తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rcb Vs Csk Live Updates: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. సూపర్ విక్టరీ.. చెన్నైకు నిరాశ
RCB vs CSK Live Updates: కోహ్లి వ‌ర్సెస్ ధోనీ - నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు ఎవ‌రిదో? - వ‌ర్షం వ‌ల్ల ఆగితే లాభం ఎవ‌రికి?
RCB vs CSK Live Updates: కోహ్లి వ‌ర్సెస్ ధోనీ - నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు ఎవ‌రిదో? - వ‌ర్షం వ‌ల్ల ఆగితే లాభం ఎవ‌రికి?

RCB vs CSK Live Updates: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. సూపర్ విక్టరీ.. చెన్నైకు నిరాశ

19 May 2024, 0:41 IST

RCB vs CSK Live Updates: ఐపీఎల్‌ 2024 సీజన్‍లో నేడు (మే 18) చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‍లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో 27 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ చేరింది ఆర్సీబీ. చెన్నైకు నిరాశ ఎదురైంది. లీగ్ దశలోనే ఆ జట్టు ఎలిమినేట్ అయింది.

19 May 2024, 0:41 IST

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ చేరిన జట్లు

ఐపీఎల్ 2024 సీజన్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాయి. ప్లేఆఫ్స్‌లో ఈ నాలుగు జట్లు తలపడనున్నాయి. మిగిలిన ఆరు జట్లు లీగ్ దశలో ఎలిమినేట్ అయ్యాయి.

19 May 2024, 0:06 IST

ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు

ఈ మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ప్లేఆఫ్స్ చేరాలంటే బెంగళూరు కనీసం 18 పరుగుల తేడాతో గెలువాల్సి ఉండగా.. దాన్ని సాధించేసింది.

19 May 2024, 0:06 IST

బెంగళూరు గెలుపు

20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు మాత్రం చేసింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో బెంగళూరు 27 పరుగుల తేడాతో గెలిచింది. ప్లేఆఫ్స్ చేరేందుకు 201 పరుగులు చేయాల్సి ఉండగా.. దానికి 10 పరుగుల దూరంలో చెన్నై నిలిచిపోయింది. దీంతో బెంగళూరు ప్లేఆఫ్స్ చేరింది.

18 May 2024, 23:57 IST

గెలుపుకు 35.. ప్లేఆఫ్స్ చేరాలంటే 17

చెన్నై సూపర్ కింగ్స్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్ చేరాలంటే చివరి ఓవర్లో ఆ జట్టు 17 పరుగులు చేయాలి. గెలువాలంటే 35 పరుగులు చేయాలి. ధోనీ (11 బంతుల్లో 19 నాటౌట్), రవీంద్ర జడేజా (20 బంతుల్లో 42 పరుగులు) ఆడుతున్నారు.

18 May 2024, 23:44 IST

ఉత్కంఠగా మ్యాచ్

చెన్నై సూపర్ కింగ్స్ గెలువాలంటే 26 బంతుల్లో 86 పరుగులు చేయాలి. ప్లేఆఫ్స్ చేరాలంటే 50 పరుగులు చేయాలి. క్రీజులో రవీంద్ర జడేజా (12 బంతుల్లో 18 పరుగులు), ఎంఎస్ ధోనీ (12 నాటౌట్) ఉన్నారు. 16 మ్యాచ్‍ల్లో 6 వికెట్లకు 151 రన్స్ చేసింది చెన్నై.

18 May 2024, 23:31 IST

సాంట్నర్ ఔట్

చెన్నై బ్యాటర్ మిచెల్ సాంట్నర్ (4 బంతుల్లో 3 పరుగులు) ఔట్ అయ్యాడు. సాంట్నర్ షాక్ కొట్టగా.. బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుతంగా జంప్ చేసి సూపర్ క్యాచ్ పట్టాడు. దీంతో 15 ఓవర్లలో 129 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయి మరిన్ని కష్టాల్లో పడింది చెన్నై.

