర్‌గా 2009లో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. వైశాలి సినిమాకు అరివజగన్ దర్శకత్వం వహించాడు. దాదాపు పదమూడేళ్ల తర్వాత మరోసారి వైశాలి డైరెక్టర్ అరివజగన్‌తో ఆదిపినిశెట్టి ఓ సినిమా చేయబోతున్నారు.
ఈ సినిమాకు శబ్దం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హారర్ థ్రిల్లర్ కథాంశంతో శబ్దం సినిమా రూపొందబోతున్నట్లు ఆది పినిశెట్టి పేర్కొన్నాడు. బుధవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో చెవితో పాటు గబ్బిలాలు కనిపించడం ఆసక్తిని పంచుతోంది.
వైశాలికి మ్యూజిక్ అందించిన తమన్ శబ్దం సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం.
ఓ వైపు హీరోగా నటిస్తూనే విలన్‌గా కనిపిస్తున్నాడు ఆది పినిశెట్టి. ఈ ఏడాది రామ్ హీరోగా నటించిన ది వారియర్ సినిమాలో విలన్‌గా నటించాడు ఆదిపినిశెట్టి. ఇటీవలే తమిళ్ రాకర్స్ అనే వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడు దర్శకుడు అరివజగన్.