తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Tim Southee Sixes: టెస్టుల్లో క్రిస్‌గేల్ సిక్సర్ల రికార్డ్‌ని సమం చేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్.. ఇదెలా సాధ్యమంటే?

Tim Southee Sixes: టెస్టుల్లో క్రిస్‌గేల్ సిక్సర్ల రికార్డ్‌ని సమం చేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్.. ఇదెలా సాధ్యమంటే?

Galeti Rajendra HT Telugu

14 December 2024, 13:40 IST

google News
  • New Zealand vs England 3rd Test: న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు సిక్సర్లు కొట్టలేక ఇబ్బందిపడిన పిచ్‌పై టిమ్ సౌథీ అలవోకగా మూడు సిక్సర్లు కొట్టేశాడు. దాంతో క్రిస్‌గేల్ అరుదైన రికార్డ్‌ను కూడా ఈ పేసర్ సమం చేశాడు. 

టిమ్ సౌథీ
టిమ్ సౌథీ (AFP)

టిమ్ సౌథీ

టెస్టుల్లో న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్‌గేల్ రికార్డ్‌ను న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ సమం చేశాడు. అది కూడా బ్యాటింగ్‌లో సిక్సర్లు రికార్డ్ కావడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక ఫాస్ట్ బౌలర్‌కి ఇదెలా సాధ్యమైంది? అని నెటిజన్లు తెగ చర్చిస్తున్నారు.

టాప్ ఆర్డర్‌ విఫలమైన చోట సిక్సర్లు

ఇంగ్లాండ్‌తో హామిల్టన్ వేదికగా శనివారం ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్‌లో 10 బంతులు ఎదుర్కొన్న టిమ్ సౌథీ ఒక ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. న్యూజిలాండ్ జట్టులోని టాప్ -7 బ్యాటర్లు కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయిన పిచ్‌పై టిమ్ సౌథీ సునాయాసంగా 3 సిక్సర్లు కొట్టడం గమనార్హం.

తొలి రోజు కివీస్ 315/9

సౌథీ జోరుతో 300లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన న్యూజిలాండ్ టీమ్.. ఈరోజు ఆట ముగిసే సమయానికి 315/9తో నిలిచింది. ఆ జట్టులో కెప్టెన్ టామ్ లాథమ్ (63), మిచెల్ శాంట్నర్ (50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఇంగ్లాండ్ బౌలర్లు మాథ్యూ పోట్స్, అట్కిసన్ చెరో మూడు వికెట్లు, బ్రైడన్ రెండు, బెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.

2008 నుంచి టెస్టుల్లో ఆడుతున్న టిమ్ సౌథీ.. ఇప్పటి వరకు 107 టెస్టు మ్యాచ్‌లు ఆడి 2243 పరుగులు చేశాడు. ఇందులో 215 ఫోర్లు, 98 సిక్సర్లు ఉన్నాయి.

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. టాప్-5లో టిమ్ సౌథీ నిలిచాడు.

  • బెన్ స్టోక్స్ - 133 సిక్సర్లతో టాప్‌లో ఉండగా..
  • బ్రెండన్ మెకల్లమ్ - 107 సిక్సర్లు
  • ఆడమ్ గిల్‌క్రిస్ట్ - 100 సిక్సర్లు
  • టిమ్ సౌథీ - 98 సిక్సర్లు
  • క్రిస్ గేల్ - 98 సిక్సర్లతో టాప్-5లో కొనసాగుతున్నారు

టాప్ రికార్డ్‌పై సౌథీ కన్ను

36 ఏళ్ల టిమ్ సౌథీ.. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డ్‌ను కూడా బద్ధలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ టిమ్ సౌథీ దూకుడుగా ఆడుతున్నాడు. వికెట్ గురించి కంగారు లేకుండా బంతిని బలంగా హిట్ చేస్తున్నాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో.. టాప్-5లో ఇప్పుడు యాక్టీవ్ క్రికెటర్లుగా బెన్‌స్టోక్స్, టిమ్ సౌథీనే ఉండటం గమనార్హం. మిగిలిన ముగ్గూరు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు.

తదుపరి వ్యాసం