18 May 2024, 23:22 IST

దూబే ఔట్

చెన్నై ప్లేయర్ శివమ్ దూబే (15 బంతుల్లో 7 పరుగులు) ఔటయ్యాడు. గ్రీన్ బౌలింగ్‍లో భారీ షాట్‍కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 13.4 ఓవర్లలో 119 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయింది చెన్నై.

18 May 2024, 23:19 IST

రచిన్ రనౌట్

కీలక సమయంలో చెన్నై బ్యాటర్ రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61 పరుగులు) రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. 13 ఓవర్లలో 115 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది చెన్నై. గెలుపునకు 42 బంతుల్లో చెన్నై 104 పరుగులు చేయాలి. ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాలంటే 86 రన్స్ చేయాలి.

18 May 2024, 23:13 IST

రచిన్ రవీంద్ర హాఫ్ సెంచరీ

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (33 బంతుల్లో 58 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేరాడు. 12 ఓవర్లలో 3 వికెట్లకు 110 పరుగులు చేసింది చెన్నై. శివమ్ దూబే (11 బంతుల్లో 4 నాటౌట్) ఇబ్బందులు పడుతున్నాడు.

18 May 2024, 23:00 IST

RCB vs CSK IPL 2024: రహానే ఔట్

చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (22 బంతుల్లో 33 పరుగులు) పెవిలియన్ చేరాడు. పదో ఓవర్లో లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్‍లో ఔటయ్యాడు. దీంతో 9.1 ఓవర్లో 85 పరుగుల వద్ద చెన్నై మూడో వికెట్ కోల్పోయింది.

18 May 2024, 22:43 IST

దూకుడు పెంచిన చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ 6 ఓవర్లలో 2 వికెట్లకు 58 పరుగులు చేసింది. అజింక్య రహానే (12 బంతుల్లో 22 నాటౌట్) దీటుగా ఆడుతున్నాడు. రచిత్ రవీంద్ర (16 బంతుల్లో 23 నాటౌట్) నిలకడగా సాగుతున్నాడు.

18 May 2024, 22:25 IST

మిచెల్ ఔట్.. కోహ్లీ సూపర్ క్యాచ్

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ డారిల్ మిచెల్ (6 బంతుల్లో 4 పరుగులు) ఔటయ్యాడు. మూడో ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్‍లో మిచెల్ కొట్టిన బంతిని విరాట్ కోహ్లీ సూపర్ క్యాచ్ పట్టాడు. దీంతో 2.2 ఓవర్లలో 19 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది చెన్నై.

18 May 2024, 22:14 IST

రుతురాజ్ గోల్డెన్ డక్

219 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) తొలి బంతికి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. బెంగళూరు బౌలర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‍లో తొలి బంతికే క్యాచ్ ఔట్ అయ్యాడు రుతురాజ్.

18 May 2024, 22:12 IST

ప్లేఆఫ్స్ చేరాలంటే..

ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‍లో కనీసం 18 పరుగుల తేడాతో బెంగళూరు గెలవాలి. 200 పరుగులు అంతకంటే తక్కువకు చెన్నైను కట్టడి చేయాలి. 200 పరుగుల కంటే ఎక్కువ చేసినా.. గెలిచినా చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుంది.

18 May 2024, 21:58 IST

బెంగళూరు భారీ స్కోరు

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. పాఫ్ డుప్లెసిస్ (54), విరాట్ కోహ్లీ (41), రజత్ పాటిదార్ (41), కామెరూన్ గ్రీన్ (38 నాటౌట్) అదరగొట్టారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు, సాంట్నర్, దేశ్‍పాండే చెరో వికెట్ తీశారు. చెన్నై సూపర్ కింగ్స్ ముందు 219 పరుగుల దీటైన టార్గెట్ ఉంది.

18 May 2024, 21:42 IST

పాటిదార్ ఔట్

బెంగళూరు బ్యాటర్ రజత్ పాటిదార్ (23 బంతుల్లో 41 పరుగులు) ఔటయ్యాడు. మంచి హిట్టింగ్ చేసిన తర్వాత అతడు 18వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‍లో పెవిలియన్ చేరాడు. దీంతో 17.4 ఓవర్లలో 184 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది బెంగళూరు.

