తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Auction Unsold Players: అన్‌సోల్డ్‌గా మిగిలిన టాప్ క్రికెటర్లు, తక్కువ ధరకే వస్తున్నా పట్టించుకోని ఫ్రాంఛైజీలు

IPL 2025 Auction Unsold Players: అన్‌సోల్డ్‌గా మిగిలిన టాప్ క్రికెటర్లు, తక్కువ ధరకే వస్తున్నా పట్టించుకోని ఫ్రాంఛైజీలు

Galeti Rajendra HT Telugu

25 November 2024, 16:44 IST

google News
  • IPL Auction 2025 Live: ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు బౌండరీలు కొట్టగల సామర్థ్యం ఉన్న పృథ్వీ షాని వేలంలో ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు. ఒకే మ్యాచ్‌లో సిక్సర్లు కొట్టడంతో పాటు వికెట్లు తీయగల శార్ధూల్‌నీ లెక్కలోకి తీసుకోలేదు. 

ఐపీఎల్ 2025 వేలం
ఐపీఎల్ 2025 వేలం (HT_PRINT)

ఐపీఎల్ 2025 వేలం

ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా ప్లేయర్లకి కూడా నిరాశ తప్పడం లేదు. వేలంలో రెండో రోజైన సోమవారం చాలా మంది భారత క్రికెటర్లతో పాటు.. విదేశీ పవర్ హిట్టర్లకి కూడా ఫ్రాంఛైజీలు మొండిచేయి చూపాయి. ఫిట్‌నెస్‌, ఫామ్, నిలకడని పరిగణలోకి తీసుకుంటున్న ఫ్రాంఛైజీలు.. చాలా మంది భారత క్రికెటర్లు తక్కువ ధరకే వస్తున్నా పట్టించుకోవడం లేదు. 

  • అజింక్య రహానె రూ.1.50 కోట్ల కనీస ధరతో వేలానికిరాగా.. అతడ్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.
     
  • ఓపెనర్ మయాంక్ అగర్వాల్ రూ.1 కోటితో వేలానికి రాగా.. ఎవరూ కొనుగోలు చేయలేదు
     
  • ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసక ఓపెనర్ పృథ్వీ షా రూ.75 లక్షలతో వేలానికి వచ్చినా ఏ టీమ్ బిడ్ వేయలేదు
     
  • భారత్ జట్టులో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా ఓ వెలుగు వెలిగిన శార్ధూల్ ఠాకూర్ రూ.2 కోట్లతో వేలానికి రాగా.. అతడ్ని ఎవరూ పట్టించుకోలేదు.
     
  • తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత రూ.75 లక్షలతో వేలానికి రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు అతను గతంలో ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బిడ్ వేసే సాహసం చేయలేదు.
     
  • సీనియర్ స్పిన్నర్ పీయూస్ చావ్లా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకిరాగా.. ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు
     
  • న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రూ.2 కోట్లతో వేలానికిరాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీసం పట్టించుకోలేదు
     
  • ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ రూ.1 కోటితో వేలానికి రాగా అమ్ముడుపోలేదు
     
  • వెస్టిండీస్ పవర్ హిట్టర్ షై హోప్ రూ.1.25 కోట్లతో వేలానికి వచ్చినా అమ్ముడుపోలేదు
     
  • న్యూజిలాండ్ బ్యాటర్ డార్లీ మిచెల్ రూ.2 కోట్లతో వేలానికిరాగా.. ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.
     
  • న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ రూ.2 కోట్లతో వేలానికిరాగా.. ఎవరూ పట్టించుకోలేదు

తదుపరి వ్యాసం