తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Nitish Kumar Reddy Tirumala: మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి.. వీడియో వైరల్

Nitish Kumar Reddy Tirumala: మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి.. వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu

14 January 2025, 12:55 IST

google News
    • Nitish Kumar Reddy Climb Tirumala Stairs Video: భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు ఎక్కు మరి మొక్కు తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ వీడియాలో వైరల్ అవుతోంది.
మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి.. వీడియో వైరల్
మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి.. వీడియో వైరల్

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి.. వీడియో వైరల్

Nitish Kumar Reddy Climb Tirumala Stairs Video: ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టీమ్ ఇండియాకు చేదు అనుభవం కలిగించింది. తొలి టెస్టులో 295 పరుగుల భారీ స్కోరుతో విజయం సాధించినప్పటికీ, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-3తో భారత్ కోల్పోయింది.

తొలి టెస్ట్‌లో సెంచరీ

ఈ ఓటమితో, టీమ్ ఇండియా కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. ఇక ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లు ఆడనున్నాయి. టీమ్ ఇండియా ఓడిపోయినప్పటికీ తన అరంగేట్రం టెస్ట్‌లో సెంచరీని కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.

దిగ్గజాలతో సహా

సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డిపై ఇండియన్ క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపించారు. మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి తన అద్భుత సెంచరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలతో సహా దేశం మొత్తం నితీష్ కుమార్ సెంచరీని సంబరాలు చేసుకుంది.

ఫొటోలు, వీడియోలు వైరల్

ఇక ఈ సిరీస్ ఇప్పుడు ముగిసినందున ఈ 21 ఏళ్ల ఆల్ రౌండర్ ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి దేవాలయాన్ని సందర్శించుకున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకుంటే మోకాళ్లపై నడిచి తన మొక్కులు చెల్లించుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి.

మోకాళ్లపై ఎక్కి

తిరుమల తిరుపతి దేవాలయపు మెట్లను తన మోకాళ్లపై ఎక్కి మొక్కులు చెల్లించాడు నితీష్ కుమార్ రెడ్డి. దాంతో తిరుమల శ్రీవారిపై తనకున్న భక్తిని చూపించాడు నితీష్ కుమార్‌ రెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో నితీష్ కుమార్ రెడ్డిని అంతా ప్రశంసిస్తున్నారు.

ఘన స్వాగతం

ఇదిలా ఉంటే, తిరుమల సందర్శనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వస్థలమైన విశాఖపట్నంలోని విమానాశ్రయానికి చేరుకున్న నితీష్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయలుదేరిన నితీష్‌ కుమార్‌పై తన అభిమానులు భారీ పూలమాలను వేసి అభిమానాన్ని చాటుకున్నారు.

భారీగా అభిమానులు

విశాఖపట్నంలోని గాజువాకలో నివాసముంటున్న నితీష్ కుమార్ రెడ్డి ఓపెన్ జీపులో ముందు సీటులో కూర్చున్నాడు. అతని వెంట తండ్రి ముత్యాలు వాహనంలో వెనుక కూర్చున్నాడు. అలాగే, ఈ ఆల్‌రౌండర్‌ను చూసేందుకు అభిమానులు భారీగా హాజరయ్యారు.

టెస్ట్ వివరాలు

ఇదిలా ఉంటే, ఐదు మ్యాచుల్లో నితీష్ 37.25 సగటుతో 298 పరుగులు చేశాడు, తద్వారా ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అతని 114 పరుగులతో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఒక తొలి టెస్ట్ సెంచరీ చేశాడు. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని నితీష్ కుమార్ తండ్రి ముత్యాలు రెడ్డి, తల్లి మానస, సోదరి తేజస్వి, మామ సురేంద్ర వీక్షించారు. అనంతరం బౌలింగ్‌లో 44 పరుగులు ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి ఐదు వికెట్లు తీశాడు.

తదుపరి వ్యాసం