18 May 2024, 21:36 IST

పాటిదార్ దూకుడు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 17 ఓవర్లలో 3 వికెట్లకు 171 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ 22 బంతుల్లో 41 పరుగులతో దూకుడుగా ఆడుతున్నాడు. సూపర్ హిట్టింగ్ చేస్తున్నాడు. కామెరూన్ గ్రీన్ (12 బంతుల్లో 23 నాటౌట్) కూడా వేగంగా సాగుతున్నాడు.

18 May 2024, 21:22 IST

దూకుడుగా సాగుతున్న ఆర్సీబీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 15 ఓవర్లలో 2 వికెట్లకు 138 పరుగులు చేసింది. బ్యాటర్ రజత్ పాటిదార్ (14 బంతుల్లో 23 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు. కామెరూన్ గ్రీన్ (11 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.

18 May 2024, 21:09 IST

హాఫ్ సెంచరీ తర్వాత డుప్లిసెస్ ఔట్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (39 బంతుల్లో 54 పరుగులు; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) 13వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. పాటిదార్ కొట్టిన బంతి బౌలర్ మిచెల్ శాంట్నర్ వేళ్లను తాకి నాన్ స్ట్రయికర్ ఎండ్‍లో వికెట్లకు తాకింది. దీంతో అప్పటికే క్రీజులోకి చేరుకోని డుప్లెసిస్ దురదృష్టకర రీతిలో రనౌట్ అయ్యాడు. 13 ఓవర్లలో 113 పరుగుల వద్ద బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది.

18 May 2024, 20:54 IST

విరాట్ కోహ్లీ ఔట్

బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 47 పరుగులు) ఔట్ అయ్యాడు. చెన్నై స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ వేసిన పదో ఓవర్ నాలుగో బంతికి కోహ్లీ భారీ షాట్ ఆడగా.. బౌండరీ వద్ద మిచెల్ క్యాచ్ పట్టేశాడు. 10 ఓవర్లలో ఒక వికెట్‍కు 78 పరుగులు చేసింది ఆర్సీబీ. ఫాఫ్ డుప్లెసిస్ (32 నాటౌట్), రజత్ పాటిదార్ (0 నాటౌట్ బ్యాటింగ్) చేస్తున్నారు.

18 May 2024, 20:37 IST

జోరు తగ్గిన బెంగళూరు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 ఓవర్లలో 42 పరుగులు చేసింది. కాస్త జోరు తగ్గింది. విరాట్ కోహ్లీ (15 బంతుల్లో 22 పరుగులు), ఫాఫ్ డుప్లెసిస్ (19 పరుగులు) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. వాన తర్వాత పిచ్ బ్యాటింగ్‍కు కాస్త కఠినంగా మారడంతో ఆర్సీబీ జోరు తగ్గింది. చెన్నై స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్, తీక్షణ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

18 May 2024, 20:27 IST

వాన బంద్.. ఆట మళ్లీ షురూ

చిన్నస్వామి స్టేడియంలో వర్షం ఆగిపోయింది. దీంతో ఆట మళ్లీ మొదలైంది. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.

18 May 2024, 19:48 IST

వర్షంతో బ్రేక్

చెన్నై, బెంగళూరు మ్యాచ్‍కు వర్షం ఆటంకం కలిగించింది. బెంగళూరు 3 ఓవర్లు బ్యాటింగ్ చేశాక వరుణుడు వచ్చేశాడు. దీంతో మ్యాచ్ నిలిచింది.

18 May 2024, 19:46 IST

బెంగళూరు దూకుడు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 31 పరుగులు చేసింది. మూడో ఓవర్లో విరాట్ కోహ్లీ (19 నాటౌట్) రెండు సిక్స్‌లు కొట్టాడు. ఫాఫ్ డుప్లెసిస్ (12 నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు.

18 May 2024, 19:31 IST

బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆర్సీబీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ మొదలుపెట్టింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనింగ్‍కు వచ్చారు.

18 May 2024, 19:19 IST

IPL 2024 RCB vs RCB Live: తుది జట్లు ఇలా..

