తెలుగు న్యూస్  /  క్రికెట్  /  కింగ్ కింగే.. కోహ్లి ప్రపంచ రికార్డు.. ఫస్ట్ క్రికెటర్ గా హిస్టరీ క్రియేట్.. మూడు ఫార్మాట్లలోనూ అన్‌బిలీవ‌బుల్‌ ఫీట్

కింగ్ కింగే.. కోహ్లి ప్రపంచ రికార్డు.. ఫస్ట్ క్రికెటర్ గా హిస్టరీ క్రియేట్.. మూడు ఫార్మాట్లలోనూ అన్‌బిలీవ‌బుల్‌ ఫీట్

Published Jul 17, 2025 09:37 AM IST

google News
  • టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి హిస్టరీ క్రియేట్ చేశాడు. క్రికెట్లో అసలైన కింగ్ తానే అని మరోసాని నిరూపించుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఇన్నేళ్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డు ఏంటో ఇక్కడ చూసేయండి. 
విరాట్ కోహ్లి (x/imVkohli)

విరాట్ కోహ్లి

అలవోకగా సెంచరీలు బాదేసి.. టన్నుల కొద్దీ పరుగులు చేసి.. రికార్డుల దుమ్ము దులిపే రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో అద్భుతం అందుకున్నాడు. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. సుదీర్ఘ చరిత్ర ఉన్న క్రికెట్లో ఇప్పటివరకూ మరే క్రికెటర్ కు సాధ్యం కాని ఫీట్ సొంతం చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఫార్మాట్లలోనూ 900 కి పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు విరాట్. మూడు ఫార్మాట్లలోనూ తన ఆధిపత్యానికి ఇదే రుజువు.


టీ20లతో రికార్డు

టెస్టు, వన్డే, టీ20ల్లో తనకు తిరుగులేదని విరాట్ మరోసారి చాటిచెప్పాడు. ఇప్పటికే టీ20, టెస్టులకు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఇప్పటికీ అతని రికార్డుల వేట మాత్రం ఆగడం లేదు. తాజాగా ఐసీసీ ప్రకటించిన రేటింగ్స్ లో టెస్టుల్లో 937 పాయింట్లు, వన్డేల్లో 909 పాయింట్లు, టీ20ల్లో 909 పాయింట్లతో కోహ్లి అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలోనూ 900 రేటింగ్ పాయింట్లు దాటిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ను ఐసీసీ అప్ డేట్ చేసింది. దీని ప్రకారం కోహ్లి రేటింగ్ పాయింట్లు 897 నుంచి 909కి పెరిగాయి. టీ20లో 900 రేటింగ్ పాయింట్లు దాటిన మూడో ఆటగాడు కోహ్లి, మలన్, సూర్యకుమార్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాడు.

1202 రోజులు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ బ్యాటర్ గా కోహ్లిగా తిరుగులేదు. అతను ఏకంగా 1202 రోజుల పాటు టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో కొనసాగాడు. క్రికెట్ చరిత్రలో మరే బ్యాటర్ కూడా కోహ్లీకి దగ్గర్లో లేడు. ప్రస్తుతం వన్డేల్లో కోహ్లి నాలుగో ర్యాంకులో ఉన్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ విక్టరీ తర్వాత పొట్టి ఫార్మాట్ కు, గత నెలలో టెస్టులకు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అతను టీమిండియా తరపున కేవలం వన్డేల్లోనూ ఆడనున్నాడు.

మళ్లీ ఎప్పుడు?

కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో కేవలం వన్డేలు మాత్రమే ఆడతాడు. గత నెలలో ఐపీఎల్ 2025లో అతని టీమ్ ఆర్సీబీ ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోహ్లి మళ్లీ మైదానంలో కనిపించలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది టీమిండియా. ఆ తర్వాత జరగాల్సిన బంగ్లాదేశ్ టూర్ పోస్ట్ పోన్ అయింది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో ఆగస్టులో మూడు వన్డేలు, టీ20ల సిరీస్ ఆడాలని బీసీసీఐ చర్చలు జరుపుతోంది. అదే సాధ్యమైతే ఆగస్టులో వన్డేల్లో విరాట్ ను మళ్లీ మైదానంలో చూడొచ్చు.