తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Auction: ఈ ఐదుగురు ప్లేయర్స్‌పై కన్నేసి ఉంచండి.. ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొడతారా?

IPL 2025 Auction: ఈ ఐదుగురు ప్లేయర్స్‌పై కన్నేసి ఉంచండి.. ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొడతారా?

Hari Prasad S HT Telugu

20 November 2024, 7:50 IST

google News
    • IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఐదుగురు యువ ఆటగాళ్లపై ఓ కన్నేసి ఉంచండి. ఈ ప్లేయర్స్ పై వేలంలో కోట్లు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఐదుగురు ప్లేయర్స్‌పై కన్నేసి ఉంచండి.. ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొడతారా?
ఈ ఐదుగురు ప్లేయర్స్‌పై కన్నేసి ఉంచండి.. ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొడతారా? (PTI)

ఈ ఐదుగురు ప్లేయర్స్‌పై కన్నేసి ఉంచండి.. ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొడతారా?

IPL 2025 Auction: ఐపీఎల్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు ఇండియన్ క్రికెట్ కు దొరికారు. ప్రతి సీజన్ లోనూ కొంత మంది యువ ఆటగాళ్లు తమ ఆటతీరుతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఈసారి ఐపీఎల్ మెగా వేలం సందర్భంగా ఐదుగురు ప్లేయర్స్ ఆసక్తి రేపుతున్నారు. వీళ్లకు వేలంలో ఎన్ని కోట్లు వస్తాయో అన్న చర్చ జోరుగా నడుస్తోంది.

ఐపీఎల్ 2025 వేలం

ఐపీఎల్ 2025 వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో జరగనున్న విషయం తెలిసిందే. అన్ని టీమ్స్ కొత్త లుక్ తో మరోసారి రాబోతున్న నేపథ్యంలో వేలంలో ఏయే ప్లేయర్స్ దశ తిరగబోతోందో అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వేలంలోనూ అంతర్జాతీయ క్రికెట్ ఆడని కొందరు ప్లేయర్స్ పై కోట్ల వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైభవ్ అరోరా

కేకేఆర్ తరఫున అద్బుతంగా రాణించి ఈ ఏడాది వాళ్లు మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన బౌలర్ వైభవ్ అరోరా. పేస్ బౌలింగ్ అమ్ములపొదిలో వైభవ్ మంచి అస్త్రంగా ఉండనున్నాడు. దీంతో ఫ్రాంఛైజీలు అతనిపై కన్నేశారు. పవర్ ప్లేలో మెరుగైన బౌలింగ్ అతని బలం. మరి వేలంలో వైభవ్ డిమాండ్ ఎంత వరకూ ఉంటుందో చూడాలి.

అశుతోష్ శర్మ

ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరఫున పలు మ్యాచ్ లలో మెరుపులు మెరిపించి ఆశ్చర్యపరిచాడు అశుతోష్ శర్మ. పవర్ హిట్టర్, ఫినిషర్. ఇలాంటి ప్లేయర్ కోసం చాలా ఫ్రాంఛైజీలు ఆసక్తిగా ఉంటాయి. 167 స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకుంటున్నాడు.

అంగ్‌క్రిష్ రఘువంశీ

2022లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ రఘువంశీ. ఈ ఏడాది ఐపీఎల్లో కేకేఆర్ తరఫున కొన్ని మెరుపులు మెరిపించాడు. 19 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నెక్ట్స్ యశస్వి జైస్వాల్ గా అభివర్ణిస్తున్నారు. దీంతో ఈ ఢిల్లీ ప్లేయర్ కు ఈ సారి వేలంలో మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

రసిఖ్ సలామ్ దర్

రసిఖ్ సలామ్ దర్.. ఇతడో పేస్ బౌలర్. రన్స్ కాస్త ఎక్కువగా ఇస్తాడని పేరున్నా.. వికెట్లు కూడా తీయగలడు. ఎమర్జింగ్ ఏషియా కప్ లో 4 మ్యాచ్ లలో 9 వికెట్లు తీసి ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. ఓ మంచి అన్‌క్యాప్డ్ థర్డ్ పేస్ బౌలర్ కోసం ఎదురు చూస్తున్న ఫ్రాంఛైజీ అతనిపై కన్నేయొచ్చు.

అభినవ్ మనోహర్

అభినవ్ మనోహర్ టాప్ బ్యాటర్. ఈ ఏడాది గుజరాత్ టైటన్స్ అతన్ని సరిగా ఉపయోగించుకోలేదు. కానీ తన సత్తా ఏంటో కర్ణాటకలో జరిగిన మహారాజా ట్రోఫీ టీ20 టోర్నీలో నిరూపించాడు. ఏకంగా 196.5 స్ట్రైక్ రేట్ తో 507 రన్స్ చేశాడు. ప్రస్తుతం ఇండియన్ టీమ్ తో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ వేలంలో ఫ్రాంఛైజీలను ఆకర్షిస్తోంది.

తదుపరి వ్యాసం