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జీత్ సింగ్, మహీశ్ తీక్షణ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు: ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లూకీ ఫెర్గూసన్, మహమ్మద్ సిరాజ్

18 May 2024, 19:03 IST

టాస్ గెలిచిన చెన్నై

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్‍కు దిగనుంది.

18 May 2024, 18:48 IST

రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ

మరో 76 పరుగులు చేస్తే ఐపీఎల్‍లో 8000 పరుగులకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేరుకుంటాడు. ఈ మార్క్ చేరే తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు 250 ఐపీఎల్ మ్యాచ్‍ల్లో 7,924 రన్స్ చేశాడు విరాట్.

18 May 2024, 18:21 IST

ఆకాశం మేఘావృతం

ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియంలో వర్షం పడడం లేదు. ఆకాశం మేఘావృతమై ఉంది.

18 May 2024, 17:52 IST

చిన్నస్వామిలో అభిమానుల సందడి

చెన్నై, బెంగళూరు మ్యాచ్‍కు అభిమానులు అప్పుడే తరలి వస్తున్నారు. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియం వద్ద వర్షం నిలిచిపోయింది. స్టేడియం వద్ద ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు.

18 May 2024, 17:21 IST

పాయింట్ల పట్టికలో ఎక్కడ..

ఐపీఎల్ సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 13 మ్యాచ్‍ల్లో 7 గెలిచి ఆరు ఓడింది. 14 పాయింట్ల (0.52 నెట్‍ రన్‍రేట్)తో ఉంది. రాయల్ చాలెండర్స్ బెంగళూరు 13 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచి ఓడి ఓడింది. 13 పాయింట్లు (0.387)తో ఉంది. ఏడో స్థానంలో ఉంది. నేడు ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‍తో ప్లేఆఫ్స్ చేరే నాలుగో జట్టు ఏదో తేలనుంది.

18 May 2024, 16:24 IST

హెడ్‍ టూ హెడ్‍లో చెన్నైదే పైచేయి

ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరస్పరం 32 మ్యాచ్‍ల్లో తలపడ్డాయి. వీటిలో 21సార్లు చెన్నై విజయం సాధిస్తే.. బెంగళూరు 10సార్లు గెలిచింది. ఓ మ్యాచ్ ఫలితం తేలలేదు. రెండు జట్ల హెడ్ టూ హెడ్‍లో చెన్నైదే ఆధిపత్యంగా ఉంది.

18 May 2024, 15:10 IST

బెంగళూరులో వర్షం

బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో తాజాగా వర్షం మొదలైంది. దీంతో ఆర్సీబీ, చెన్నై మ్యాచ్‍పై అభిమానుల్లో టెన్షన్ పెరుగుతోంది.

18 May 2024, 14:40 IST

ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే...

నేటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే భారీ తేడాతో గెల‌వాలి. అప్పుడే ర‌న్‌రేట్ మెరుగుప‌డి ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. 20 ఓవర్ల ఆట జరిగి ఒక‌వేళ ఆర్‌సీబీ మొద‌ట బ్యాటింగ్ చేస్తే 18 ప‌రుగుల తేడాతో చెన్నైపై విజ‌యం సాధించాలి. ఒక‌వేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే చెన్నై విధించిన టార్గెట్‌ను ప‌ద‌కొండు లేదా అంత‌కంటే ఎక్కువ బాల్స్ మిగిలుండ‌గానే ఛేదించాలి. అప్పుడే ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుంది.

18 May 2024, 13:54 IST

ఆరెంజ్ క్యాప్ రేసు - కోహ్లి టాప్‌

ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసులో 661 ప‌రుగుల‌తో కోహ్లి టాప్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. కోహ్లికి చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గ‌ట్టిపోటీనిస్తోన్నాడు. 581 ప‌రుగుల‌తో రుతురాజ్ సెకండ్ ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. కోహ్లి ఫామ్ చూస్తుంటే అత‌డే నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిల‌వ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

18 May 2024, 13:27 IST

సీఎస్‌కే వ‌ర్సెస్ ఆర్‌సీబీ

నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు ఎవ‌రిద‌న్న‌ది శ‌నివారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రుగ‌నున్న మ్యాచ్‌తో తేల‌నుంది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌రుగ‌నుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి