తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 3rd Test: బ్రిస్బేన్‌ టెస్టు మ్యాచ్‌కి స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన సచిన్ కూతురు.. గిల్ కోసమేనన్న నెటిజన్లు

IND vs AUS 3rd Test: బ్రిస్బేన్‌ టెస్టు మ్యాచ్‌కి స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన సచిన్ కూతురు.. గిల్ కోసమేనన్న నెటిజన్లు

Galeti Rajendra HT Telugu

14 December 2024, 21:44 IST

google News
  • Sara Tendulkar spotted at the Gabba: భారత యంగ్ క్రికెటర్‌తో సారా టెండూల్కర్‌ డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దాంతో అతని కోసమే గబ్బాకి వచ్చిందని నెటిజన్లు సరదాగా మీమ్స్ చేస్తున్నారు. 

సారా టెండూల్కర్
సారా టెండూల్కర్

సారా టెండూల్కర్

బ్రిస్బేన్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం మూడో టెస్టు ప్రారంభమైంది. కానీ.. వర్షం కారణంగా.. ఎక్కువ ఓవర్ల మ్యాచ్ జరగలేదు. అయితే.. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్త సారా టెండూల్కర్ రావడంతో.. అందరి చూపు ఆమెపై పడింది.

భారత్ జట్టులో రెండు మార్పులు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. అశ్విన్, హర్షిత్ రాణా స్థానంలో రవీంద్ర జడేజా, ఆకాశ్ దీప్ తుది జట్టులోకి వచ్చారు. అదే సమయంలో ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. స్కాట్ బోలాండ్ స్థానంలో జోష్ హేజిల్‌వుడ్ తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్

తొలి రోజు మొదటి సెషన్‌లోనే వర్షం కారణంగా రెండు సార్లు ఆట నిలిచిపోయింది. లంచ్‌కు ముందు వర్షం పడటంతో ఆట తిరిగి ప్రారంభం కాలేదు. దాంతో ఆదివారం అరగంట ముందుగానే ఆట ప్రారంభంకానుంది. వాతావరణం అనుకూలిస్తే 98 ఓవర్లు ఆడించే అవకాశం ఉ:ది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 47 బంతుల్లో 19 పరుగులు చేయగా, నాథన్ మెక్ స్వీనీ 33 బంతుల్లో కేవలం 4 పరుగులు చేశాడు. దాంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 28/0తో నిలిచింది.

గిల్ కోసమే వచ్చిందంటూ సెటైర్లు

వర్షం కారణంగా తొలిరోజు ఆట నిలిచిన కాసేపటికే సారా టెండూల్కర్ బ్రిస్బేన్ స్టేడియానికి మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దాంతో నెటిజన్లు.. శుభమన్ గిల్ పేరుని తెరపైకి తెచ్చి.. ఇద్దరికీ ముడిపెడుతూ మీమ్స్ షేర్ చేశారు. గతంలో శుభమన్ గిల్, సారా టెండూల్కర్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం