తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Lsg Vs Kl Rahul: లక్నో టీమ్ ఓనర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కేఎల్ రాహుల్.. కాస్త ఫ్రీడమ్ కావాలంటూ..

LSG vs KL Rahul: లక్నో టీమ్ ఓనర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కేఎల్ రాహుల్.. కాస్త ఫ్రీడమ్ కావాలంటూ..

Hari Prasad S HT Telugu

13 November 2024, 8:42 IST

google News
    • LSG vs KL Rahul: లక్నో టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకాకు గట్టి కౌంటర్ ఇచ్చాడు కేఎల్ రాహుల్. ఐపీఎల్ రిటెన్షన్స్ విషయంలో ఆయన చేసిన కామెంట్స్ పై తాజాగా స్పందించిన రాహుల్.. కాస్త ఫ్రీడమ్ ఉన్న జట్టు కోసం చూస్తున్నానని అనడం గమనార్హం.
లక్నో టీమ్ ఓనర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కేఎల్ రాహుల్.. కాస్త ఫ్రీడమ్ కావాలంటూ..
లక్నో టీమ్ ఓనర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కేఎల్ రాహుల్.. కాస్త ఫ్రీడమ్ కావాలంటూ.. (X Image)

లక్నో టీమ్ ఓనర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కేఎల్ రాహుల్.. కాస్త ఫ్రీడమ్ కావాలంటూ..

LSG vs KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ తో కేఎల్ రాహుల్ జర్నీ ముగిసిన విషయం తెలుసు కదా. అతన్ని ఆ టీమ్ రిటెయిన్ చేసుకోలేదు. పైగా వ్యక్తిగత రికార్డుల కంటే టీమ్ ప్రయోజనాలు ముఖ్యమనుకునే ప్లేయర్స్ నే తాము రిటెయిన్ చేసుకున్నామని లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కామెంట్ చేశారు. దీనికి కేఎల్ రాహుల్ కూడా గట్టిగా బదులిచ్చాడు.

గోయెంకా కామెంట్స్ ఇవీ

లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కెప్టెన్ కేఎల్ రాహుల్ ను వదిలేసింది. నికొలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆయుష్ బదోనీ, మోసిన్ ఖాన్ లను రిటెయిన్ చేసుకుంది. దీనిపై ఎల్ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా స్పందించాడు. గెలవాలన్న మైండ్ సెట్ తో ఉన్న ప్లేయర్స్ నే తాము రిటెయిన్ చేసుకున్నట్లు అతడు చెప్పాడు.

"గెలవాలన్న మైండ్‌సెట్ తో ఉన్న ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకున్నామంతే. ఎవరైతే వ్యక్తిగత లక్ష్యాల కంటే టీమ్ ప్రయోజనాల కోసం ఆడతారో అలాంటి వాళ్లలో ప్రధాన ప్లేయర్స్ ను మేము రిటెయిన్ చేసుకున్నాం" అని స్టార్ స్పోర్ట్స్ లో సంజీవ్ గోయెంకా చేసిన కామెంట్స్ ను ప్రదర్శించారు. దీనిపై రాహుల్ స్పందించాడు.

రాహుల్ కౌంటర్ ఇలా..

సంజీవ్ గోయెంకా కామెంట్స్ పై రాహుల్ స్పందించాడు. తాను టీమ్ లో నుంచి వెళ్లిపోవాలని ముందే డిసైడ్ అయ్యానని, కాస్త ఫ్రీడమ్ ఉండే జట్టు కోసం చూస్తున్నట్లు అతడు చెప్పాడు. "నిర్ణయం ముందే తీసుకున్నాం. ఆ కామెంట్స్ ఏంటో నాకు తెలియదు. కానీ రిటెన్షన్స్ తర్వాత ఆ కామెంట్ చేశారని అనుకుంటున్నాను. ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని అనుకున్నాను. కాస్త ఫ్రీడమ్ ఉండే చోట ఆడాలని భావించాను. టీమ్ వాతావరణం కూడా కాస్త బాగుండి, సమతుల్యంగా ఉండాలని అనుకున్నాను. ఎందుకంటే ఐపీఎల్లో ఎలాగూ చాలా ఒత్తిడి ఉంటుంది" అని రాహుల్ అన్నాడు.

"గుజరాత్ టైటన్స్, సీఎస్కే, ఇతర జట్లను చూడండి. గెలిచినా, ఓడినా వాళ్లు చాలా బ్యాలెన్స్ తో ఉంటారు. కామ్ గా ఉంటారు. ఓ ప్లేయర్ గా నాకు అది చాలా అవసరం. అలా జరిగినప్పుడు ప్రతి ప్లేయర్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు" అని రాహుల్ అన్నాడు. లక్నో టీమ్ లోనూ కోచ్ లతో అలాంటి వాతావరణమే క్రియేట్ చేసినా.. ఏదో సమయంలో టీమ్ ను వదిలి మరింత మంచి కోసం వెళ్లాల్సిందే కదా అని రాహుల్ స్పష్టం చేశాడు.

గత సీజన్లో సన్ రైజర్స్ తో మ్యాచ్ తర్వాత గ్రౌండ్ లోనే రాహుల్ పై సంజీవ్ గోయెంకా మండిపడటం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అప్పుడే అతడు టీమ్ ను వదిలేస్తాడని అనుకున్నారు. సీజన్ మధ్యలోనే తప్పుకుంటాడని భావించినా.. మిగిలిన మ్యాచ్ లలోనూ కొనసాగాడు. ఇప్పుడు ఊహించినట్లే లక్నో అతన్ని రిటెయిన్ చేసుకోలేదు. వేలంలో రాహుల్ పై సన్ రైజర్స్ కూడా కన్నేసినట్లు తాజాగా ఆ టీమ్ ఓనర్ కావ్య మారన్ ట్వీట్ చూస్తే తెలుస్తోంది. మరి అతన్ని ఏ జట్టు సొంతం చేసుకుంటుందో చూడాలి.

తదుపరి వ్యాసం